చిత్రం : ది షార్ట్ కట్
రేటింగ్: 2.5/5
నటీనటులు: ఆట సందీప్, సజ్జ శ్రీ తదితరులు
నిర్మాతలు: రంగారావు తోట, రజనీకాంత్ పున్నాపు
దర్శకత్వం: కంచి రామకృష్ణ
బ్యానర్: డిఎల్ ఎంటర్టైన్మెంట్స్
అట సందీప్, షాజ్ఞ శ్రీ హీరో హీరోయిన్లుగా శ్రీమతి కంచి షర్మిల సమర్పించు డిఎల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంగారావు తోట, రజనీకాంత్ పున్నాపు నిర్మాతలుగా కంచి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా “ది షార్ట్ కట్” విజయానికి అడ్డదారులు ఉండవు అనేది ఉప శీర్షిక. ఎస్ ఎన్ మీరా సినిమాటోగ్రాఫర్ గా చేయగా ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం సమకూర్చారు. ఈటీవీ ప్రభాకర్, హైదరాబాద్ నవాబ్ ఇస్మాయిల్, కాదంబరి కిరణ్, డిజె టిల్లు మురళి గౌడ్, బల్వీర్ సింగ్, రాకేష్ మాస్టర్, అభినవ్, వీరు ఇతర ముఖ్యపాత్రలో నటించారు.
కథ:
సినిమా డైరెక్టర్ గా ఎదగాలి అన్న కోరికతో ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లను కలిసి కథలు చెబుతూ ఉంటాడు హీరో ప్రకాష్(ఆట సందీప్). హీరోయిన్ దివ్య (షాజ్ఞ శ్రీ) ని ప్రేమిస్తాడు. సినిమా, డైరెక్షన్ వర్కౌట్ అవ్వదు నువ్వు ఉద్యోగం చేస్తే తప్ప మనిద్దరికీ పెళ్లి అవ్వదు అంటూ ప్రకాష్ వెంటపడుతుంది దివ్య. కానీ కచ్చితంగా డైరెక్టర్ అయి తీరుతాను అనకసితో ఉంటాడు ప్రకాష్. ప్రకాష్ తన స్నేహితుడు టెస్టర్(బల్వీర్ సింగ్) తో కలిసి ప్రొడ్యూసర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా హైదరాబాదులో డ్రగ్స్ మాఫియా గురించి తెలుసుకున్న పోలీసులు ఆ మాఫియాని అంతం చేసే ప్రయత్నంలో ఉంటారు. అలాంటి తరుణంలో ఆ డ్రగ్స్ ఉన్న బ్యాగ్ ప్రకాష్ చేతికి అందుతుంది. ఆ డ్రగ్స్ ని అమ్మి డబ్బు సంపాదించి తనే నిర్మాతగా సినిమా తీయాలనుకుంటాడు ప్రకాష్. కానీ అనుకోకుండా ఆ కేసులో డ్రగ్స్ మాఫియా డాన్ కు చిక్కుతాడు. ఆ డాన్ చేతి నుంచి హీరో బయటపడ్డాడా లేదా? తను అనుకున్నట్టుగా సినిమా తీశాడా లేదా? తెలుసుకోవాలి అంటే ‘ది షార్ట్ కట్’ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
సినిమా ఆద్యంతం మంచి థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది. కథ కథనాలు నటీనటుల పాత్రలు ఎక్కడా బోర్ కొట్టకుండా బాగా డిజైన్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నటీనటుల పాత్రలు, నటన చాలా బాగా వచ్చాయి. అక్కడక్కడ సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపించినా ఎక్కడ బోర్ కొట్టకుండా చూసుకున్నారు. విజయానికి అడ్డదారులు ఉండవు అనే కాన్సెప్ట్ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎదగాలనుకునే ఒక యువకుడి కథ.
నటీనటుల పనితీరు:
మనందరికీ మంచి డాన్సర్ గా తెలిసిన ఆట సందీప్ లోని నటుడు ఈ సినిమాలో కనిపిస్తాడు. డైరెక్టర్ అయ్యి తన ప్రేమను పొందాలి అనే తపన ఉన్న కుర్రాడిగా చాలా బాగా నటించాడు. షాజ్ఞ శ్రీ నటన క్యారెక్టర్జషన్ బాగున్నాయి. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈటీవీ ప్రభాకర్ గారి నటన అదే విధంగా డ్రగ్స్ మాఫియా కు సంబంధించి లోకల్ డాన్ క్యారెక్టర్ లో రాకేష్ మాస్టర్ నటన ప్రేక్షకులను అలరిస్తాయి. టెస్టర్ క్యారెక్టర్ లో బల్వీర్ సింగ్ సపోర్టింగ్ రోల్ లో చాలా బాగా నటించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
చిన్న సినిమా అయినా ప్రొడ్యూసర్లు రంగారావు తోట మరియు రజినీకాంత్ పున్నాపు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సినిమాని నిర్మించారు. మొదటిసారి అయినా మంచి కథ ఎంచుకుని కంచి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభను చూపించారు. ఆర్ఆర్ ద్రువన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్. ఎస్ ఎన్ మీరా సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది.
ఓవరాల్: ఎంగేజింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