- Advertisement -spot_img
HomeUncategorizedPareshan Trailer Launch: గిప్పుడే నిమ్మలం కార్రి తర్వాత అంతా 'పరేషానే'...

Pareshan Trailer Launch: గిప్పుడే నిమ్మలం కార్రి తర్వాత అంతా ‘పరేషానే’…

- Advertisement -spot_img

Pareshan Trailer Launch: గిప్పుడే నిమ్మలం కార్రి తర్వాత అంతా ‘పరేషానే’…

Pareshan Trailer Launch మసూద విజయంతో దూసుకుపోతున్న యంగ్ హీరో ‘తిరువీర్’ పల్లెటూరి సరదా డ్రామా పరేషాన్‌లో అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాల్తేర్‌ ప్రొడక్షన్స్‌ పై విశ్వతేజ్‌ రాచకొండ, సిద్దార్థ్‌ రాళ్ళపల్లి నిర్మించారు. రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకుడు. ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి రానా దగ్గుబాటి సమర్పకుడిగా రావడంతో పెద్ద బ్యాకింగ్ ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది. జూన్‌ 2న థియేటర్‌లలో విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా ఆదివారంనాడు హైదరాబాద్‌లోని పివిఆర్‌ సినీ మ్యాక్స్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు రూపక్ రోనాల్డ్‌సన్, సంగీత దర్శకుడు యశ్వంత్‌ నాగ్‌, వాల్తేర్‌ ప్రొడక్షన్స్‌ అధినేతలు విశ్వతేజ్‌ రాచకొండ, సిద్దార్థ్‌ రాళ్ళపల్లి, నటీనటులు పావని కరణం, మురళీ, తిరువీర్‌, రానా దగ్గుబాటి, సినిమాటోగ్రాఫర్‌ వాసు పందెం, గీతరచయిత అఖిల్‌ చంద్రమౌళి హాజరయ్యారు.

Pareshan Trailer Launch ట్రైలర్‌ ఎలా ఉందంటే తిరువీర్ తండ్రి పరీక్షలలో అతని మార్కుల గురించి ఉపన్యాసం ఇవ్వడంతో వీడియో ఫన్నీ నోట్‌లో ప్రారంభమవుతుంది. తర్వాత, తదుపరి సన్నివేశంలో అతని తల్లి చేత తిట్టించబడతాడు. అందరిచే మందలించి నప్పటికీ, తిరువీర్ మరియు అతని స్నేహితుల బ్యాచ్ వారి మార్గాలను సరిదిద్దుకోలేదు. వారి నిర్లక్ష్య వైఖరి మరియు చెడు అలవాట్ల కారణంగా వారు తమ జీవితంలో గమ్మత్తైన పరిస్థితులలోకి ప్రవేశిస్తారు. తిరువీర్‌కి పావని కర్ణన్ పాత్రలో ఒక స్నేహితురాలు ఉంది. ట్రైలర్ వినోదం మరియు భావోద్వేగ అంశాలతో నిండి ఉంది మరియు ప్రేక్షకులు ఉల్లాసంగా ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది.

Pareshan Trailer Launch ట్రైలర్ అనంతరం హీరో తిరువీర్‌ మాట్లాడుతూ, ఈ సినిమా పోస్టర్‌లో వెనుకన వున్న చాలామంది ఊళ్ళలోనే ఉండేవారు. వారికి సినిమాలోకం గురించి పెద్దగా తెలీదు. వారందరినీ వెండితెరపైకి తీసుకువచ్చాం. అలా తీసుకురావడానికి రానా గారే కారణం. కొన్ని సినిమాలు మనం కనెక్ట్‌ చేసుకుంటాం. కొన్ని బాగా నచ్చి రిపీట్‌గా చూస్తుంటాం.

మంచిర్యాలలో పుట్టి పెరిగి అక్కడ కథను రాసుకుని రూపక్‌ సార్‌ ఈ సినిమా తీశారు. ఈ సినిమాను రిపీట్‌గా చూస్తారని నమ్మకం వుంది. ఇంతకుముందు కొంతమందికి స్క్రీనింగ్‌ వేశాక, అరె.. ఏం సినిమారా.. నవ్వి నవ్వి దవడలు నొచ్చుకుంటున్నాయిరా.. అంటుండేవారు. దానికి భరోసాగా రానా దగ్గుబాటి గారి ప్రెజెంట్స్‌ వుంది కాబట్టి ధైర్యంగా సినిమాకు వచ్చేయచ్చు అని అన్నారు.

