- Advertisement -spot_img
HomeUncategorizedకిరణ్ అబ్బవరం 'RulesRanjann' నుంచి 🎶❤️నాలో నేనే లేను…🎶❤️ఊహల్లోనా లేను… పాట విడుదల

కిరణ్ అబ్బవరం ‘RulesRanjann’ నుంచి 🎶❤️నాలో నేనే లేను…🎶❤️ఊహల్లోనా లేను… పాట విడుదల

- Advertisement -spot_img
  • ఆకట్టుకుంటున్న ‘RulesRanjann‘ మొదటి పాట

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘RulesRanjann‘. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అతి కొద్ది కాలంలోనే యువతకి ఎంతగానో చేరువైన నాయకానాయికలు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘RulesRanjann‘పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి విశేష స్పందన లభించింది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాట విడుదలైంది.

‘నాలో నేనే లేను’ : విభిన్న ప్రేమ గీతం

‘నాలో నేనే లేను’ లిరికల్ వీడియోని సోమవారం ఉదయం విడుదల చేసింది RulesRanjann చిత్ర బృందం. తన ప్రేమను కథానాయకకి చెప్పడం కోసం కథానాయకుడు పడే తపన ఈ పాటలో చూపించారు. కళ్లద్దాలు, నుదుటున బొట్టుతో బుద్ధిమంతుడిలా కనిపిస్తున్న కథానాయకుడు.. నాయికని ఫాలో అవుతూ ఆమె గురించి పాడుకోవడం ఆకట్టుకుంది.

లిరికల్ వీడియోలో నాయికలా నాట్యం చేయబోయి కథానాయకుడు కిందపడటం, ఆమె నడిచొస్తుంటే అతను పూలు చల్లడం వంటి సరదా సన్నివేశాలు అలరించాయి. అమ్రిష్ గణేష్ స్వరపరిచిన సంగీతం వినసొంపుగా, ఆహ్లాదకరంగా ఉంది. సంగీతానికి తగ్గట్టుగానే రాంబాబు గోసాల అందించిన సాహిత్యం ఎంతో హాయిగా, స్వచ్ఛంగా ఉంది. అందరికీ అర్ధమయ్యే భాషలో ఎంతో అర్థవంతంగా పాటను రాశారు. ఇక శరత్ సంతోష్ ఎంతో అందంగా పాటను ఆలపించి కట్టిపడేశారు.

కథానాయకుడు ‘ప్రేమాలాపన‘:
‘నాలో నేనే లేను’ పాట విడుదల సందర్భంగా గీత రచయిత రాంబాబు గోసాల మాట్లాడుతూ.. ” RulesRanjann చిత్రంలో నాలో నేనే లేను అనే పాట రాసినందుకు చాలా సంతోషం, మా దర్శకులు రత్నం కృష్ణ గారు చాలా మంచి సందర్భాన్ని నాకు వివరించారు. చాలా అందమైన చిన్న చిన్న పదాలతో తన ప్రేమని కథానాయిక కి తెలియజేయడం కోసం కథానాయకుడు పడే తపన ఈ పాటలో చెప్పాము. ‘నాలో నేనే లేను నీలోనే ఉన్నాను’ అంటూ మొదలయ్యి నేను ఊహల్లో లేను ఎప్పుడూ నీ ఊసుల్లోనే ఉంటున్నాను నువ్వు ఏం మాయ చేసావు నీ రూపం ఒక మాయ నువ్వే ఒక మాయ నాకు నిద్ర పట్టట్లేదు కానీ చాలా హాయిగా ఉంది ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేదు అనుకుంటూ తన ఫీలింగ్స్ ని చెప్పుకునే పాట.

చాలా అందమైన బాణీకి చాలా మంచి తేలిగ్గా పాడుకునేటట్లుగా ఉండే పదాలతో పాటని రాయమని చెప్పారు. చరణాలు కవితాత్మకంగా చెప్పాము.పువ్వులా నువ్వు వస్తే నీ నుంచి వచ్చే పరిమళాల గాలి నాతో మాట్లాడింది అని, నువ్వు సిగ్గుపడుతూ నవ్వుతుంటే నన్ను నేను మర్చిపోయానని చరణాలు స్టార్ట్ అవుతాయి. నాతో ఇంత మంచి పాట రాయించినందుకు మా దర్శకులకి కృతజ్ఞతలు, అలాగే హీరో హీరోయిన్లు కిరణ్ అబ్బవరం గారు నేహా శెట్టి ఈ పాటలో చాలా అందంగా కనిపించారు.

