- Advertisement -spot_img
HomeUncategorizedపవన్ కళ్యాణ్ అన్నయ్య తో మళ్ళి యాక్ట్ చేయాలనీ ఉంది - వాసుకి

పవన్ కళ్యాణ్ అన్నయ్య తో మళ్ళి యాక్ట్ చేయాలనీ ఉంది – వాసుకి

- Advertisement -spot_img

పవన్ కళ్యాణ్ అన్నయ్య తో మళ్ళి యాక్ట్ చేయాలనీ ఉంది – వాసుకి

ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో ట్యాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలని పెంచింది. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించిన నటి వాసుకి విలేకరుల సమావేశంలో ‘అన్నీ మంచి శకునములే’ విశేషాలని పంచుకున్నారు.

Actress Vasuki Interview from Anni Manchi Sakunamule
Actress Vasuki Interview from Anni Manchi Sakunamule

‘తొలిప్రేమ’ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి కానీ నాకు చేయడం కుదరలేదు. దాదాపు 23 ఏళ్ళు ఇప్పుడు ‘అన్నీ మంచి శకునములే’ కథతో రావాలనిపించింది. నేను మల్టీ టాస్కర్ కాదు, పైగా అన్ని పనులు ఒకేసారి చేయలేను. ముందు పిల్లలు, వాళ్ళ చదువులు, ఇద్దరు పిల్లలు యూకేలో చదువుతున్నారు. పాప మెడిసిన్ (ఫోర్త్ ఇయర్) బాబు సెకండ్ ఇయర్ ఆర్కిటెక్చెర్. నాకు కాస్త సమయం కుదరడం, అలాంటి సమయంలో నందిని రెడ్డి గారు కథతో వచ్చారు, నాకు నచ్చింది. సినిమాతో పాటు చదువుపై కూడా ద్రుష్టి పెట్టాను. సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్నాను.

ఇరవై మూడేళ్ళుగా సినిమాలు చేయలేకపోయిన ‘ఆనంద్’ వల్ల ఇంట్లో ఏదొక సినిమా గురించి చర్చ జరుగుతుంది. పైగా, నేను దేన్ని సీరియస్ గా తీసుకొను. కొంచెం ఫిలసాఫికల్ గా వెళ్ళిపోతాను. తొలిప్రేమ చేసినప్పుడు నాకు 18 ఏళ్ళు. అప్పుడు నాకు ఏ విషయంలో పెద్దగా అవగాహన లేకపోయిన ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళిపోయా. ఈ ఏజ్ లో రీఎంట్రీ చేయాలంటే సేఫ్ అండ్ కంఫర్ట్ జోన్ చూస్తాం. ప్రతిసారి స్వప్న సినిమా చేయమని అడిగేది. ఫైనల్ గా వీలు కుదిరి, కథ విన్న వింటనే సేఫ్ అండ్ కంఫర్ట్ జోన్ ఫీలయ్యాను. ఓకే చెప్పాను. సినిమాలో క్యూట్ సిస్టర్ పాత్రలో కనిపిస్తా. తమ్ముడు లో చేసిన పాత్రే నాది. నాకు, సంతోష్ పాత్ర కు చాలా మంచి బాండింగ్ వుంటుంది.

తొలిప్రేమ అనేది సేపరేట్ ఏరా(యుగం). అందులో వున్న కొన్ని అంశాలు ఇందులో ఉన్నాయి కాబట్టే అంగీకరించి వుంటాను. తొలిప్రేమ తో వచ్చిన పేరుని పాడు చేసుకోను కదా. దర్శకుడు కరుణాకర్ వల్లనే నాకు క్రెడిట్ తో పాటు నంది అవార్డ్ వచ్చింది. ఆ అంచనాలకు కొంచెమైన జస్టిఫీకేషన్ చేయాలనే ‘అన్నీ మంచి శకునములే’ చేశాను. కథ బావుంటే తల్లి పాత్ర చేయడానికి కూడా రెడీ. నందిని ఈ కథ చెప్పినపుడు ఎమోషన్ కి కనెక్ట్ అయ్యాను. నిజానికి నాకు బ్రదర్స్ లేరు. అందుకే తొలిప్రేమ లో పర్శనల్ గా కనెక్ట్ కాదు. ఈ మధ్య చాలా వైలెన్స్, డిస్టర్బ్ చేసే సినిమాలే వస్తున్నాయి. ఒక మంచి ఫెయిరీ టేల్ చదువుతున్నప్పుడు ఎంత హాయిగా వుంటుందో.. అన్నీ మంచి శకునములే అలా వుంటుంది. సినిమాలో సీనియర్లు ఎంత మంది ఉన్న ఆ ఫీలింగ్ ఎవ్వరికి అనిపించలేదు. చాలా కోపరేటివ్ గా వుంటారు. గౌతమి గారు స్వీట్ పర్శన్.