Pareshan Trailer Launch హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ, ఈ యంగ్‌ టీమ్‌ అంతా ప్రేమించి ప్యూర్‌ ఎనర్జీతో సినిమా తీశారు. అది సినిమాలో కనిపిస్తుంది. నేను మొదటిసారి చూసినప్పుడు నాకూ నవ్వి నవ్వి.. దవడలు నొప్పి పెట్టాయి. నాకు తెలిసి హైదరాబాద్‌ వచ్చాక ఈ ఫంక్షన్‌ జరుగుతున్న ప్రాంతమంతా తారురోడ్డుతోనే వుండేది. ఈ చుట్టుపక్కలవున్న ప్రపంచమే నా లోకం.

అలాంటిది మీ టీమ్‌లో నేను చూశాను. ఇక తిరువీర్‌ నాతో ఘాజి సినిమాలో సబ్‌మెరైన్‌లో పని చేశాడు. తను మంచి ఆర్టిస్టు. తెలంగాణ ఫామ్‌మేషన్‌ డే జూన్‌ 2న ఈ సినిమా విడుదలకాబోతుంది. నిర్మాత విశ్వ నేను ఎక్కడున్నా పరేషాన్‌ చేస్తూ సార్‌. ట్రైలర్‌ చూడండి.. అంటూ చూపించేవాడు. చూశాక. నేను ఇందులో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను.

Pareshan Trailer Launch గీత రచయిత చంద్రమౌళి మాట్లాడుతూ, మంచిర్యాల ప్రాంతానికి చెందిన రూరల్‌ కథ. అక్కడి వాడిగా నాచేత దర్శకుడు పాటలు రాయించారు. తెలంగాణ మూలాలకు చెందిన ‘అత్తరు బుద్దరు పరాచికం.పాట..’, ‘సౌసారా..వంటి పాటలు రాయించారు. ఇందుకు దర్శకునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. హీరో రానాగారు ఈ సినిమా తీసుకోవడంతో మాలాంటి వారికి ఎంకరేజ్‌ గా వుంది అని అన్నారు.

Pareshan Trailer Launch నిర్మాతల్లో ఒకరైన విశ్వతేజ్‌ మాట్లాడుతూ, ముందుగా రానాగారికి థ్యాంక్స్‌. ఆయన ఎటువంటి లెక్కలు చూడకుండా మా సినిమాకు సహకరించారు. తను ప్యూర్‌ గోల్డ్‌ లాంటి మనిషి. నన్ను చాలామంది ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణ సినిమా చేశావేమిటని అడుగుతున్నారు. మంచి సినిమా, కొత్త కామెడీ పరిచయం చేద్దామని మోటివేషన్‌ చేద్దామని పరేషాన్‌ చేశాం. ఈ సినిమా అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ట్రైలర్‌ చేస్తూనే మీరంతా ఎంజాక్‌ చేశారని అర్థమయింది. సినిమా ఇంకా బాగుంటుంది. జూన్‌ 2న థియేటర్‌లో చూడండి అన్నారు.

Pareshan Trailer Launch మరో నిర్మాత సిద్దార్థ్‌ రాళ్ళపల్లి మాట్లాడుతూ, నేను, విశ్వ స్నేహితులం. విశ్వ కథ విని నాకు చెప్పాడు. చాలా బాగుంది. వినగానే ఎగ్జైట్‌ అయ్యాను చాలా సహజంగా వున్న తెలంగాణ మూలాల కథ అనిపించింది. మా నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇది. ఇక ఈ సినిమా రానా గారికి చూపించాలని అనుకుని చూపించాం. ఆయన చాలా సహరించారు. అందుకు థ్యాంక్స్‌ చెబుతున్నా అన్నారు.

