రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
చిత్రం: “క”
రేటింగ్: 3.25/5
బాటమ్ లైన్: Thrills Galore: Climax That Shocks!
నటి నటులు: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్ తదితరులు
ఎడిటర్: శ్రీ వరప్రసాద్
మ్యూజిక్ డైరెక్టర్: శ్యామ్.సి.యస్
సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డానియల్, సతీష్ రెడ్డి మాసం
సమర్పణ: శ్రీమతి చింతా వరలక్ష్మి
ప్రొడక్షన్: శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్
సహ నిర్మాతలు: చింతా వీనిషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి
నిర్మాత: చింతా గోపాలకృష్ణ రెడ్డి
రచన–దర్శకత్వం: సుజిత్ & సందీప్
“క” మూవీ రివ్యూ: Ka Movie Review #FilmCombat
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు.ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రీలిజ్ కానున్న సందర్భంగా, ముందు రోజు ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులకు ప్రీమియర్ షో నిర్వహించారు. సో, అసలు కథలో కి వెళ్దాం…
కథ:
‘అభినయ వాసుదేవ్'(కిరణ్ అబ్బవరం) ఒక అనాధ. ఉద్యోగం రీత్యా 1977లో ‘కృష్ణగిరి’ అనే ఊరిలో రంగారావు (అచ్యుత్ కుమార్) దగ్గర టెంపరరీ ‘పోస్ట్ మ్యాన్’ గా ఉద్యోగం చేస్తాడు. అలా ఉత్తరాలతో ‘కృష్ణగిరి’ ఉరి ప్రజలకి దగ్గరవుతూనే, రహస్యమైన ఉత్తరాలు ఎవ్వరికి తెలియకుండా చదివే ఒక చెడు అలవాటు ఉంటుంది. ఇంతలో, రంగారావు కూతురు ‘సత్యభామ’(నయన్ సారిక)తో ప్రేమలో పడి, ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటారు. చాలా మంది అమ్మాయిలు తెల్లవారు జామున ఆ ఊర్లో మిస్ అవ్వుతుంటారు. అసలు అమ్మాయిలు మిస్సింగ్ వెనకాల ఉన్నది ఎవ్వరు? కారణం ఏంటి? రాధ (తన్వి రామ్) టీచర్ కి, అభినయ వాసుదేవ్ కి సంబంధం ఏంటి? ఉత్తరాలు రహస్యంగా చదవటం వల్ల వాసుదేవ్‌కు వచ్చిన సమస్యలు ఏంటి? అసలు ఈ కథను ముందుకు నడిపే ఆ ముసుగు వ్యక్తి ఎవరు? అన్నది థియేటర్లో చూడాల్సిందే. ఆ మిషన్ ఏంటి?
విశ్లేషణ:
కిరణ్ అబ్బవరం గత రెండు చిత్రాల విషయంలో ప్రేక్షకులకి నిరాశే మిగిలింది. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. మరి, ఈ సినిమాతో అయ్యిన కిరణ్ అబ్బవరం మల్లి ఉపందుకున్నాడా లేదో చూద్దాం!
ముఖ్యంగా కాంతార, విరూపాక్ష సినిమాలకి, ‘క’ సినిమా కి పొంతనే లేదు. ఈ సినిమా ఒక సైకలాజికల్ గా కథ లోకి ఎంట్రీ అవ్వుతుంది. మొదట్లో అసలు కథ ఎవ్వరికి అర్ధం కాదు! ఎవరు ఏంటి ఎక్కడ అనే సస్పెన్స్ తో మూవీ రసవత్తంగా సాగుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుంది అనేది కనిపెట్టాలంటే థియేటర్స్ లో ప్రేక్షకులకి ఒక అగ్ని పరీక్షా లాంటిదే! ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ లు ఊహించలేం. ఈ మధ్య కాలంలో ఇలాంటి క్లైమాక్స్ తో ఇంతవరకు మూవీ రాలేదు. క్లైమాక్స్ లో ఎద్దుల బండి మీద చేసే యాక్షన్ సీక్వెన్సులు హైలైట్స్ గా నిలుస్తాయి. ముఖ్యంగా, సైకిల్ స్టీరింగ్ పట్టుకున్నప్పుడు బ్యాగ్రౌండ్ ఎలివేషన్ షాట్ అదుర్స్. సినిమాలో ఇంకాస్త హై & ఎమోషనల్ మూమెంట్స్ ఉంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేది. సినిమాలో పాటలు బాగుంటాయి.