ఆనంద్, దత్ గారి కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తి. పైగా, దత్ గారితో ఎక్కువ సినిమాలు చేసారు. అప్పటి నుంచే వాళ్ళు స్నేహితులు. ఆనంద్, స్వప్నతో పరిచయం చేశారు. మేము ఇరుగుపొరుగు వుండేవాళ్ళం. అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా కలిసిపోయాం. చాలా రోజులు తరువాత సెట్స్ కి వెళ్లిన పెద్దగా టేకులు తీసుకోలేదు. నాకు భయం వుండదు. భయం ఉంటేనే ప్రాబ్లమ్. సంతోష్ చాలా స్వీట్ పర్సన్. అక్కా అని పిలిస్తాడు. చాలా డౌన్ టూ ఎర్త్. ఆనంద్, కళ్యాణ్ చాలా మంచి స్నేహితులు. సహజంగానే మా మధ్య మంచి అనుబంధం వుంది. కళ్యాణ్ అప్పటికి, ఇప్పటికి వ్యక్తిగా ఒకేలా వున్నారు. అవకాశం వస్తే మళ్ళి ‘పవన్ కళ్యాణ్’ అన్నయ్య తో సినిమా చేయడానికి నేను సిద్ధం గా ఉన్నాను అంటూ వాసుకి ఇంటర్వ్యూ లో చెప్పడం విశేషం.

యాదాద్రి ప్రాజెక్ట్ లో నేను ఆనంద్ తోనే వున్నాను. చిన్న కాగితంలో కొండని గీసినప్పటి నుంచి సిఎం కేసిఆర్ సన్మానం చేసిన రోజు వరకూ ప్రాజెక్ట్ సంబధించిన ప్రతి డెవలప్ మెంట్ నాకు తెలుసు. యాదాద్రి ప్రాజెక్ట్ చేయడం మాకు దొరికిన భాగ్యం, చరిత్రలో నిలిచిపోతుంది.

Subscribe Now: http://bit.ly/SonyMusicSouthYT

Film Combat, filmcombat, vasuki, anni manchi sakunamule, vyjeyanthi movies, swapna dutt, priyanka dutt, santosh shobhan, malvika nair, nandini reddy, goutami

You May Like:

Adipurush ట్రైలర్ : ప్రేక్షకులకు విజ్యువల్ ఫీస్ట్

Balagam:స్వీడిష్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2023: ‘బలగం’ చిత్రానికి ఉత్త‌మ న‌టుడుగా ప్రియ‌ద‌ర్శి, ఉత్త‌మ స‌హ న‌టుడుగా అవార్డుల‌ను గెలుచుకున్న కేతిరి సుధాక‌ర్ రెడ్డి

AnthimaTheerpu: The Sizzling Lyrical Song of the Year from #TippaTippa Out Now! || హాట్ లుక్స్ తో #TippaTippa సాంగ్

Arangetram Review : ఊహించని గ్రిప్పింగ్ టర్న్స్ & ట్విస్ట్స్ ‘అరంగేట్రం’ || A gripping and suspenseful crime thriller.

Custody: మొదటి 20 నిమిషాలు మరియు ఇంటర్వెల్ బ్లాస్ట్..||Thrilling and Heart-Pumping: Experience the Action-packed First 20 Minutes and Interval Scene of Custody.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page