చిత్రం: ‘అరంగేట్రం’ | ‘Arangetram’
తారాగణం: శ్రీనివాస్ ప్రబన్, ముస్తఫా అస్కారి, పూజా రెడ్డి బోరా, సాయి శ్రీ వల్లపాటి, అనిరుధ్ తుకుంట్ల, ఇంధు, శ్రీవల్లి, రోషన్ జెడ్, జబర్దస్త్ సత్తి పండు తదితరులు….
ఎడిటర్: మధు
సంగీతం: గిడియన్ కట్టా
ఛాయాగ్రహణం: బురాన్ షేక్ (సలీమ్)
నిర్మాత: మహేశ్వరి కె
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ ప్రబన్
విడుదల తేదీ: 5-05-2023
శ్రీనివాస్ ప్రబన్, ముస్తఫా అస్కారి, పూజా రెడ్డి బోరా, సాయి శ్రీ వల్లపాటి, అనిరుధ్ తుకుంట్ల ప్రధాన పాత్రలు గా తెరకెక్కిన లేటెస్ట్ మిస్టిక్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ అరంగేట్రం’, ‘Arangetram’. కవచం ఫెమ్ డైరెక్టర్ శ్రీనివాస్ ప్రబన్ ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు యాక్టింగ్ కూడా చేసారు. ఇప్పటికే, విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుండి అనుహ్య స్పందన లభిస్తుంది. మహి మీడియా వర్క్స్ బ్యానర్ లో డైనమిక్ ప్రొడ్యూజర్ ‘మహేశ్వరి కె’ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రోజు విడుదలైన ‘అరంగేట్రం’ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.
కథ: ప్రతీ నెల 13వ తేదీన సిటీలో అమ్మాయిల మీద హత్యలు జరుగుతుంటాయి. అదే డేట్ లో ఒక రోజు ‘అనిరుధ్’ ప్రేమించిన ‘లావణ్య’(ఇందు) భర్త ని చంపడానికి ఒక ఫ్లాట్ కి వెల్లబొయ్యి మరో ఫ్లాట్ కి వెళ్తాడు. అక్కడ ‘శ్రీనివాస్ ప్రభన్’ తో ఫైట్ జరుగుతుంది? అసలు ఈ శ్రీనివాస్ ప్రభన్ ఎవ్వరు? లావణ్య’(ఇందు) భర్త అనుకోని చంపేశాడా? ఆ సైకో శ్రీనివాస్ ప్రభన్ ఏనా లేదంటే, ఇంకెవరైనా ఉన్నారా? ఆ సైకో ఎందుకు అమ్మాయిలను అదే డేట్‌కు చంపుకుంటూ వెళ్తున్నాడు? అన్నదే కథ.
కధనం, విశ్లేషణ: ఈ మధ్య కాలంలో వచ్చిన మాసూద, విరూపాక్ష ఇలాంటి మర్డర్ & మిస్టరీతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కి మంచి ఆదరణ లభిస్తుంది. ఇదే, కోవలోకి చెందిన అరంగేట్రం
లో కథ పరంగా దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సినిమాలో పెద్ద ఆర్టిస్టులని పెట్టుకోకుండా తక్కువ బడ్జెట్ లో ప్రొడ్యూజర్ కి లాభం చేకూర్చే విధంగా కొత్త ఆర్టిస్టులతో నెట్టుకొచ్చిన విధానం సూపర్బ్.
ట్విస్టులు, టర్న్ లు, సందర్భాన్ని బట్టి కామిడి అన్ని కలగలిపి ఓ బలమైన కథని రాసుకున్నాడు దర్శకుడు. వైష్ణవి ఇంట్లో వరుసగా సైకో కోసం వచ్చి ఇరుక్కుపోవడం, ఈ క్రమంలో వారి మధ్య వచ్చే సన్నివేశాలు ఒక పక్క భయంతో పాటు ఎంటర్‌టైనింగ్‌గా సాగుతాయి. ఇంటర్వెల్ టైమ్‌లో వచ్చే ట్విస్ట్, సైకో మిగిలిన వారితో ఆడే ఫజిల్ గేమ్, క్లైమాక్స్ కి ముందు నుంచి ఒక్కో ట్విస్ట్ రివీల్ అయిన విధానం బాగుంటుంది. సినిమాలో ఎలివేషన్ సీన్లు బాగున్నాయి.
ఇలాంటి కథ నిఖిల్, నాని, అడవి శేష్ లాంటి హీరో చేతిలో పడితే సినిమా నెక్ట్స్ లెవల్లో ఉండేది కాబోలు…!! దర్శకుడే హీరోగా మారి క్యారీ చేసే ప్రయత్నం చేసి ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్. ముఖ్యంగా, కొన్ని సీన్స్ లో ఆడియెన్స్ కి గూస్బంప్స్ తెప్పించేలా ఉంటాయి.
నటి నటులు పెర్ఫామెన్స్: శ్రీనివాస్ ప్రబన్ నటనకి కొత్త కావచ్చు కానీ, విలక్షణమైన నటనతో కీ రోల్ పోషిస్తూ అందరిని మెస్మరైజ్ చేసాడు. ముస్తఫా అస్కారి నెగిటివ్ పాత్రలో హావా భావాలను చాలా చక్కగా డెలివరీ చేసారు. పూజా రెడ్డి బోరా తెరపై పక్కింటి అమ్మాయిలా చాలా చక్కగా పాత్రలో ఓదిగిపోయింది. సాయి శ్రీ వల్లపాటి ఏ మాత్రం తడబడకుండ ఫైట్స్, పెర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుంది. అనిరుధ్ తుకుంట్ల యాక్టింగ్ బాగుంది. తెరపై హీరో ఛాయలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే, ఇంధు, శ్రీవల్లి, రోషన్ జెడ్, జబర్దస్త్ సత్తి పండు తదితరులు తమ పరిధి మేరకు బాగా రాణించారు….
సాంకేతిక విభాగం: డైరెక్టర్ ‘శ్రీనివాస్ ప్రభన్ ‘ కథ, కాస్టింగ్ ఎంచుకున్న తీరు, స్క్రీన్ ప్లే ఎంతో గ్రిప్పింగ్ గా మలిచిన విధానం సూపర్బ్. అక్కడక్కడ తెర మీద సుకుమార్ స్క్రీన్ ప్లే ఛాయలు కనిపించడం సినిమాకి అసెట్. మధు ‘ఎడిటింగ్’ వర్క్ శ్రద్ద తీసుకుంటూనే ఎంతో క్రిస్పీ గా సమకూర్చారు. ‘గిడియన్ కట్టా’ అందించిన మ్యూజిక్ బాగుంది. అంతే కాదు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్. బురాన్ షేక్ (సలీం) సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కథ కి తగ్గట్టుగా ఏ మాత్రం తీసిపోకుండా రిచ్ గా ఉన్నాయి.
రేటింగ్: 3.5/5
బాటమ్ లైన్: ఊహించని గ్రిప్పింగ్ టర్న్స్ & ట్విస్ట్స్ ‘అరంగేట్రం’, Arangetram
Tags: Arangetram, SrinivaasPraban,MustafaAskari,Pooja,Roshan,Gideon,MaheswariK,MahiMediaWorks,E3Music,YbrantMedia,FridayPoster