చాలా చాలా బాగుంది విజువల్ గా, సంగీత దర్శకులు అమ్రిష్ గారు చాలా మంచి బాణీ అందించారు. అలాగే గాయకులు శరత్ సంతోష్ చాలా బాగా పాడారు. ఈ పాట పెద్ద హిట్ అవుతుందని అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇంత మంచి ప్రొడక్షన్లో ఇంత మంచి సినిమాకి ఇంత మంచి పాట రాసినందుకు మా నిర్మాతలకి అలాగే నన్ను ఎంకరేజ్ చేసిన మా టీం అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పాటని సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

RulesRanjann‘: నూరు శాతం వినోదం: చిత్ర నిర్మాతలు, దర్శకుడు

వినోదమే ప్రధానంగా RulesRanjann చిత్రం రూపొందుతోంది. కథానాయకుడు కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు ,ఇమేజ్ కు భిన్నంగా ఈ చిత్రం సరికొత్తగా ఉండటం తో పాటు, పూర్తి స్థాయి వినోద భరిత కథాచిత్రమిది. సగటు సినిమా ప్రేక్షకుడు మనసారా వినోదాన్ని ఆస్వాదించే చిత్రమవుతుంది. ఇందుకు RulesRanjann చిత్ర కథ, నాయకా నాయికల పాత్రలు, కథానుగుణంగా సాగే ఇతర ప్రధాన తారాగణం పాత్రలు, సంభాషణలు, సంగీతం ఇలా అన్నీ సమపాళ్లలో చక్కగా కుదిరిన ఓ మంచిత్రం అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు చిత్ర నిర్మాతలు దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి, దర్శకుడు రత్నం కృష్ణ. ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై నెలలో చిత్రాన్ని విడుదల చేయాలన్నది సంకల్పం అని తెలిపారు.

🎶 మ్యూజిక్ స్లేట్ 🎶
🎶పాట పేరు: నాలో నేనే లేను
🎶ఆల్బమ్/సినిమా: RULES RANJANN
🎶గాయకుడు: శరత్ సంతోష్
🎶లిరిక్స్: రాంబాబు గోసాల
🎶సంగీతం : అమ్రిష్

🎶మ్యూజిషియన్ క్రెడిట్స్🎶
గ్రావిటీ స్టూడియోలో AMRISH ద్వారా పాట ఏర్పాటు చేయబడింది మరియు ప్రోగ్రామ్ చేయబడింది

🎶లైవ్ ఇన్స్ట్రుమెంట్స్🎶
🎶ఎలక్ట్రిక్ గిటార్, ఎకౌస్టిక్ గిటార్ &మాండలిన్: సుభాని (HYD)
🎶కీ బోర్డ్, సింథ్ & రిథమ్ AMRISH ద్వారా ప్రోగ్రామ్ చేయబడింది
🎶పాట @ GRAVITY STUDIOలో రికార్డ్ చేయబడింది
🎶స్టూడియో మేనేజర్: T.V శశి (GRAVITY STUDIO)
🎶పాట మిక్స్ చేసినవారు: S.శివ కుమార్ (AM STUDIO)
🎶పాట మాస్టరింగ్: S.శివ కుమార్ (AM STUDIO)
🎶ఆర్కెస్ట్రా ఇంఛార్జ్: దినేష్ బాబు జి
🎶స్టూడియో సహాయకులు: జనగనాథన్.ఎ, ధనుష్


🎶మూవీ వివరాలు🎶
తారాగణం – కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వివా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్.

