సినిమా అంటే ప్రేమ ఉండచ్చు కానీ సినిమా అంటే ప్రాణం గా భావిస్తారు కనుకే ఒక నటుడిగా , దర్శకుడిగా ,నిర్మాతగా , సింగర్ గా , రచయితగా , కొరియోగ్రాఫర్ గా.. ఇలా విభిన్న విభాగాల్లో తన ప్రతిభ చాటుతూ ప్రేక్షకుల చే ప్రేమ గా “ఉలగనాయగన్” అని పిలిపించుకుంటున్నారు మన కమల్ హస్సన్ ! ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు మన కమల్ హస్సన్ కి ముందుగా మన FILM COMBAT తరపున Wishing him a fabulous Birthday!!
వయసు 70 అంటే ఎవ్వరు నమ్మరు ఎందుకంటే , ఒక నటుడిగా తొలి చిత్రం లో అవకాశం వచ్చినపుడు ఎంత ఉత్సాహము గా ఉంటామో ఈయన ఇప్పటికే చేసే ప్రతి చిత్రానికి అదే ఉత్సాహము కనబరుస్తారు మరి అందుకే మన ఇండియన్ ఫిలిమ్స్ ని ప్రపంచానికి పరిచయం చేశారు తన చిత్రాల ద్వారా మన లోక నాయకుడు ! కమల్ హస్సన్ Birthday సందర్భంగా తన ఫిలిం జర్నీ మనము కూడా చుట్టోదాం రండి..
1954 నవంబర్ 7న, రామానంతపురం జిల్లా లోని పరమకుడి లో పుట్టిన పార్థసారధి శ్రీనివాసన్, 6 సంవత్సరాల వయసులోనే వెండి తెరకి పరిచయం అయ్యారు సావిత్రి జెమినీ గణేశన్ కాంబినేషన్ లో వచ్చిన ‘కాలాతూర్ కనమ్మ’ ద్వారా ,ఈ చిత్రం లోని తన నటనకి ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్ అందుకున్నారు! నటుడిగా తనని తాను తీర్చుదిద్దుకుంటూ పలు భాషల్లో నటిస్తూనే 1975 లో కే.బాలచందర్ దర్శకత్వంలో ‘అపూర్వ రాగంగల్ ‘ చిత్రం ద్వారా తమిళ్ ప్రేక్షకులకి మరింత దగ్గర అయ్యారు!
1978 లో విడుదలయిన ‘మరోచరిత్ర’ ద్వారా టాలీవుడ్ కి హీరో గా ఎంట్రీ ఇచ్చి , 1982 లో విడుదలయిన ‘మూన్ద్రం పిరై’ ( వసంత కోకిల ) తెలుగు ప్రేక్షకులకి ఒక అద్భుతమైన నటుడిని పరిచయం చేసింది , 1987 లో ‘నాయకన్’ ( నాయకుడు ) , సొమ్మోకొండది సోకుకడిది , ఇది కథ కాదు , ఆకలి రాజ్యం , సాగర సంగమం , స్వాతి ముత్యం వంటి చిత్రాలు కమల్ మన తెలుగు వాడే అన్న భావన కలిగేలా చేసాయి, అందుకే కమల్ హస్సన్ నటించిన అన్ని తమిళ్ చిత్రాలు అప్పటి నుంచి తెలుగు లోకి అనువాదం చెయ్యడం కనసాగుతూ వస్తుంది..
ఫైట్లు డాన్స్ చేస్తేనే హీరో అవ్వరు , స్వచ్ఛనమైన మనసు తో ఒక కుటుంబానికి తోడుగా ఉన్నా హీరో నే అంటూ ఒక డిఫరెంట్ రోల్ లో తన స్టైల్ తో అందరి మనసు కదిలించిన చిత్రం కే.విశ్వనాధ్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘స్వాతి ముత్యం’ , కూచిపూడి భరతనాట్యం , ఒడియా వంటి ఎన్నో నృత్యశైలి ల్లో శిక్షణ పొందడం వల్ల ‘సాగర సంగమం’ లో నటించడం కమల్ హస్సన్ కి తన టాలెంట్ ప్రూవ్ చేస్కోడానికి వచ్చిన మరో సదావకాశం అనచ్చు, విశ్వాసానికి మరో పేరుగా నిలిచి తను పని చేసే యజమాని కి నమ్మిన బంటుగా విశ్వనాధ్ గారి కాంబినేషన్ లో వచ్చిన మరొక చిత్రం ‘శుభసంకల్పం’.
భాగోద్వేగాలు తో పాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి experimental films పరిచయం చేసిందీ మన కమల్ హస్సనే. మాటలు లేకుండా కేవలం మ్యూజిక్ మరియు అభినయం తో సింగీతం శ్రీనివాస్ గారు తీసిన చిత్రం ‘పుష్పక విమానం’ , మరుగుజ్జుగా ‘అపూర్వ సహోదరులు’ , నాలుగు పాత్రల్లో నటించిన ‘మైఖెల్ మదన్ కామ రాజు’ , నిజమైన దేశభక్తి ని చాటే సేనాధిపతి పాత్రలో వచ్చిన ‘భారతీయుడు’ , స్త్రీ వేషం లో కనిపించిన ‘భామనే సత్యభామనే ‘,అందానికి నిర్వచనం ఏంటి ? ఒకరికి మంచి చేస్తే వారిలో మనకి భగవంతుడు కనిపిస్తాడా అన్న ప్రశ్నలకి సమాధానంగా ‘సత్యమే శివమ్’ , సైన్స్ ? దేవుడా ? అంటూ సాగే ‘దశావతారం’ , తన విశ్వరూపం చాటిన ‘విశ్వరూపం’ ఇలా కమల్ ఏ చిత్రం లో నటించినా దానికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది అనడం లో ఏ మాత్రం అతిశోయక్తి లేదు, అందుకే అవార్డ్స్ వెత్తుకుంటూ Kamal ని చేరుకుంటాయి..
హిందీ లో ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫర్ బెస్ట్ ఆక్టర్ ‘చాచి 420’ చిత్రానికి అందుకున్నారు ,అలానే బెస్ట్ స్టోరీ రైటర్ గా ‘విరాసట్’ చిత్రానికి అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక ఫిలిం ఫేర్ అవార్డ్స్ సౌత్ 14 సార్లు అందుకున్నారు పలు భాషల్లో . ఆకలి రాజ్యం, ఇంద్రుడు చంద్రుడు , సాగర సంగమం చిత్రాలకి ఉత్తమ నటుడిగా తెలుగు లో ఫిలిం ఫేర్ అవార్డ్స్ అలానే బంగారు నంది కూడా అందుకున్నారు కమల్.
అలానే మన భారత ప్రభుత్వం వారు ‘పద్మ భూషణ్’ మరియు ‘పద్మ శ్రీ’ తో కమల్ హస్సన్ ని సత్కరించారు. ఫ్రాన్స్ వారి ప్రతిష్టాత్మకమైన ‘Ordre des Arts et des Lettres’ కూడా మన కమల్ కైవసం చేస్కున్నారు. బహుముఖప్రజ్ఞాశాలి , మానవతావాది అయిన కమల్ హస్సన్ మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి దొరకడం మనం చేస్కున్న అదృష్టం,మరి ముందు తరాలకి కమల్ చిత్రాలు, కమల్ జీవితం ఇంకా స్ఫూర్తిగా నిలవాలి అని ఆశిస్తూ , Kamal Upcoming film THUG LIFE కి Good Luck చెప్తూ Once again Happy Birthday to our Universal Hero KAMAL!!!