అభిమానం కి కొంత హద్దు అదుపు ఉండాలి లేదంటే అది ఎంత ప్రమాదకరమో ఈ మధ్య జరిగిన ఒక అనుకోని సంఘటన వలన అందరికి తెలిసింది. కాకపోతే ఇప్పుడు అలాంటి సంఘటన ఇంకొక హీరోకి జరిగితే ఎలా ఉంటుంది ఊహించుకోండి అంటూ ఒక అభిమాని ట్విట్టర్ (x) వేదికగా ఒక పోస్ట్ వేసాడు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది, చర్చనీయా అంశం అయ్యింది.
పూర్తి వివరాలలోకి వెళితే, అల్లు అర్జున్ సుకుమార్ కలయికతో వచ్చిన చిత్రం పుష్ప 2. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా అవ్వటంతో, ఆ టార్గెట్ రీచ్ అవ్వటానికి టికెట్స్ ధరలు పెంచినప్పటికీ అభిమానంతో ఎలాంటి ధరకైనా చూస్తాము అని బన్నీ అభిమానులు బెనిఫిట్ షో కి తరలి వచ్చారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ తన ప్రాణాలని కోల్పోయారు. దాని ఫలితమే, బన్నీ ని అరెస్ట్ చేసి, ఒక పెద్ద హై డ్రామా తరువాత విడుదల అయ్యారు. కానీ ఇదే సంఘటన తన అభిమాన నటుడు అయిన నటుడు, పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ కి వస్తే ఏమవుతుందో ఊహించుకోండి, నైజాం తగలబడిపోతుంది అని ఒక ట్వీట్ పెట్టాడు. అభిమానం ఉండొచ్చు, తన అభిమాన హీరో చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకోవచ్చు. స్తోమత తగ్గట్టుగా మళ్ళీ మళ్ళీ వెళ్లి చూడొచ్చు. కాకపోతే సక్సెస్ విషయంలో కంపేర్ చెయ్యటంతో మొదలుపెట్టి, అరెస్ట్ జరిగితే ఏమవుతుందో అనే ఒక చెత్త అంశం లో కూడా కంపేర్ చేస్తున్నారు. ఇది అభిమానం అనాలో, పైత్యం అనాలో అర్థం కావట్లేదు.
ఇలాంటి అభిమానులని, వాళ్ళ యొక్క ఆలోచనలని మార్చాలంటే ఒక్క ఆ హీరోలకే సాధ్యం. వల్లే ముందుకొచ్చి వాళ్ళ అభిమానులని మార్చాలి. అభిమానులకోసం ఎంతో కస్టపడి చిత్రాలని చేస్తున్నారు, అదే అభిమానుల భవిష్యత్తు కూడా అదే హీరో బాధ్యత. ఈరోజు ప్రాణం పోయింది, ట్విట్టర్ లో పిచ్చి డిస్కషన్స్ మొదలుపెడుతున్నారు. ఇలాంటివి ఆపకపోతే పోనుపోను ప్రతీ హీరోకి ఇలాంటివి ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు అని ఎక్సపర్ట్స్ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.