#MusicSchoolReview మ్యూజిక్ స్కూల్ మూవీ తెలుగు, హిందీ మరియు తమిళ భాషల్లో రూపొందిన పాన్ ఇండియా ఫిలిం, పాపా రావు బియ్యాలా రచన మరియు దర్శకత్వం వహించారు. ఇందులో శ్రియ శరణ్, ప్రకాష్ రాజ్, శర్మన్ జోషి, ఓజు బారువా మరియు గ్రేసీ గోస్వామి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో 12 పాటలు ఉన్నాయి, వాటిలో 9 పాటలను ఇళయరాజా స్వరపరిచారు. ఈ మూవీ 2023 మే 12న రిలీజ్ ఐంది.
మ్యూజిక్ స్కూల్ మూవీ ప్రధానంగా మన ఇండియా లోని స్కూల్ సిస్టం మరియు తల్లితండ్రులు పిల్లలపై గంటలపాటు చదువులతో విధించే ఒత్తిడికి సంబంధించిన విషయాలపై ఫోకస్ చేస్తుంది. వారిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు చేసే ప్రయత్నంలో విద్యార్థులకు ఆర్ట్స్, విరామ కార్యక్రమాలకు సమయం లేకుండా చేస్తున్నారు. ఇదే విషయాన్నీ డైరెక్టర్ పాపా రావు బియ్యాల MusicSchool మూవీ ద్వారా కన్వే చేయటంలో ఎంతవరకు విజయం సాధించారో చూద్దాం..
A melodious ride of #MusicSchoolMovie is running successfully🎶❤
— Aditya Music (@adityamusic) May 12, 2023
Watch it near your theatres now
𝐈𝐍 𝐂𝐈𝐍𝐄𝐌𝐀𝐒 𝐍𝐎𝐖
An Ilaiyaraaja’s Musical Magic 🎶@shriya1109 @TheSharmanJoshi @singer_shaan @ilaiyaraaja @SVC_official @PicturesPVR @paparaobiyyala @adityamusic pic.twitter.com/gs0UoLIzpO
IAS ఆఫీసర్ నుండి డైరెక్టర్ గా మారిన పాపా రావు బియ్యాల మ్యూజిక్ స్కూల్ తో సినిమాలలోకి తన అరంగేట్రం చేసారు, ఇందులో శ్రియ శరణ్ మరియు శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక IAS అధికారి సినిమా తీయడానికి వస్తున్నాడని మరియు తన తొలి దర్శకుడిగా మ్యూజిక్ ని ఒక సబ్జెక్టుగా ఎంచుకుంటున్నాడని తెలిసి, ప్రేక్షకుల ఎక్సపెక్టషన్స్ పెరిగాయి. కానీ, బియ్యాల డైరెక్షన్ అతను కోరుకున్న స్థాయిని చేరుకోవడంలో విఫలమైంది. ‘మ్యూజిక్ స్కూల్’ లో మ్యూజిక్ బాగుంది, కానీ సినిమా నిర్మాణంలో చాలా వెనుకబడి ఉంది.
#MusicSchoolReview మ్యూజిక్ స్కూల్ కథలోకి వెళ్తే ..
గోవాకు చెందిన మేరీ డీక్రూజ్ (శ్రీయా శరన్) హైదరాబాద్‌లోని ఓ కార్పోరేట్ స్కూల్‌కు మ్యూజిక్ టీచర్‌గా చేరుతుంది. మార్కులే లక్శ్యంగా భావించే తల్లిదండ్రులు తమ పిల్లలను మ్యూజిక్, స్పోర్ట్స్, ఆర్ట్స్ లాంటి కళలకు దూరంగా పెడుతారు. స్కూల్‌లో పరిస్థితుల కారణంగా భార్య మరణించడంతో కూతురుతో కాలం గడుపుతున్న ఆర్ట్స్ టీచర్ మనోజ్ (శర్మాన్ జోషి)కి మేరీ దగ్గరవుతుంది. వారిద్దరూ కలిసి సొంతగా మ్యూజిక్, ఆర్ట్స్ స్కూల్ పెట్టి పిల్లలచే ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ అనే నాటకాన్ని స్కూల్ అన్యుయేల్ డే కి వెయ్యాలని ప్లాన్ చేస్తారు.
పిల్లలకు మ్యూజిక్ నేర్పించాలనే మంచి ఉద్దేశ్యం ఉన్న మేరీకి స్కూల్‌లో ఎదురైన సమస్యలు? మనోజ్‌కు మేరీ ఎలా దగ్గరైంది? మ్యూజిక్ నేర్పించే క్రమంలో పిల్లలకు ఎదురైన ఇబ్బందులు? కూతురు వల్ల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విక్రమ్ రెడ్డి (ప్రకాశ్ రాజ్)కి ఎదురైన సమస్యలు? పోలీస్ కమిషనర్ కూతురి వల్ల మేరీ, మనోజ్ ఎలాంటి కష్టాలకు లోనయ్యారు? మేరీ లవ్ బ్రేకప్ ఎలా జరిగింది? లవర్ అల్బర్ట్ (సింగర్ షాన్)తో మేరీ లవ్ సక్సెస్ అయిందా? మనోజ్‌కు దగ్గరైన మేరీ ఆయనను పెళ్లాడిందా? అనే ప్రశ్నలకు మ్యూజిక్ స్కూల్ సినిమా సమాధానం చెప్తుంది.