Crew:

🎶రచన మరియు దర్శకత్వం: రత్నం కృష్ణ
🎶నిర్మాత: స్టార్‌లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
🎶సమర్పించినవారు: A.M. రత్నం
🎶నిర్మాతలు: దివ్యాంగ్ లావానియా, మురళీ కృష్ణ వేమూరి
🎶D.O.P – దులిప్ కుమార్ M.S
🎶సహ నిర్మాత – రింఖు కుక్రేజా
🎶కళ – సుధీర్ మాచర్ల
🎶కొరియోగ్రఫీ – శిరీష్
🎶స్టైలింగ్ (కిరణ్ అబ్బవరం మరియు నేహా శెట్టి) – హర్షిత తోట
🎶కాస్ట్యూమ్ డిజైనర్ – అరుణ శ్రీ సుకల
🎶సహ దర్శకుడు – రంగనాథ్ కుప్ప
🎶మార్కెటింగ్ హెడ్ – ప్రసాద్ చవాన్
🎶P.R.O – లక్ష్మీ వేణు గోపాల్
🎶పబ్లిసిటీ డిజైనర్ – అనంత్ కంచెర్ల
🎶లిరికల్ వీడియో స్వరపరచినవారు: కిషోర్ PL
🎶DI & VFX- శ్రీ సారథి స్టూడియోస్

🎶మ్యూజిక్ లేబుల్: T-సిరీస్

🎶అందమైన ❤️మెలోడియస్❤️లిరిక్స్🎶
🎶❤️పల్లవి:
🎶❤️నాలో నేనే లేను…
🎶❤️నాలో నేనే లేను, నీలోనే ఉన్నాను
🎶❤️ఊహల్లోనా లేను, పిల్లా ఊసుల్లోనే ఉన్నాను
🎶❤️మనసంతా నువ్వే లే, నీ రూపం యేమాయె
🎶❤️నిధురంటూ లేధాయే, నీ రూపం మాయే
🎶❤️యే మాయే నాకు యేమాయే
🎶❤️అరేయ్ ఇంతకుముందు లేధూ ఈ హాయే
🎶❤️నాలో నేనే లేను…

🎶❤️నాలో నేనే లేను, నీలోనే ఉన్నాను
🎶❤️ఊహల్లోనా లేను, పిల్లా ఊసుల్లోనే ఉన్నాను
🎶❤️మనసంతా నువ్వే లే, నీ రూపం యేమాయె
🎶❤️నిధురంటూ లేధాయే, నీ రూపం మాయే
🎶❤️యే మాయే నాకు యేమాయే
🎶❤️అరేయ్ ఇంతకుముందు లేధూ ఈ హాయే

🎶❤️చరణం:
🎶❤️పూవల్లే నువ్వు వస్తే, నీ పరిమళాల గాలే
🎶❤️నాతోనీ మాటలాడే, మనసున కురిసే చినుకా
🎶❤️నువ్వు సిగ్గుపడుతూ నవ్విస్తే, నా జాడ నేను మరిచానే
🎶❤️అరేయ్ ఇంతకు ముందు లేధూ ఈ హాయే
🎶❤️హేయ్ పిల్లా… నా పలుకంతా నీ పేరు
🎶❤️హే పిల్లా… నా గుండెల్లో నీ గుడి ఉందే
🎶❤️గుడి ఉందే…

🎶❤️నాలో నేనే లేను…🎶❤️ఊహల్లోనా లేను…

Tags: #KiranAbbavaram #NehaSshetty #RulesRanjann #RathinamKrishna #Amrish #KA8 #NaaloNeneLenu #StarlightEntertainment #Telugusongs #LatestHits #FilmCombat #filmcombat

You May Like:

పవన్ కళ్యాణ్ అన్నయ్య తో మళ్ళి యాక్ట్ చేయాలనీ ఉంది – వాసుకి

Adipurush ట్రైలర్ : ప్రేక్షకులకు విజ్యువల్ ఫీస్ట్

Balagam:స్వీడిష్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2023: ‘బలగం’ చిత్రానికి ఉత్త‌మ న‌టుడుగా ప్రియ‌ద‌ర్శి, ఉత్త‌మ స‌హ న‌టుడుగా అవార్డుల‌ను గెలుచుకున్న కేతిరి సుధాక‌ర్ రెడ్డి

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page