రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
చిత్రం:లవ్ రెడ్డి
రేటింగ్: 3.25/5
బాటమ్ లైన్: “A powerful climax that perfectly captures love and emotion.”
నటి నటులు: అంజన్ రామచంద్ర, శ్రావణి కృష్ణవేణి తదితరులు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
మ్యూజిక్ డైరెక్టర్: ప్రిన్స్ హెన్రీ
సినిమాటోగ్రఫీ: కె శివ శంకర్ వర ప్రసాద్, మోహన్ చారి , అష్కర్ అలీ
ప్రొడక్షన్: గీతాన్ష్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్
సహ నిర్మాతలు: సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవికిరణ్, జకారియా
నిర్మాత: సునంద బి రెడ్డి, హేమలత రెడ్డి, రవీంద్ర జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి
రచన–దర్శకత్వం: సమరన్ రెడ్డి
లవ్ రెడ్డి మూవీ రివ్యూ: Love Reddy Movie Review #FilmCombat
అంజన్ రామచంద్ర(Anjan Ramachandra), శ్రావణి కృష్ణవేణి(Sravani Krishnaveni) నటి నటులుగా తెరకెక్కిన చిత్రం ‘లవ్ రెడ్డి’. స్మరన్ రెడ్డి దర్శకత్వంలో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా ఈ ‘లవ్ రెడ్డి’ సినిమా తెరకెక్కింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రీలిజ్ కానున్న సందర్భంగా, ముందు రోజు ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులకు ప్రీమియర్ షో నిర్వహించారు. సో, అసలు కథలో కి వెళ్దాం…
కథ:
‘ఆంధ్ర-కర్ణాటక’ బోర్డర్ రాయలసీమ ప్రాంతంలో, ప్రతి ఒక్కరితో కలవడి గా ఉండే ఫ్యామిలీలో పుట్టి పెరిగిన హీరో ‘నారాయణ రెడ్డి’(అంజన్ రామచంద్ర). బెంగుళూరులో తన ఫ్రెండ్ తో కలిసి ‘పార్టనర్’ గా బిజినెస్ చేస్తుంటాడు. ౩౦ ఏళ్ళు పైబడడంతో ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తే అమ్మాయిలు నచ్చలేదు అంటూ రిజెక్ట్ చేస్తాడు. ఒక రోజు దివ్య(శ్రావణి కృష్ణవేణి) అనే అమ్మాయిని చూసి లవ్ లో పడతాడు. అదే టైంలో నారాయణ రెడ్డి పెళ్లి సంబంధానికి వెళ్లి, స్వీటీ(జ్యోతి) అనే అమ్మాయిని యాక్సెప్ట్ చేసి రిజెక్ట్ చేస్తాడు.
ఆ తరువాత దివ్య క్లోజ్ అవ్వడంతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు? దివ్య నాన్న కోసం గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేస్తాడు? మరి, జాబ్ వచ్చిందా? పోయిందా? దివ్య ప్రేమలో పడి తన లైఫ్ లో బిజినెస్ ఎలా పోగుట్టుకున్నాడు? ప్రేమలో హీరో ఎలాంటి ఇబ్బందులు ఫెస్ చేసాడు? చివరికి తన ప్రేమ దక్కిందా? స్వీటీ కి, దివి కి సంబంధం ఏంటి? అనేది తెలియాలి అంటే మీరు సినిమా తప్పకుండ థియేటర్ లో చుడాలిసిందే…
విశ్లేషణ:
ఎన్ని యాక్షన్ మాస్ మసాలా సినిమాలు వచ్చిన బలమైన స్టోరీ, స్క్రీన్ ప్లేతో ఒకే ఒక్క లవ్ స్టోరీ చాలు ట్రెండ్ సెట్ చేయడానికి, అలాంటి కోవకి చెందిన సినిమానే ఈ ‘లవ్ రెడ్డి’. 20 మంది కొత్త వాళ్ళని పరిచయం చేస్తూ, సరికొత్త కథని అందించిన టీం కి అభినందనలు.