Pareshan Trailer Launch హీరోయిన్‌ పావని కరణం మాట్లాడుతూ, పరేషాన్‌ నేను చేస్తున్న స్పెషల్‌ సినిమా. యాస, బాష డిఫరెంట్‌గా వున్నా నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌ చెబుతున్నా. తెలంగాణ పిల్లల్లోని అమాయకత్వం, ఆంధ్రపిల్లలోని గడుసుదనం నా పాత్రలో ఉంటాయి. తిరువీర్‌, నా పాత్రల మధ్య కామెడీ అందరూ ఎంజాయ్‌ చేస్తారు. రానాగారు ప్రివ్యూ చూసినప్పుడు ఎంతో ఎంజాయ్‌ చేశారు. అంతేకాకుండా మాతోపాటు ప్రమోషన్‌లో పాల్గొంటున్నారంటే మా టీమ్‌లోని నిజాయితీ ఆయన చూశారు. తెలంగాణ రీజనల్‌ స్టోరీ. పక్కా ఎంటర్‌టైన్‌ చేసే సినిమా. ఈ సినిమా చూస్తుంటే ఒక ఊరికి వెళ్ళినట్లుంది.

చిత్ర దర్శకుడు రూపక్‌ మాట్లాడుతూ, ఇలాంటి కథతో సినిమా తీయాలంటే గట్స్‌ వున్న నిర్మాతలు కావాలి. అలాగే రానాగారి సపోర్ట్‌ వుండడంతో మరింత ధైర్యం మాకు వచ్చింది. ఈ సందర్భంగా అందరికీ థ్యాంక్స్‌ చెబుతున్నా. మా కష్టాన్ని మర్చిపోయేలా చేసింది ఈ సినిమా. మీరు జూన్‌ 2న కుటుంబంతో రండి అంటూ ఆహ్వానించారు.

సంగీత దర్శకుడు యశ్వంత్‌ నాగ్‌ మాట్లాడుతూ, ఏడాదిపాటు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేశాను. అసలు సినిమా అయితదా.. అంటూ చాలామంది నన్ను అడిగేవారు. ఆ సందర్భంలో రానాగారి రావడంతో మాకు ధైర్యం వచ్చింది. తెలంగాణ మట్టివాసన మంచిర్యాలలో కనిపిస్తుంది. నిజాయితీగా సినిమా తీశాం. ఈ సందర్భంగా అందరికీ థ్యాంక్స్‌ చెబుతున్నా అని అన్నారు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వాసు పెండమ్‌, సంగీతం: యశ్వంత్‌ నాగ్‌ చౌరస్తా. అద్భుతమైన అవుట్‌పుట్‌ను తీసుకురావడానికి రెండూ కలిసి పనిచేస్తాయి. జూన్ 2న విడుదల కానున్న ఈ చిత్రానికి హరిశంకర్ ఎడిటర్.

తారాగణం: తిరువీర్. పావని కరణం, బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, బుద్దెర ఖాన్, రవి, రాజు బేడిగల, శృతి రాయన్, అంజి బాబు వాల్గమాన్, మురళీధర్ గౌడ్, పద్మ, వసంత, సురభి రాఘవ, శివరామ్ మరియు సాయి కిరణ్ యాదవ్

సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: రూపక్ రోనాల్డ్సన్
నిర్మాతలు: సిద్ధార్థ్ రాళ్లపల్లి
సమర్పకులు: రానా దగ్గుబాటి (సురేష్ ప్రొడక్షన్స్)
అసోసియేట్ ప్రొడ్యూసర్: విశ్వదేవ్ రాచకొండ హేమ రాళ్లపల్లి
బ్యానర్: వాల్తేర్‌ ప్రొడక్షన్స్
DOP: వాసు పెండమ్
ఎడిటర్: హరిశంకర్
సంగీతం: యశ్వంత్ నాగ్
కళ: శ్రీపాల్
గీత రచయిత: చంద్రమౌళి అక్కల
అడిషనల్ సినిమాటోగ్రాఫర్: సునీల్
సౌండ్ ఇంజనీర్: కృష్ణం రాజు ఆరుముగం
లైన్ ప్రొడ్యూసర్: ప్రవీణ్ విన్సెంట్
పోస్టర్లు: ప్రశాంత్ రాజ్
PRO: వంశీ శేఖర్

Tags: Pareshan Trailer Launch

You May Like This:

Jai Sriram Jai Sriram Raja Ram.. అద్భుతంగా ఆదిపురుష్ మొదటి పాట

Laal Salaam: Acting Legend Rajinikanth and Cricket Legend Kapil Dev to Share Screen Space

Siddharth and Divyansha : జూన్ 9న థియేటర్లలోకి రానున్న టక్కర్

G.O.A.T -GreatestOfAllTimes టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

Jr.NTR’s Devara: ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జూనియర్ ఎన్టీఆర్ భీకరమైన రూపం

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page