యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి (Kriti Shetty) కథానాయికగా నటిస్తున్న సినిమా ‘కస్టడీ’. లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని పవన్‌కుమార్ సమర్పిస్తుండగా శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపధ్యంలో హీరోయిన్ కృతి శెట్టి (Kriti Shetty) విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
కస్టడీ #Custody కథలో నాకు (Kriti Shetty) ఆస్కారం వుండే పాత్ర. కథ సీరియస్ అవుతున్నప్పుడు నా పాత్ర దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. స్క్రీన్ ప్లే తో నా పాత్ర ప్రయాణిస్తూ వుంటుంది. సాధారణంగా సినిమాలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాం, కానీ ఈ సినిమా కోసం జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశాను. కస్టడీ ఒక యాక్షన్ ఎంటర్ టైనర్. దాదాపు సినిమాల్లో హీరో, విలన్ ని అంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ కస్టడీ లో మాత్రం హీరో విలన్ ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. ఇది చాలా ఆసక్తికరంగా వుంటుంది. సినిమాలో ఐదు రోజుల పాటు కంటిన్యూ గా అండర్ వాటర్ లోనే వున్నాం. ఒక పక్క నాకు భయం వేస్తూనే, దాదాపు 15 రోజులు పాటు ఆ సీక్వెన్స్ చేశాం. ఊపిరి తీసుకోకుండా రెండు నిముషాలు పాటు వుంటే ఒక షాట్ సాధ్యపడుతుంది.
నాగ చైతన్య నా(Kriti Shetty) ఫేవరట్ నటుడు అలాగే మంచి వ్యక్తి చాలా నిజాయితీగా వుంటారు. ఆఫ్ స్క్రీన్ లో చైతుతో చాలా కంఫర్ట్ బుల్ గా ఉంటది కాబట్టి, ఆన్ స్క్రీన్ కూడా చక్కగా వర్క్ అవుట్ అయ్యింది. పర్శనల్ గా నేను కొంచెం రౌడీనే (నవ్వుతూ) ఏదైనా అవతలి వాళ్ళని బట్టి వుంటుంది. అలాగే అరవింద్ స్వామీ గారు, శరత్ కుమార్ గారు, సంపత్ గారు, వెన్నెల కిషోర్ గారితో పని చేయడం మంచి అనుభూతి కలిగింది. జయాపజయాలు ప్రయాణంలో భాగమే, మన ప్రయత్నం మనం చేస్తాం.
6 Days To Go💥
— Film Combat (@filmcombat) May 6, 2023
Lethal Force will be in A.Shiva's #CustodyOnMay12 🔥
ICYMI #CustodyTrailer
– https://t.co/iC3CFUWDBV
– https://t.co/iAFt7Nit2H#Custody@chay_akkineni @vp_offl @realsarathkumar @thearvindswami @ilaiyaraaja @thisisysr @IamKrithiShetty @SS_Screens #filmcombat pic.twitter.com/5224RbPdA3
అయితే, అపజయం వచ్చినపుడు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటాను. భవిష్యత్ లో లేడి ఓరియెంటెడ్ కథ వస్తే ఆలోచిస్తాను. ప్రతి భాషలో మంచి డెబ్యు సినిమా వుండాలి. అలాంటి మంచి కథ కోసం ఎదురు చూస్తున్నా. అలాగే, ఫీచర్ లో నాకు దర్శకత్వం చేయాలనే వుంది. కాకపోతే, ఇప్పుడే కాదు. నేను కొన్ని విషయాలు నేర్చుకోవాలి ఆ తరువాత ఖచ్చితంగా చేస్తాను. ప్రస్తుతం, శర్వానంద్ గారితో ఓ సినిమా, మలయాళం సినిమా చేస్తున్నాను. అలాగే, మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి త్వరలోనే అనౌన్స్ చేస్తారు.