సినిమా మొత్తంలో హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ హైలైట్. హీరోయిన్ ఇంట్రడక్షన్ చాలా క్యూట్ అండ్ excitement గా ఉంటుంది. అప్పటి వరుకు ఎవ్వరు నచ్చని హీరో కి దివ్య ప్రేమలో పడటంతో లవ్ రెడ్డి గా మారిపోతాడు. హీరో & తన ఫ్యామిలీ తో సాగే కామిడి ప్రతి ప్రేక్షకుడు చూసే విధంగా చూడముచ్చటగా ఉంటుంది. ప్రాణం కన్నా.. ప్రేమించినా ఎమోషనల్ సాంగ్‌గా వచ్చిన ఈ పాట థియేటర్ లో ఎంతో హార్ట్ టచ్చింగ్‌గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ పర్వాలేదు. అక్కడక్కడా వచ్చే ఎమోషన్స్ చాలా సెటిల్డ్ గా ఉంటాయి. అలాగే సీమ యాస డైలాగ్స్ ఇప్పటి తరం వాళ్లకి కాస్త అర్ధం కాకపోవచ్చు. సెకండ్ హాఫ్ లో కాస్త స్లో గా అనిపిస్తున్న టైం లో, ప్రీ క్లైమాక్స్ ఎవ్వరు ఊహించారు.
ఒక అమ్మాయిని ప్రాణం కన్నా ప్రేమిస్తే, ఆ ప్రేమ దూరం అవ్వుతుంటే, తనని తాను మర్చిపోయి రకరకాలుగా బిహేవ్ చేయడం కేవలం అది ప్రేమకే సాధ్యం. నిజమైన ప్రేమని దక్కించుకోవడానికి పడే పాట్లు ఈ సినిమా క్లైమాక్స్ ఒక నిదర్శనం, క్లైమాక్స్ ప్రతి ఒక్కరి హృదయాల్ని కదిలిస్తుంది. సినిమా లో ప్రతి ఒక్కరు తమ ఎఫర్ట్స్ పెట్టారు. ఇలాంటి సినిమాని ప్రతి ప్రేక్షకుడు ఆదరించాలి, అందరు థియేటర్ లో చుడాలిసిన సినిమా ఈ లవ్ రెడ్డి.
నటి నటులు పెర్ఫామెన్స్:
హీరోయిన్ ‘శ్రావణి కృష్ణవేణి’ సినిమాలో ది బెస్ట్ కేరీర్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అసలు ఆ చీర కట్టులో తెలుగింటితనం, తన ప్రెజెన్స్ సినిమాకి అసెట్ అనే చెప్పాలి. ఈ సినిమాతో హీరోయిన్ గా మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. హీరో ‘అంజన్ రామచంద్రని’ తెరపైన చూసినంత సేపు ‘హీరో కార్తీ’ గుర్తుకు రావడం సహజం. అటు కామిడి, ఇటు ఎమోషన్స్ ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ, ప్రేక్షకులు తన క్యారెక్టర్ లో ఇమిడిపోయి హత్తుకునేంత పెర్ఫామెన్స్ ఇచ్చారు. కన్నడ నటుడు NT రామస్వామి, దివ్య నాన్న పాత్రలో అదరగొట్టేసాడు. తమ్ముడి పాత్రలో నటించిన గణేష్, స్వీటీ ఇద్దరు కీలక పాత్ర పోషించారు. రవి కాలబ్రహ్మ, తిలక్ తదితరులు తమ పరిధి మేరకు బాగా రాణించారు.
సాంకేతిక విభాగం:
స్టోరీ, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉన్నప్పటికీ, డైలాగ్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ద తీసుకొని ఉంటే బాగుండేది. కానీ, సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు లవ్ ట్రాన్స్ లోకి వెళ్తారు. ‘డైరెక్షన్’ స్కిల్స్ సూపర్బ్. సినిమాకి మంచి ప్రసంశలు రావడం ఖాయం. ‘మ్యూజిక్ & బ్యాగ్రౌండ్’ స్కోర్ ఈ సినిమాకి ప్రధాన బలం. ‘ఎడిటింగ్’ పని తీరు బాగుంది. ఒక ‘రా’ కంటెంట్ కి కావలిసిన ‘విజ్యువల్స్’, సస్పెన్స్ థ్రిల్లర్ కి అన్ని హంగులు ‘డిఓపి’ అందించారు. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్. ఈ తరంలో కూడా, ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేసి థియేటర్ లో రీలిజ్ చేసిన ‘ప్రొడక్షన్ బ్యానర్’ కి అభినందనలు.
గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.