యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి (Kriti Shetty) కథానాయికగా నటిస్తున్న సినిమా ‘కస్టడీ’. లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని పవన్‌కుమార్ సమర్పిస్తుండగా శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో నిర్మాత ‘శ్రీనివాస చిట్టూరి’ విలేకరుల సమావేశంలో కస్టడీ విశేషాలని పంచుకున్నారు.
మన దర్శకులు బాగా బిజీగా ఉండటంతో బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు తమిళ దర్శకులతో వెళ్ళాలిసి వచ్చింది. ప్రతి తెలుగు దర్శకుడికి రెండు మూడు సినిమాలు ఉన్నాయి. సో, ‘గ్యాంబ్లర్’ సినిమా నుంచి ‘వెంకట్ ప్రభుతో’ సినిమా చేయాలని ఉంది. తన స్క్రీన్ ప్లే, ఆలోచించే విధానం నాకు చాలా ఇష్టం. ఎంత పెద్ద సీరియస్ ఇష్యూ ని కూడా అందరికి అర్థమయ్యేలా స్క్రీన్ ప్లే తో ఎంటర్ టైన్ మెంట్ గా చూపించగలరు. ఒక నిర్మాత గా నాకు ఈ సినిమాలో కథ, స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ బాగా నచ్చాయి. ఎంటర్టైన్మెంట్ తో సీరియస్ గా కథ చూపిస్తూ, ఈ రెండిటిని దర్శకుడు మిక్స్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. తెలుగు ఎమోషన్స్ తో ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి కలిగింది.
ఈ చిత్రం రూరల్ పోలీస్ స్టేషన్ లోని ఒక నిజాయితీ గల ‘కానిస్టేబుల్’ కథ. ‘యూ టర్న్’, వారియర్ తెలుగు కంటే అక్కడ పెద్ద హిట్. సో, తెలుగు హీరోలని తమిళ్ లో అంతగా ఆదరణ ఉండదు అనేది అసత్యం. మొదటి నుంచి ఇది బైలింగ్వెల్ చిత్రం గానే ప్ల్యాణ్ చేసాం. రెండు ల్యాంగేవేజ్ లకి ప్రత్యేకంగా షాట్స్ తీశాం. కొన్ని రోజులు వ్యవధిలోనే హిందీలో కూడా రీలిజ్ అవ్వుతుంది. ముఖ్యంగా, ఒక పాత్రలో తెలుగు లో వెన్నెల కిషోర్ ఉంటె, తమిళ్ లో ప్రేమ్ జీ చేశారు. ఆ ఒక్కటి స్క్రీన్ మీద మార్పు ఉంటుంది.
ఇది 90లో జరిగే కథ కాబట్టి, సినిమాకి సంగీతం ఇళయరాజా ని తీసుకోవడం జరిగింది. కథ వినగానే ఇళయరాజా గారు, యువన్ మేము చేస్తామని ముందుకు రావడం జరిగింది. యూటర్న్ తీస్తున్నప్పుడు సమంత మార్కెట్ ఎవరికీ తెలీదు. కథ నచ్చి కథకు కావాల్సింది ఖర్చుపెట్టాను. అలాగే గోపిచంద్ సిటిమార్, రామ్ వారియర్ ఇలా ప్రతి ఒక్కరి కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాలు. ఇప్పుడు, కస్టడీ కూడా నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ. బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా కథకు కావాల్సింది ఖర్చు పెట్టాం. సినిమాలో అనుకోకుండా కథకు తగ్గట్టుగా ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టాలిసి వచ్చింది. ఈసారి చక్కని తెలుగు టైటిల్ తో వస్తున్నాం.
కృతిశెట్టి మంచి ఆర్టిస్ట్ మరియు లిడింగ్ హీరోయిన్. పైగా, యూత్ అందరికీ ఇష్టమైన హీరోయిన్. తెలుగులో నాగచైతన్య కెరీర్ లోనే హయ్యస్ట్ థియేటర్స్ లో రిలీజ్అ వుతుంది. తమిళనాడులో 200 థియేటర్స్ పై గా విడుదలౌతుంది. ఈ చిత్రంతో చైతన్య గారి కెరీర్ లోనే హయ్యస్ట్ ఫిల్మ్ అవుతుంది. నాగార్జున గారి కెరీర్ లో ‘శివ’ ఎలా గుర్తుండి పోయిందో నాగచైతన్య కెరీర్ లో కస్టడీ అలా గుర్తుండిపోతుంది. శివ సినిమానే కాదు అందులో పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో.. కస్టడీలోని అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి.. పాత్రలు గుర్తుండిపోతాయి. నాకు కస్టడీ కాకుండా శివ అని టైటిల్ పెడితే బాగుంటుంది కదా అనిపించింది. కానీ చైతు గారు పోలికలు వస్తాయి అన్న ఉద్దేశంతో వద్దు అన్నారు.
అరవింద్ స్వామి గారు కథ వినగానే ఓప్పుకున్నారు. థియేటర్ లో ఆయన పాత్రని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. టెర్రిఫిక్ గా ఎంతో ఎంటర్టైనింగ్ గా ఆయన పాత్ర వుంటుంది. శరత్ కుమార్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుంది. రెండు కొండల మధ్య చిట్టెలుక వుంటే ఎలా వుంటుందో అరవింద్ స్వామి, శరత్ కుమార్ మధ్య నాగచైతన్య గారి పాత్ర అలా ఉంటుంది. ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారు.మొదటి సీన్ నుంచి చివరి దాక ఒక ఇంటర్ లింక్ వుంటుంది. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత వుంటుంది.
ఈ సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్ తెలుగు స్క్రీన్ మీద ఇప్పటి వరుకు చూసి వుండరు. హలీవుడు స్టైల్ లో మన ఎమోషన్స్ తో చాలా ఎక్స్ టార్డినరి గా తీర్చిదిద్దాం. దాదాపు, ఇరవై రోజులు ఆ సీక్వెన్స్ మైసూర్, రాజమండ్రి ప్రాంతాల్లో షూట్ చేశాం. అలాగే దాని కోసం స్పెషల్ గా సెట్ వేశాం. ఇందులో నాలుగు యాక్షన్ సీక్వెన్స్ లు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా హిట్ అయ్యితే ఖచ్చితంగా కస్టడీ 2 వుంటుంది.
రామ్ బోయపాటి సినిమా షూటింగ్ కంటిన్యూగా జరుగుతోంది. రామ్ గారి బర్త్ డే కి టీజర్ రిలీజ్ చేస్తాం. అదే విధంగా జూన్ నుంచి నాగార్జున గారితో షూటింగ్ స్టార్ట్ అవ్వుతుంది. పూర్తి వివరాలు త్వరలో చెబుతాం. అలాగే నాగచైతన్య తో మరో సినిమా చేయాలి.
Read More:
‘భువన విజయమ్’ Pre-Release Event: పక్కా కంటెంట్ వున్న సినిమా.