పెర్ఫార్మన్సెస్:
నటీనటులు విషయానికి వస్తే.. శ్రీయా శరన్ మ్యూజిక్ స్కూల్ సినిమాలో, గ్లామర్ రోల్‌తో ఎంటర్టైన్ చేశారు. శర్మాన్ జోషి క్యారెక్టర్‌కు ఉండాల్సిన ఎమోషన్స్ స్క్రీన్ పై పండలేదు.(MusicSchoolReview) కూతురు విషయంలో విక్రమ్ రెడ్డిగా ప్రకాశ్ రాజ్ పాత్ర చుట్టూ ఉండే డ్రామా బోరింగ్ గా సాగుతుంది. ఈ మూవీలో ఉండే పరమార్థమే మిస్ అయిందనిపిస్తుంది. శర్మాన్ జోషి, లీలా శాంసన్, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ వర్మ పాత్రలు కథకు కనెక్ట్ కాలేక పూర్తిగా తేలిపోయాయి.
టెక్నికల్ గా విశ్లేషిస్తే..
కిరణ్ డియాన్స్ చేసిన సినిమాటోగ్రఫి బాగుందీ. గోవాలోని కొన్ని సీన్స్, సాంగ్స్ బాగున్నాయి. లైటింగ్, బ్యాక్ డ్రాప్, కలర్ కాంబినేషన్ లాంటి విషయాలు సన్నివేశాలను, సినిమాను రిచ్‌గా కనిపించేలా చేస్తాయి. ఇక ఈ సినిమాకు ఇళయరాజా సంగతం కుదరలేదనే చెప్పాలి. పాటలు ఈ మూవీ కి పూర్తిగా మైనస్. కథలో డెప్త్ లేకపోవడం వల్ల పాటలు అలరించలేకపోయాయి. కథకు పాటలు స్పీడ్ బ్రేకర్లుగా మారాయి. మిగితా క్రాఫ్ట్స్ కూడా అంతంత మాత్రమే. (MusicSchoolReview)
MusicSchoolReview ఓవరాల్ గా చెప్పాలంటే, స్టోరీ కాన్సెప్ట్స్ బాగున్నా, వాటిని మలిచిన తీరు ప్రేక్షకులను నిరాశపరుస్తాయి.
బలాలు:
-శ్రీయ, శర్మన్ జోషి నటన
-రిచ్ లుక్ ఇన్ ఫిలిం
బలహీనతలు:
-ఎక్కువ సంఖ్యలో పాటలు
- -అంతగా పండని చాల సన్నివేశాలు
ఫిలిం కంబాట్ రేటింగ్ : 1.5
Cast & Crew:
సంగీతం: ఇళయరాజా
కథ, స్క్రీన్‌ప్లే: పాపారావు బియ్యాల
దర్శకత్వం & నిర్మాత : పాపారావు బియ్యాల
తారాగణం: శర్మన్ జోషి, శ్రియా శరన్, షాన్, గ్రేసీ గోస్వామి, ఓజు బారువా, ప్రకాష్ రాజ్, షాన్, బెంజమిన్ గిలానీ, సుహాసిని ములే, బగ్స్ భార్గవజ్,లీలా శాంసన్, మోనా అంబేగావ్కర్, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ వర్మ, ఫణి ఎగ్గోనే, వక్వార్ షేక్, కార్తికేయ చౌదరి గద్దె, వివాన్ జైన్ మునోత్, ఒలివియా చరణ్, జి రోహన్ రాయ్, ఆది పండితారాధ్యుల, సిద్ధిక్ష, కుషీ సోని.
DOP: కిరణ్ డియోహాన్స్
సౌండ్: అమృత్ ప్రీతమ్(MPSE)
మిక్సింగ్ ఇంజనీర్: దేబజిత్ చాంగ్మాయి
ఆర్ట్ : రాజీవ్ నాయర్
ఎడిటర్: మనన్ సాగర్
కాస్ట్యూమ్: రాగా రెడ్డి
మేకప్: Ch. తులసి కృష్ణ (నాని)
హిందీ డైలాగ్స్: శివాని తిబ్రేవాలా, వినయ్ వర్మ
తెలుగు డైలాగ్స్: అరిపిరాల సత్యప్రసాద్, అనంతు చింతలపల్లి, కె ఎన్ విజయకుమార్
తమిళ డైలాగ్స్: కెఎన్ విజయకుమార్
హిందీ సాహిత్యం: డా. సాగర్, శివాని తిబ్రేవాలా, రామన్ రఘువంశీ
తెలుగు సాహిత్యం: రెహమాన్
తమిళ సాహిత్యం: పా విజయ్
కొరియోగ్రఫీ: ఆడమ్ ముర్రే, చిన్ని ప్రకాష్, రాజు సుందరం
అసోసియేట్ ప్రొడ్యూసర్: యామినీ రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అక్షయ్ బల్సరఫ్
క్రియేటివ్ ప్రొడ్యూసర్స్: వెంకట్ సిద్దారెడ్డి, మహేంద్ర సిసోడియా
మార్కెటింగ్ : సన్నీ బక్షి, గోడలు & ట్రెండ్స్
PRO: వంశీ కాకా
మీడియా కన్సల్టెంట్: సంచిత త్రివేది – ఇధ్య
పబ్లిసిటీ డిజైన్: అనిల్ & భాను
స్టిల్స్: జగన్ శెట్టి
మోషన్ పోస్టర్, లిరికల్ వీడియోలు: వాల్ & ట్రెండ్స్
Tags: MusicSchoolReview, FilmCombat, film combat, #MusicSchoolMovie, Telugu, News, Telugu Movie, Review
You May Like:
Kushi మూవీ సాంగ్: ప్రపంచ బెస్ట్ ఆడియో చార్ట్ బస్టర్స్ లో 5th
‘PVT04’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ప్రముఖ నటి ‘అపర్ణా దాస్’ ఎంట్రీ
Full Telugu Movies – https://goo.gl/buaJpf