రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
చిత్రం: “ఆదిపర్వం”(Adi Parvam)
రేటింగ్: 2.75/5
బాటమ్ లైన్: యాక్షన్, డివోషనల్ ఫిల్మ్.
నటీనటులు: మంచులక్ష్మీ, శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ, యోగికాత్రి, గడ్డంనవీన్, ఢిల్లీరాజేశ్వరి, జెమినీ సురేష్ తదితరులు
ఎడిటర్ : పవన్ శేఖర్ పసుపులేటి ,
సినిమాటోగ్రఫీ: ఎస్ ఎన్ హరీష్
మ్యూజిక్ : మాధవ్ సైబా – సంజీవ్ మేగోటి, బి. సుల్తాన్ వలి, ఓపెన్ బనానా, లుబెక్ లీ మార్విన్.
సమర్పణ: రావుల వెంకటేశ్వరరావు
సహనిర్మాతలు: గోరెంట శ్రావణి- ప్రదీప్ కాటుకూటి- రవిదశిక- రవి మొదలవలస- శ్రీరామ్ వేగరాజు.
నిర్మాత : ఎమ్. ఎస్ కె.
రచన, దర్శకత్వం: సంజీవ్ మేగోటి!!
“ఆదిపర్వం” మూవీ రివ్యూ: Adi Parvam Movie Review #FilmCombat

లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫాంటసీ మల్టీ లింగ్యుల్ ఫిల్మ్ ”ఆదిపర్వం”(Adi Parvam). ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం 8న థియేటర్లో గ్రాండ్ గా విడుదలైంది. ఇంతకీ, ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
1974-90 దశాబ్దంలో కడపలో ఎర్ర గుడి ప్రాంతాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న గ్రామ పెద్ద రాయప్ప(హ్యారీజోష్). కులం పట్టింపు ఉన్న ఇతనికి కుడి భుజంలా హనుమంతు(ఆదిత్య ఓం)కి మధ్య కొన్ని విబేధాలు కారణంగా విడిపోయి పగతో ఒకరికి ఒకరు రగిలిపోతుంటారు. చిన్న నాటి నుంచి ఆ ఇద్దరి కుటుంబాల పిల్లలు శ్రీను(వెంకట్ కిరణ్) బుజ్జమ్మ అలియాస్ మహా(శ్రీజిత ఘోష్) ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఇది ఇలా ఉంటే, ఎర్రగుడి గుహలో ఉండే గుప్త నిధి తమ సొంతం చేసుకుంటే కీర్తి, ప్రఖ్యాతలు పొందుతారని, ఆ ఊరి ఎమ్మెల్యే నాగమ్మ(మంచు లక్ష్మి), రాయప్ప సద విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. మరి వారిద్దరి లో ఎవ్వరి ప్రయత్నం ఫలించింది? గుప్త నిది కోసం వీరిద్దరూ చేసిన అరాచకాలు ఏంటి? దాని వళ్ళ ఎవ్వరు బలైయ్యారు? శ్రీను & మహా ప్రేమని ఇద్దరు కుటుంబాలు అంగీకరించాయా? రాయప్ప కి హనుమంతు మధ్య విబేధాలు ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మీరు తప్పకుండ సినిమా థియేటర్ లో చుడాలిసిందే?

విశ్లేషణ:
రాయలసీమ 70వ దశకం నుంచి 90వ దశకం వరుకు సాగే కథని దర్శకుడు సంజీవ్ మేగోటి రాసుకున్న విధానం, పాత్రలు డిజైన్ చేసిన విధానం బాగుంది. ప్రస్తుతం సినిమా ప్రేక్షకుల అభిరుచి కి దూరం ఉన్న కథగా అనిపిస్తుంది. రూటెడ్ ఎలీమెన్స్ తో చెప్పాలనుకున్న ప్రయత్నం బాగుంది. కులాంతర ప్రేమ కదా నిధుల వెంట పాయింట్ తో కాకుండా ఏదైనా కొత్త బ్యాక్ డ్రాప్ తో కథ చెప్పి ఉంటె, డెఫినెట్ గా ప్రేక్షకులు మరింత ఆదరించానికి స్కోప్ ఉండేది అనిపిస్తుంది. దర్శకుడిగా సంజీవ్ చేసిన పాత్ర బాగుంది. భారీ స్థాయిలో ఉన్న నటులు గురించి పెర్ఫామెన్స్ రాబట్టుకున్న తీరుకు మెచ్చుకోవలిసిందే.

నటి నటులు పెర్ఫామెన్స్:
మంచు లక్ష్మి(ఎమ్మెల్యే నాగమ్మ)గా తన నటనతో తో పాటు, దాదాపు ఏడు గెటప్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. నాగమ్మగా, అమ్మవారిగా చక్కటి వేరియేషన్ చూపించింది. కొన్ని సీన్లలో పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. హనుమంతు క్యారెక్టర్ లో ఆదిత్య ఓం నటన హైలైట్. ఎస్తర్ నోరోనా పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారు. అలాగే, బెంగాలి నటి శ్రీజిత ఘోష్, సుహాసినీ (“చంటిగాడు” ఫేం) కూడా కథలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారు. తదితరులు తమ పరిధి మేరకు బాగా రాణించారు.
సాంకేతిక విభాగం:
బలమైన స్టోరీ లైన్ ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంటే ఇంకా బాగుండేది. సినిమా చూస్తున్నంత సేపు నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ కలుగుతుంది. ‘డైరెక్షన్’ స్కిల్స్ ఓ మేరకు పర్వాలేదు. ‘మ్యూజిక్ & బ్యాగ్రౌండ్’ స్కోర్ ఈ సినిమాకి ప్రధాన బలం. ‘ఎడిటింగ్’ మీద ఇంకాస్త శ్రద్ద వహించాలిసింది. ఒక ‘రా’ కంటెంట్ కి కావలిసిన ‘విజ్యువల్స్’, ఎంతో డిటైల్డ్ గా ‘డిఓపి’ సమకూర్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.
గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.