బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అంటే ఫైట్లు డ్యూయెట్లు మాత్రమే అవసరం లేదు స్వచ్ఛమైన చిత్రం అయితే చాలు అని నిరూపించిన డైరెక్టర్ రాధాకృష్ణ అదే అండీ మన డైరెక్టర్ క్రిష్ ! గమ్యం చిత్రం ద్వారా టాలీవుడ్ లో తన గమ్యం వైపు అడుగులు మొదలు పెట్టారు క్రిష్ 2008 లో, సంకల్పం మంచిది అయితే ప్రతిఫలం ఆశించినట్టే వస్తుంది అని పెద్దలు అన్నట్టుగానే గమ్యం పెద్ద హిట్ అవ్వడం అలానే అవార్డ్స్ కూడా రావడం తో తన స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్ తో మరిన్ని చిత్రాలు అందిస్తున్నారు క్రిష్.
1978 నవంబర్ 10th గుంటూరు లో జన్మించిన క్రిష్, U.S లో తన స్టడీస్ పూర్తి చేసి ,ఫిలిమ్స్ మీద మక్కువ తో తిరిగి ఇండియా వచ్చి తన కెరీర్ స్టార్ట్ చేసారు. తొలి చిత్రం కి నిర్మాతల కోసం ఎంతో వెతికి ఆఖరికి వాళ్ళ నాన్నగారు నిర్మాత గా ఆయన ఆశిషులుతోనే తొలి విజయం సాధించారు క్రిష్. గమ్యం తర్వాత వచ్చిన వేదం నిజంగా ఈ తరానికి వేదం లాంటిది అనడం లో అతిశోయక్తి లేదు, ఎందుకంటే ఆడంబరాలకు డబ్బుకి ప్రాధాన్యత ఇస్తూ మానవతా విలువలు మర్చిపోతున్న తరుణం లో ఎందరికో మేల్కొలుపు అయిన చిత్రం “వేదం”.
వేదం చిత్రం ఎంతో ప్రేక్షకాదరణ పొందడం తో ఈ చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ చేశారు ‘వానం’ పేరుతో మన డైరెక్టర్ క్రిష్. ఆ తర్వాత 2012 లో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుం’ రానా దగ్గుబాటి కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన చిత్రం గా చెప్పచ్చు. ప్రతి ఒక్కరిలో ఒక హీరో ఉంటాడు కానీ ఆ సందర్భం వచ్చినప్పుడే హీరోయిజం బయటపడుతుంది, పది మందికి మేలు చేస్తుంది అని ప్రూవ్ చేసిన యువకుడి కథే ‘కృష్ణం వందే జగద్గురుం’. ఇల్లీగల్ మైనింగ్ వల్ల నష్టపోతున్న కుటుంబాలకి అండ గా నిలిచిన ఒక సామాన్యుడు, హీరో గా ఎలా మారాడు అన్నదే ఈ చిత్రం.ముఖ్యంగా ఇందులోని టైటిల్ ట్రాక్ దశావతారాలని అభివర్ణిస్తూ స్టోరీ లైన్ కి తగ్గట్టు జోడించి డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన తీరు ఎప్పటికి గుర్తుండిపోతుంది.
రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వచ్చిన క్రిష్ తరువాతి చిత్రం కంచె, తన ప్రేమ కథ లో జరిగిన పోరాటం ,కులం మతం ఆస్తి అంతస్తులు అంటూ పెద్దలు వేసిన ఆ కంచె ని తెంచే ప్రయత్నం ఒక వైపు , యుద్దభూమి లో శత్రువు ని కంచె దాటనివ్వకుండా చేసే పోరాటం ఒక వైపు, రెండు సమపాళ్లలో చూపించడం వల్లే ప్రేక్షకుల ప్రశంసలు మాత్రమే కాదు అవార్డ్స్ సైతం సొంతం చేస్కుంది కంచె చిత్రం.
సొంతగా రాసిన కథలు తియ్యడం ఒక ఎత్తు అయితే , బయో పిక్స్ తియ్యడం మరో ఎత్తు అనే చెప్పాలి, మరి అందులోనూ మన నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడం అంటే ఎంతో గ్రౌండ్ వర్క్ , అలానే ఎంతో కృషి చేస్తే తప్ప సాధ్యం కాదు. మరి అలా డైరెక్టర్ క్రిష్ ఎంతో డెడికేషన్ తో తీర్చిదిద్ది మనకి అందించిన చిత్రాలు ఎన్.టి.ఆర్. కథానాయకుడు మరియు ఎన్.టి.ఆర్. మహానాయకుడు.
క్రిష్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రాత్మక చిత్రాలు బాలకృష్ణ గారి వందో చిత్రం అయిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ , కంగనా రనౌత్ నటించిన ‘మణికర్ణికా – ది క్వీన్ అఫ్ ఝాన్సీ’. ఈ రెండు చిత్రాలు కూడా క్రిష్ కెరీర్ లో తను ఏంటో నిరూపించుకోడానికి వచ్చిన చక్కని అవకాశాలు అని చెప్పచ్చు, ఎందుకంటే పౌరాణికాలు చారిత్రాత్మిక చిత్రాల నిర్మాణంలో చిత్రీకరణలో మేక్ అప్ , కాస్ట్యూమ్స్ , సెట్స్ దగ్గర నుంచి డైలాగ్స్ , మ్యూజిక్ , స్క్రీన్ ప్లే వరకు అన్ని అంశాల్లో ఎంత శ్రద్ధ వహించాలో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి అందులోను తన స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్ తో శభాష్ అనిపించుకున్నారు మన క్రిష్.
ఆక్టర్స్ అందరు డైరెక్టర్స్ కాకపోవచ్చు కానీ ప్రతి డైరెక్టర్ లో మాత్రం ఒక మంచి ఆక్టర్ దాగి ఉంటాడు . అలాగే మన డైరెక్టర్ క్రిష్ కూడా తన అన్ని చిత్రాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం మనకి తెల్సిన విషయమే , కానీ మహానటి అలానే ఎన్టీఆర్ కథానాయకు చిత్రాల్లో ‘డైరెక్టర్ కే వి రెడ్డి’ గారి బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీ తో తనని తాను నటుడిగా కూడా నిరూపించుకున్నారు.
మరి డైరెక్టర్ క్రిష్ కి మన విషెస్ తెలియచేస్తూ త్వరలో రానున్న అనుష్క శెట్టి ‘ఘాటీ ‘ , అలానే పవర్ స్టార్ పవర్ ప్యాకెడ్ ‘హరి హర వీర మల్లు’ సక్సెస్ సాధించాలి అని , క్రిష్ మానవతా విలువులని గుర్తు చేసే మరిన్ని చిత్రాలు మనకి అందివ్వాలి అని కోరుకుంటూ Happy Birthday to Director Krish!!