సాయిచంద్ర, గ్రీష్మ, జంటగా తెరకెక్కిన పాట “ఎర్రమంజిల్ కాలనీ”. V3 ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ పాటకి ‘శ్రీరామ్ రొంపల్లి’ లిరిక్స్ తో పాటు దర్శకత్వం వహించారు. వికారాబాద్ తాండూర్ లో పుట్టి పెరిగిన దర్శకుడు ‘శ్రీరామ్ రొంపల్లి’, బ్రిటిష్ నేల మీద ఐర్ల్యాండ్ లో తెలుగు వాళ్లంతా ఏకమై ఈ సాంగ్ ని చిత్రీకరించడం గొప్ప విషయం. “ఎర్రమంజిల్ కాలనీ” అనగానే మొదటగా గుర్తొచ్చేది హైదరాబాద్ “ఎర్రమంజిల్”. తెలంగాణ నేల మీద ఎంత మమకారం ఉంటే ఈ సాంగ్ ని దర్శకుడు చిత్రీకరిస్తారు.
అందమైన మంచు కొండల మధ్య సాగుతున్న ఈ పాటకి ‘సాయిచంద్ర’ ఎంతో అలవోకగా చేసిన డ్యాన్స్ తో పాటు ఆయ్యన గ్రెస్, ఈ సాంగ్ కి ప్రధాన అసెట్ అనే చెప్పాలి. అలాగే, గ్రీష్మ అందం, డ్యాన్స్ తో తెలుగింటి అమ్మాయిలా చాలా చక్కగా చేసింది. రియల్ లైఫ్ లో సాయిచంద్ర, గ్రీష్మ ఇద్దరు భార్య-భర్తలుగా ముచ్చటైన జోడి అయ్యినప్పటికీ, తెర మీద కూడా అదే కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. ఐర్లాండ్ దేశంలో తెరకెక్కించడంతో ప్రేక్షకులకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫీల్ కలుగుతుంది. “ఎర్రమంజిల్ కాలనీ పిల్ల పేరేమో మోహిని చూస్తుంటే ఆమని” అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవ్వుతుంది.
ఈ అద్భుతమైన పాట కి ‘శ్రీరామ్ రొంపల్లి’ నిర్మాత గా ఖర్చు ఎక్కడా వెనకాడకుండా భారీగా నిర్మించి తనలోని మల్టీ టాలెంట్ తో పాటు, రిస్క్ కూడా చేసారు. పాపులర్ సింగర్ అరుణ్ కౌండిన్య తన స్వరంతో అద్భుతంగా పాడగా, మ్యూజిక్ డైరెక్టర్ సాహిత్య సాగర్ ఈ సాంగ్ కి ప్రాణం పెట్టి సంగీతాన్ని అందించారు. తమ కెరీర్ లో మొదటి ఆల్బం సాంగ్ ని ఈ రేంజ్ లో తెరకెక్కించిన సాంగ్ యూనిట్ మొత్తానికి హ్యాట్స్ ఆఫ్. ఈ “ఎర్రమంజిల్ కాలనీ” పాట ఇంకా పెద్ద హిట్టవ్వాలని ‘ఫిల్మ్ కంబాట్’ టీం తరుపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.