తెలుగులో టాప్ యాంకర్స్ లిస్ట్ బయటికి తీస్తే అందులో సుమ, ఝాన్సీ, ఉదయభాను గార్లతో పాటు నేటి యంగ్ అండ్ ఎనర్జీటిక్ డేరింగ్ అండ్ డాషింగ్ “యాంకర్ శ్యామల” గారి పేరు కూడా కచ్చితంగా ఉంటుంది. తనకి ఎలాంటి సినీ నేపధ్యం లేకపోయినప్పటికీ ఒక యాంకర్ గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఒక సీరియల్ ఆర్టిస్టుగా ఇలా రకరకాలుగా తెలుగు బుల్లితెర పై తనదయిన ముద్ర వేసుకున్నారు. అలాంటి శ్యామల గారు ఈరోజు తన 35వ జన్మదినం జరుపుకుంటున్నారు. మరి బుల్లితెర పై ఇన్నాళ్లు మనల్ని అలరించిన శ్యామల గారి పుట్టినరోజు సందర్భంగా ఒకసారి ఆవిడ జీవిత చరిత్ర ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్యామల గారు ఇప్పుడంటే ఒక సక్సెస్ ఫుల్ యాంకర్ గా మరియు క్యారెక్టర్ ఆరిస్టు గా ఫుల్ బిజీగా ఉన్నారు గారి నిజానికి ఆవిడ తొలినాళ్లలో చాలా కష్టాలు, బాధలు చూసారు. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ ప్రాంతంలో 5 నవంబర్ 1989వ సంవత్సరంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. శ్యామల గారి తండ్రి ఆవిడ పుట్టిన కొన్ని రోజులకే చనిపోయారు. అప్పటి నుంచి శ్యామల గారి ఆలనా పాలనంతా తల్లి సుజాత గారే దగ్గరుండి చూసుకునేవారు. శ్యామల గారు తన పాఠశాల విద్యాభ్యాసమంతా గవర్నమెంట్ బడిలోనే పూర్తిచేశారు. శ్యామల గారికి చిన్నప్పటి నుంచే సినిమాలన్నా, నాటకాలన్న పిచ్చి. స్కూల్ లో ఉన్నపుడే చదువుతో పాటు ఆటలు, పాటలు ఇలా అన్నిటిలో చురుగ్గా ఉండేవారు. స్వతహానే సినిమాల పై మక్కువ పెంచుకున్న శ్యామల గారు తన పదోవ తరగతి పూర్తవ్వగానే మారుమాట్లాడకుండా తట్ట బుట్ట సద్దుకొని తన తల్లితో సహా హైదరాబాద్ వచ్చేసారు.

హైదరాబాద్ వచ్చిన కొత్తలో సినిమా అవకాశాల కోసం చాలానే కష్టపడ్డారు. ఒక్క ఛాన్స్ కోసం ఆవిడ ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు కానీ ఎక్కడ ఆవిడకి అదృష్టం తలుపుతట్టలేదు. అయితే ఎంతటికి సినిమాల్లో అవకాశాలు రాకపోయేసరికి సీరియల్స్ లో ఆవిడా అదృష్టం పరీక్షించుకుంది. ఆఖరికి ఎలాగోలా దూరదర్శన్ వాళ్ళు నిర్వహిస్తున్న “వివాహబంధం” అనే ఒక సీరియల్ లో ఒక చిన్న క్యారెక్టర్ ఆరిస్టుగా అవకాశం వచ్చింది. అయితే ఆ సీరియల్ తో పాటు తెలుగు లో మరికొన్ని సీరియల్స్ లో నటించింది. కానీ అవేవి ఆమెకి అనుకున్నంత పేరు తీసుకురాలేదు. అలాంటి తరుణంలో 2009లో వచ్చిన “జగదేకవీరుడు అతి లోకసుందరి” అనే సీరియల్ శ్యామల గారి కెరీర్ కు కొంచం ఊరట. ఈ సీరియల్ తోనే ఆవిడకి మిగితా సీరియల్స్ తో పోలిస్తే కొంచం గుర్తింపు తెచ్చింది. ఈ సీరియల్ చేస్తున్న సమయంలో తన తోటి ఆర్టిస్ట్ అయినా నరసింహ తో సన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్త ప్రేమ గా మారి పెళ్లి వరకు దారి తీసింది.

పెళ్లి తర్వాత ఆవిడా సీరియల్స్ లో మెప్పించకపోయినప్పటికీ టీవీ షోస్ లో మాత్రం అదరగొట్టారు. “మా ఊరి వంట”, “పట్టుకుంటే పట్టుచీర”, “లక్ష్మి రావే” మా ఇంటికి వంటి ప్రోగ్రామ్స్ తో బుల్లితెర ప్రేక్షకులకి బాగా దగ్గరైయ్యారు. ఈ క్రమంలోనే ఆవిడకి బుల్లితెర ద్వారా ఏర్పడిన పరిచయాలతో సినిమాల్లో మళ్లీ ప్రయత్నించగా నాగచైతన్య “ఒక లైలా కోసం” సినిమా తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ వెండితెర పై తొలిసారి రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమా లో నాగ చైతన్య అక్కగా నటించిన ఆమె కూడా ఆ తరువాత కూడా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి. “లౌక్యం”, “బెంగాల్ టైగర్” వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-2 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన క్రేజ్ ని మరింత రెట్టింపు చేసుకున్నారు. నిజానికి బిగ్ బాస్ సీజన్-2 తర్వాత శ్యామల కి సినిమా అవకాశాలు నిలకడగా రావడం మొదలైయ్యాయి. “విరూపాక్ష”, “మాచర్ల నియోజకవర్గం”, “మాయ పేటిక” వంటి సినిమాల్లో తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులని కట్టిపడేసారు.
ఈ ఏడాది రాజకీయ రంగప్రవేశం ప్రవేశం!

ఇలా ఒకవైపు సినిమాలు, యాంకర్ గా టీవీ షోస్ చేస్తూనే ఇప్పుడు కొత్తగా రాజకీయాల పై మక్కువతో తన రాజకీయాల్లో కూడా తన ప్రస్థానం మొదలు పెట్టారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు “వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ” లో చేరి రాజకీయాల్లో తన ఉనికి మొదలు పెట్టారు. అయితే ఆ పార్టీ ఓడిపోయినప్పటికీ ఎక్కడ నిరాశ చెందకుండా తన పదునైన సంభాషణలతో చురుకైన చేష్టలతో ప్రత్యర్దులని ఎండగడుతూ తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం సఫలం కావాలని ఆశిస్తూ, అలాగే ఇన్ని రోజులు ఒక టీవీ యాంకర్ గా సీరియల్ ఆర్టిస్ట్ గా మరియు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇన్నాళ్లు మనల్ని అలరించిన శ్యామల గారికి కృతఙ్ఞతలు చెప్తూ ఆవిడా ఇలాగే మనల్ని ఇంకా మంచి మంచి పాత్రలతో అలరించాలని కోరుకుంటూ, రాజకీయాల్లో కూడా ఆమె ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటూ, “ఫిలిం కంబాట్” తరుపున 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్న శ్యామల గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు.