- Advertisement -spot_img
HomeUncategorizedAnnapurna Studios Qube: హైదరాబాద్‌లో ప్రారంభించిన 'స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌'

Annapurna Studios Qube: హైదరాబాద్‌లో ప్రారంభించిన ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌’

- Advertisement -spot_img

Annapurna Studios Qube:

అన్నపూర్ణ స్టూడియోస్‌, క్యూబ్‌ సినిమా సంయుక్తంగా హైదరాబాద్‌లో ప్రారంభించిన ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌’

  • స్థలాభావం, సమయాభావం లేకుండా ఫిల్మ్ మేకర్స్ తమ కథలను చెప్పడానికి అనువుగా స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్ ఫెసిలిటీని కల్పిస్తున్న ది ANR వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌.

ఇండియన్‌ మీడియా బిజినెస్‌లో దిగ్గజాలు అన్నపూర్ణ స్టూడియోస్‌, క్యూబ్‌ సినిమా. ఈ రెండు సంస్థలూ సంయుక్తంగా హైదరాబాద్‌లో ది ఎ ఎన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌ని ఏర్పాటు చేశాయి. స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్ ఐసీవీఎఫ్‌ఎక్స్ (ఇన్‌ కెమెరా విజువల్‌ ఎఫెక్ట్స్ ) వల్ల ఫిల్మ్ మేకర్స్ ప్రొడక్షన్‌ ప్రాసెస్‌ని సులభతరం చేయడానికి వీలవుతుంది. ఎఎన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌ ఈ విషయం మీద 2022 అక్టోబర్‌ నుంచి రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు, యాడ్స్, మ్యూజిక్‌ వీడియోలను కూడా షూట్‌ చేసింది.

వాటన్నిటినీ పరిశీలించాకే వర్క్ ఫ్లో సొల్యూషన్‌ నాణ్యత బావుందని ఫిల్మ్ మేకర్స్ కి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాంటి హద్దులూ లేకుండా ఫిల్మ్ మేకర్స్ తమ క్రియేటివ్‌ గోల్స్ అచీవ్‌ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కటింగ్‌ ఎడ్జ్, హై బ్రైట్‌నెస్‌, 60 అడుగుల వెడల్పు, 20 అడుగులు ఎత్తు , 2.3 మిల్లీ మీటర్ల డాట్‌ పిచ్ (అల్ట్రా హై రెఫ్రెష్‌ రేట్‌, వైడ్‌ కలర్‌ గమట్‌) ఉన్న ఎల్‌ఈడీ వాల్‌ స్పాన్నింగ్‌ అందులో ఉంటాయి. వాటన్నిటికీ మించి ఆటో లెడ్‌ డిస్‌ప్లేలుంటాయి. రెడ్‌స్పై, పవర్‌ఫుల్‌ కస్టమ్‌ బిల్ట్ రెండరింగ్‌ సిస్టమ్స్, అన్‌రియల్‌ ఇంజిన్‌తో కాంప్లెక్స్ ఫొటో రియలిస్టిక్‌ వర్చువల్‌ లొకేషన్స్ ని రియల్‌ టైమ్‌ రెండరింగ్‌ చేయడం వంటివన్నీ అద్భుతమైన అంశాలు.

వీటన్నిటినీ ఉపయోగించుకుని రియల్‌, వర్చువల్‌ ఎలిమెంట్స్ బ్లెండ్‌ చేసి ప్రపంచంలోని ఎలాంటి ప్రదేశానికైనా ఫిజికల్‌గా వెళ్లకుండా షూటింగ్‌ చేసుకోవచ్చు. తమ సృజనకు అనుగుణంగా వాతావరణాన్ని, లైటింగ్‌ని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది.

మీడియా, ఫిల్మ్‌ ఇండస్ట్రీకి అనుకూలమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది అన్నపూర్ణ స్టూడియోస్‌. సాంప్రదాయబద్ధమైన సినిమా స్టూడియోగా మొదలై, ప్రొడక్షన్‌ హౌస్‌తో విస్తరించిన ఈ సంస్థ ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్ స్టూడియో ఏర్పాటు చేసి వ్యక్తిగతమైన సేవలను అన్నీ హంగులతోనూ ముందుంచుతోంది.

మీడియా ఇండస్ట్రీలో తరాలుగా సేవలందిస్తోంది అన్నపూర్ణ బ్రాండ్‌. ప్రొడక్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లోనే కాదు, ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీలు అందిపుచ్చుకుంటూ, బిజినెస్‌ మోడల్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో గత మూడు దశాబ్దాలుగా క్యూబ్‌ సినిమా ప్రస్థానం చెప్పుకోదగ్గది. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రొడక్షన్‌, పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు సునాయాసంగా జరగడానికి తనవంతు దోహదపడుతోంది.

అన్నపూర్ణ స్టూడియోస్‌, క్యూబ్‌ చేయీ చేయీ కలిపి మొదలుపెట్టిన ఈ తాజా ప్రయాణం మెచ్చుకోదగ్గ వినోదాత్మక పర్యావరణానికి, వర్చువల్‌ ప్రొడక్షన్‌కి ఎంతగానో దోహదపడుతుంది. కంటెంట్‌ ప్రొడక్షన్‌లో మరో ఆసక్తికరమైన మజిలీని చూడనుంది. ”మా వినియోగదారులకు కట్టింగ్‌ ఎడ్జి సర్వీసులు అందించడానికి ఏఎన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌ తనవంతు కృషి చేస్తుంది” అని అన్నారు అన్నపూర్ణ స్టూడియోస్‌ అక్కినేని నాగార్జున.

”సినిమాల నిర్మాణంలో మా బలం, మా అనుభవంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో క్యూకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మేం చేతులు కలిపాం. సృజనాత్మక రంగంలో ఎలాంటి సరిహద్దులు లేకుండా తెరమీద ఆవిష్కరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాం” అని చెప్పారు.

Annapurna Studios Qube: ”అన్నపూర్ణ స్టూడియోతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మన దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న ఫిల్మ్ మేకర్స్ కోసం మేం ఈ అత్యాధునిక టెక్నాలజీని పరిచయం చేస్తున్నాం” అని అన్నారు. క్యూబ్‌ సినిమా కో ఫౌండర్‌ పంచపకేశన్‌. ”కంటెంట్‌ ప్రొడక్షన్‌లో ఇది కొత్త యుగం. ఫిల్మ్ మేకర్స్ కి అత్యంత అనువైన, హైలీ ఎఫిషియంట్‌, కాస్ట్ ఎఫెక్టివ్‌ మేనర్‌లో మేం ఈ వెసులుబాటు తీసుకొస్తున్నాం. కంటెంట్‌ ప్రొడక్షన్‌లో వర్చువల్‌ ప్రొడక్షన్‌ అనేది అత్యంత ప్రశంసనీయమైన అభ్యున్నతి. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానంలో మేం ముందంజలో ఉండటం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.

ఏఎన్నార్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో గేమ్‌ చేంజర్‌గా నిలవనుంది. విశ్వ యవనిక మీద భారతీయ వినోదరంగాన్ని ముందంజలో నిలపడానికి అది ఉపయోగపడుతుంది. భారతదేశంలో అత్యుత్తమమైన ప్రప్రథమమైన ఐసీవీఎఫ్‌ఎక్స్ పర్మనెంట్‌ స్టేజ్‌ ఇదే. లాజిస్టిక్స్, ప్రొడక్షన్‌లోనూ పొదుపుచేయడానికి అత్యుత్తమమైన మార్గం ఇది. ప్రాంతాలను, సమయాన్ని పట్టించుకోకుండా తాము చెప్పదలచుకున్న విషయాన్ని సృజనాత్మకంగా చెప్పగలిగిన వెసులుబాటు ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ కి అందుబాటులో ఉంది.

మరింత సమాచారం కోసం vps@annapurnastudios.com and vps@qubecinema.com ని సంప్రదించండి.

Annapurna Studios Qube: అన్నపూర్ణ స్టూడియో గురించి!
అన్నపూర్ణ స్టూడియో (www.annapurnastudios.com) సినిమా ఇండస్ట్రీ నమ్మకాన్ని చూరగొన్న సంస్థ. 1976లో ప్రారంభించారు. పద్మవిభూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్మే అవార్డు గ్రహీత శ్రీ అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభమైంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఏఎన్నార్‌ స్థాపించిన ఈ సంస్థ చలనచిత్రలు, టీవీ, డిజిటల్‌ షోస్‌, స్పెషల్‌ ఈవెంట్స్, అడ్వర్‌టైజింగ్‌ కమర్షియల్స్, మ్యూజిక్‌ వీడియోస్‌తో పాటు పలు వీడియోలను షూట్‌ చేసుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తోంది.

దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ స్టూడియో. హైదరాబాద్‌లో హార్ట్ ఆఫ్‌ ది సిటీగా పేరు తెచ్చుకుంది. ఫిల్మ్ ప్రొడక్షన్‌కి ఒన్‌స్టాప్‌ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో అనే నమ్మకాన్ని సొంతం చేసుకుంది. ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా స్క్రిప్ట్ తో లోపలికి వెళ్తే, పూర్తిస్థాయి సినిమాతో బయటకు వచ్చే విధంగా అన్ని రకాల సదుపాయాలను అందిస్తోంది.

వినోద రంగంలో దాదాపు 70 ఏళ్ల అనుభవం కలిగిన సంస్థ ఇది. ప్రొడక్షన్‌, సర్వీస్‌, డిస్ట్రిబ్యూషన్‌ రంగాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన ఈ సంస్థ ఫైనాన్సి అందించిన సినిమాలు, నిర్మించిన సినిమాల సంఖ్య దాదాపు 50కి పైమాటే. అన్నపూర్ణ బ్యానర్‌లో తెరకెక్కిన పలు సీరీస్‌లు ప్రైమ్‌ టైమ్‌ తెలుగు చానెల్స్ అయిన జీ టీవీ , మాటీవీల్లో ప్రసారమయ్యాయి. తన సేవల విస్తరణలో భాగంగా డిజిటల్‌ స్పేస్‌లోనూ అన్నపూర్ణ స్టూడియో తనదైన ప్రతిభను కనబరుస్తోంది. మల్టిపుల్‌ లీడింగ్‌ ప్లాట్‌ఫార్మ్స్ కి కంటెం్‌ అందిస్తోంది.

ఫిల్మ్ అండ్‌ మీడియా ఇండస్ట్రీలకు అన్నపూర్ణ స్టూడియోస్‌ అందిస్తున్న సేవలు అనితరసాధ్యమైనవి. 11 షూటింగ్‌ ఫ్లోర్లతో, అద్భుతమైన లొకేషన్ల ఫెసిలిటీస్‌తో ఫిల్మ్ అండ్‌ మీడియా ఇండస్ట్రీకి అందుబాటులో ఉంది ఈ సంస్థ. స్టేట్‌ ఆఫ్ ది ఆర్ట్ టీపీయన్‌ సర్టిఫికెట్‌ పొందిన సంస్థ ఇది. డాల్బీ అప్రూవ్డ్ పోస్ట్ ప్రొడక్షన్‌ ఫెసిలిటీలున్న సంస్థగానూ గుర్తింపు పొందింది. డేటా స్టోరేజ్‌, వీడియో ఎడిటింగ్‌, ఆడియో డబ్బింగ్‌, 4కె కలర్‌ గ్రేడింగ్‌, విజువల్‌ ఎఫెక్స్ట్, వరల్డ్ క్లాస్‌ డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ మిక్సింగ్‌ మాస్టరింగ్‌ వంటి సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

అన్నపూర్ణ గ్రూప్‌ తరఫున అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్ అండ్‌ మీడియాకు సాయం అందుతూనే ఉంటుంది. భారతదేశంలో ఫస్ట్ నాన్‌ ప్రాఫిట్‌ ఫిల్మ్ స్కూల్‌గా పేరుంది అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్ అండ్‌ మీడియాకు. ప్రభుత్వ గుర్తింపు పొందిన డిగ్రీలు, మాస్టర్స్, ఎంబీఏ కోర్సులు ఫిల్మ్ అండ్‌ మీడియా రిలేటెడ్‌ సబ్జెక్టుల్లో అందిస్తోంది.

క్యూబ్‌ సినిమా గురించి…
క్యూబ్‌ సినిమా (www.qubecinema.com)కు సినిమా రంగంలో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. సినిమా టెక్నాలజీలోనూ, సొల్యూషన్స్ లోనూ అందెవేసిన చేయిగా గుర్తింపు ఉంది.
సినిమా బిజినెస్‌లో దశాబ్దాల తరబడి అనుభవం ఉంది క్యూబ్‌ సినిమాకు. ఇండస్ట్రీలోని ఫిల్మ్ మేకర్స్ కి డిజిటల్‌ ఎన్విరాన్‌మెంట్‌ని సమకూర్చడంతో పాటు ఎగ్జిబిటర్స్, ఆడియన్స్ కి పోస్ట్ ప్రొడక్షన్‌ ఫెసిలిటీలను కూడా కల్పిస్తోంది. క్యూబ్‌ త్రీ ప్రాడెక్టులను ఫిల్మ్ మేకింగ్‌ నుంచి ఎగ్జిబిషన్‌ ప్రాసెస్‌ వరకు ప్రతి స్టెప్‌లోనూ వాడుతున్నారు.

Annapurna Studios Qube: క్యూబ్‌ సినిమా ప్రాడెక్టులు పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. నమ్మశక్యంగానూ, అందుబాటు ధరల్లోనూ ఉంటాయి. క్యూబ్ వైర్‌, గ్లోబల్‌ కంటెంట్‌ డిస్ట్రిబ్యూషన్‌ సర్వీస్‌: క్యూబ్‌ ఎక్స్ పీ, ఫోర్త్ జనరేషన్‌ డీసీఐ కంప్లియంట్‌ డిజిటల్‌ సినిమా సర్వీసర్స్: క్యూబ్‌ మాస్టర్‌, ఫ్యామిలీ ఆఫ్‌ డిజిటెల్‌ సినిమా మాస్టరింగ్‌ సాఫ్ట్ వేర్‌ సొల్యూషన్స్: ఐ కౌంట్‌, కెమెరా బేస్డ్ ఆక్యుపెన్సీ మెజర్‌మెంట్‌ సొల్యూషన్స్: స్టైడ్స్, జస్ట్ ఇన్‌ టైమ్‌ డిజిటల్‌ సినిమా ప్యాకేజెస్‌: ఛీర్స్, మూవీ ఆడియన్స్ కి బిగ్‌ స్క్రీన్‌లో పర్సనలైజ్డ్ గ్రీటింంగ్‌‌ కార్డులు: జస్ట్ స్టిక్స్, క్లౌడ్‌ బేస్డ్ సాస్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌: మూవీ ఇన్‌ఫర్మేషన్‌ కోసం మొబైల్‌ యాప్స్, మూవీ బఫ్‌ వెబ్‌సైట్‌. ప్రపంచవ్యాప్తంగా అత్యద్భుతంగా ఎస్టాబ్లిష్‌ అయింది క్యూబ్‌ ప్రాడక్ట్. ప్రపంచవ్యాప్తంగా 135 దేశాల్లో వేల కొలది ఇన్‌స్టాలేషన్స్ ఉన్న సంస్థ ఇది.

Annapurna Studios Qube: గ్లోబల్‌ సినిమా బిజినెస్‌కి అనువుగా కావాల్సిన అన్ని హంగులనూ అమరుస్తోంది క్యూబ్‌ సర్వీస్‌. దేశ వ్యాప్తంగా 4వేల స్క్రీన్స్ ఉన్నాయి. ప్రతి ఏటా భారతదేశంలోని ఆరు ప్రదేశౄల నుంచి 1,800 సినిమాలను మాస్టర్స్ చేస్తోంది. డిజైన్‌, ఈపీఐక్యూ బ్రాండ్‌ కింద ప్రీమియమ్‌ లార్జ్ ఫార్మ్ స్క్రీన్స్ డిజైన్స్, డెలివర్స్ చేస్తోంది. క్యూబ్‌ సినిమా నెట్‌వర్క్ లో పేటెంటెడ్‌ అడ్వర్టైజింగ్‌ నెట్వర్క్ ఉంది. మూవీ సెలక్షన్‌ లోకల్‌ కంట్రోల్‌తో పాటు యాడ్స్ సెంట్రల్‌ కంట్రోల్‌ కూడా ఇందులోనే ఉంది.

వీటికి సంబంధించిన అదనపు సమాచారం కోసం సంప్రదించండి:
అన్నపూర్ణ స్టూడియోస్‌
vps@annapurnastudios.com, Annapurna Studios Qube
Qube Cinema
vps@qubecinema.com

Annapurna Studios Qube: ANNAPURNA®️ STUDIOS FOR IMMEDIATE RELEASE

Annapurna Studios Qube: Annapurna Studios and Qube Cinema Launch State-of-the-Art Virtual Production Stage in Hyderabad

The ANR Virtual Production Stage is a state-of-the-art facility that allows filmmakers to tell stories without being limited by location or space.

Hyderabad, May 15, 2023 Annapurna Studios Qube: Annapurna Studios and Qube Cinema, two respected names in the Indian media business, have launched the ANR Virtual Production Stage in Hyderabad. This state-of-the-art ICVFX (In-Camera Visual Effects) facility promises to revolutionize the production process for filmmakers. The ANR Virtual Production Stage has been conducting tests since October 2022 and has already been used to shoot multiple movies, ads, and music videos. With its comprehensive workflow solution, the facility now offers filmmakers unprecedented flexibility and control, allowing them to achieve their creative goals without any limitations.

Annapurna Studios Qube: The technology used in the setup is cutting-edge, featuring a high brightness, curved LED wall spanning 60 ft in width and 20 ft in height, 2.3 mm dot-pitch, with ultra-high refresh rate and wide colour gamut. Top- of-the-line AOTO LED displays, state-of-the-art camera tracking using stYpe’s RedSpy, and powerful, custom-built rendering systems using Unreal Engine allow for real-time rendering of complex photorealistic virtual locations.

Filmmakers can now seamlessly blend real and virtual elements and shoot scenes in various locations worldwide without the need to physically relocate. They also have the ability to manipulate weather and lighting to their liking, giving them greater creative control.

Annapurna Studios Qube:


Annapurna Studios Qube: Annapurna Studios is known for its infrastructure and services it provides for the media and film industry. Starting as a traditional film studio and production house, today it has transformed into an international standard studio with end-to-end services for all media formats. ‘Annapurna’ as a legacy brand is established in production, distribution, infrastructure and is constantly endeavouring to bring new technologies and business models to the media industry.

Annapurna Studios Qube: Qube Cinema’s success in transforming the media industry in India over the last three decades is a testament to the company’s willingness and ability to identify and adopt technology that can greatly improve production and post-production workflows. The unique collaboration between Annapurna and Qube will leverage this experience to reimagine the production process for today’s fast-paced and demanding entertainment environment with virtual production, the next evolutionary step in content production.

Annapurna Studios Qube: “The successful launch of the ANR Virtual Production Stage is a testament to our commitment to delivering cutting-edge services to our clients,” said Nagarjuna Akkineni of Annapurna Studios. “Our strength and experience in making movies and running studios in tandem with Qube’s technical knowledge make this a great collaboration. Virtual production enables the creative mind to imagine without limit and then create it.”
Annapurna Studios | Qube Cinema 1

“We are excited to collaborate with Annapurna Studios to bring this innovative technology to filmmakers in India and around the world,” said Jayendra Panchapakesan, Co-founder of Qube Cinema. “This is the start of a new era in content production, and we are committed to creating an ecosystem that allows filmmakers to work in a highly efficient and cost-effective manner. Virtual production is the next big paradigm shift in content production, and we are thrilled to be leading this transformation.”

Annapurna Studios Qube: The launch of the ANR Virtual Production Stage is a game-changer for the Indian film industry, and it will help India’s entertainment sector take a significant step forward in the global entertainment industry. The stage is the first world-class permanent ICVFX facility in India, offering significant cost savings in logistics and production, and it promises to empower filmmakers to tell their stories without being limited by location or space.
For further information, please contact vps@annapurnastudios.com and vps@qubecinema.com.


Annapurna Studios Qube: About Annapurna Studios
Annapurna Studios (www.annapurnastudios.com) is a fully integrated media & entertainment company.
Established in 1976 by Padma Vibhushan and Dada Saheb Phalke awardee, Sri Akkineni Nageswara Rao, a pioneer in the Telugu Film Industry, the studio offers facilities for the production of feature films, TV and digital shows, special events, advertising commercials, music videos and more.

Annapurna Studios Qube: The 22-acre studio in the heart of Hyderabad city is a unique one-stop film production studio.
A filmmaker can walk into Annapurna Studios with a script and walk out with a complete film. Having been in the entertainment Industry for over 70 years, participating in production, services & distribution, Annapurna Studios’ film production arm has produced and financed over 50 feature films under the Annapurna banner while its television series air on primetime Telugu channels such as Zee TV and Star MAA. With the rise of streaming services, Annapurna has expanded to the digital space, providing content for multiple leading platforms.

Annapurna Studios Qube:
Annapurna’s service offerings and facilities for the film and media industry are unparalleled.
Annapurna Studios provides first class infrastructure with 11 shooting floors and location facilities for the film and media industry, along with state-of-the-art TPN-certified, and Dolby approved post-production facilities. The services offered include data storage, video editing, audio dubbing, 4K colour grading, visual effects, world-class Dolby Atmos sound mixing and mastering.


The Annapurna group also lends its support to the Annapurna College of Film & Media, the first non-profit film school in India that offers government-accredited Bachelors, Masters, and MBA courses in Film and Media related subjects.


Annapurna Studios Qube: About Qube Cinema
Qube Cinema (www.qubecinema.com) is a pioneer in crafting end-to-end digital cinema technology and solutions.
Drawing on decades of experience in the cinema business, Qube provides a seamless digital environment across the industry, from filmmakers and post-production facilities to exhibitors and audiences.
Qube’s products are used in every step of the filmmaking and exhibition process.
Annapurna Studios | Qube Cinema 2

Annapurna Studios Qube: Qube Cinema’s portfolio of products are powerful, flexible, reliable, and cost-effective, and include Qube Wire, a service for global content distribution; Qube XP, fourth generation DCI compliant digital cinema servers; QubeMaster, a family of digital cinema mastering software solutions; iCount, a camera-based occupancy measurement solution; Slydes, a system that automatically creates just-in-time Digital Cinema Packages; Cheers, a web service for movie audiences that offers personalised greetings cards on the big screen; Justickets, a cloud-based SaaS ticketing solution; and Moviebuff, a website and mobile apps for accurate movie information. The Qube product line is well-established globally, with thousands of installations serving 135 countries across the world.

Annapurna Studios Qube:
Qube’s service offerings are constantly evolving to cater to the needs of the global cinema business.
Qube has digital cinema operations in over 4,000 screens across India, masters over 1,800 movies each year across 6 locations in India, designs and delivers the most cost-efficient Premium Large Format screens under its EPIQ brand and operates a patented advertising network for central control of advertising with local control of movie selection as the Qube Cinema Network (QCN) and Annapurna Studios Qube.

Annapurna Studios Qube:
For further information, please contact:
Annapurna Studios
vps@annapurnastudios.com
Qube Cinema
vps@qubecinema.com

Annapurna Studios Qube

Tags:

#Nagarjuna#AnnapurnaStudios#QubeCinema #filmcombat #FilmCombat #AnnapurnaStudiosQube

@iamnagarjuna

@AnnapurnaStdios

@qubecinema#MovieTalkies

You May Like…

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page