చిత్రంలో షాట్ మేకింగ్ కొత్తగా తెరకెక్కించారు. ‘క’ మూవీ క్లైమాక్స్ ను కొత్తగా చెప్పడానికి ప్రయంత్నిచారు చిత్ర దర్శకులు. కాకపోతే, ఈ చిత్రం మొదట్లో డివైడ్ టాక్ తో నడిచి, హిట్ కొట్టే ఛాయలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ప్రేక్షకులు ‘క’ సినిమాని కొత్తదనం ఫీల్ కాకుంటే, నేను సినిమాలు చేయను! అనే బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం. ఎలాంటి గట్ ఫీలింగ్ తో చెప్పాడో కానీ, అది నిజం చేసి చూపించాడు. కొంత మందికి చెప్పి చేయడం అలవాటు అదే కోవకి చెందిన మన ‘క’ హీరో కిరణ్ అబ్బవరం స్పెషాలిటీ. మన సంకల్పం గొప్పది అయ్యితే అనుకున్నది జరుగుతుంది అంటారు ఇదే బెస్ట్ Example.
క సినిమా టైటిల్ జస్టిఫికేషన్ తెలియాలి అంటే, మూవీ క్లైమాక్స్ వరుకు మీరు తప్పకుండ థియేటర్ లో చుడాలిసిందే.
నటి నటులు పెర్ఫామెన్స్:
హీరో ‘కిరణ్ అబ్బవరం'(అభినయ వాసుదేవ్) ఎంతో ఇంటెన్సిటీ తో కలిగిన ఎమోషన్స్ ని చాలా చక్కగా పెర్ఫార్మ్ చేస్తూ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసి కేరీర్ ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. హీరోయిన్ ‘నయన్ సారిక'(సత్యభామ) కమ్మే చీకటి లో నిండు చందమామల కనిపిస్తూ, సావిత్రి లా తన కళ్ళతో, పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులని కట్టిపడేసింది. ‘తన్వీ రామ్'(రాధ) స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు ‘కి’ రోల్ పోషించి సూపర్బ్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. అచ్ఛుత్ కుమార్, రెడిన్ కింగ్ స్లే, అజయ్, శరణ్య ప్రదీప్ తదితరులు తమ పరిధి మేరకు బాగా రాణించారు.
సాంకేతిక విభాగం:
బలమైన స్టోరీ లైన్ తో పాటు, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా మలిచిన విధానం సూపర్బ్. సినిమా చూస్తున్నంత సేపు నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ కలుగుతుంది. ‘డైరెక్షన్’ స్కిల్స్ ఫస్ట్ మూవీ తోనే వావ్ అనిపించారు. సినిమాకి మంచి ప్రసంశలు రావడం ఖాయం. ‘మ్యూజిక్ & బ్యాగ్రౌండ్’ స్కోర్ ఈ సినిమాకి ప్రధాన బలం. ‘ఎడిటింగ్’ పని తీరు బాగుంది. ఒక ‘రా’ కంటెంట్ కి కావలిసిన ‘విజ్యువల్స్’, ఎంతో డిటైల్డ్ గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కి కావలిసిన అన్ని హంగులు ‘డిఓపి’ అందించారు. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేసి థియేటర్ లో రీలిజ్ చేసిన ‘వంశీ నందిపాటి’ గారికి అభినందనలు.
గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.