- Advertisement -spot_img
HomeUncategorizedVidudala (Vetrimaran's): గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు Zee5లో ప్రసారం

Vidudala (Vetrimaran’s): గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు Zee5లో ప్రసారం

- Advertisement -spot_img

Vidudala: A Must-Watch for Fans of Tamil Cinema

  • Vidudala: ఇండియాలో అతి పెద్ద డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఒక‌టైన జీ 5 ఎప్ప‌టి క‌ప్పుడు ప‌లు భాష‌ల్లో వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో సోషియో పొలిటిక‌ల్ డ్రామా ‘విడుద‌ల’ తెలుగు వెర్ష‌న్ చేరింది. మే 26న ఈ సినిమాకు సంబంధించిన డైరెక్ట‌ర్స్ క‌ట్ స్ట్రీమింగ్ కానుంది.

Vidudala అంటే థియేటర్ వెర్ష‌న్‌లో ప్రేక్ష‌కులు చూడ‌ని స‌న్నివేశాల‌ను ఈ డైరెక్ట‌ర్స్ క‌ట్‌లో చూసే అవ‌కాశం క‌లుగుతుంది. వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, సూరి, భవానీ శ్రీ, గౌతమ్ వాసదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆడుగ‌లం, విచార‌ణ‌, అసుర‌న్ వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించి అటు ప్రేక్ష‌కులు, ఇటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు వెట్రి మార‌న్ ‘విడుదల’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

‘Vidudala’ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే కుమరేశన్ అనే పోలీస్ కానిస్టేబుల్‌కి సంబంధించింది. ఈ పాత్ర‌లో సూరి న‌టించారు. మిలిటెంట్ నాయ‌కుడు పెరుమాల్ (విజ‌య్ సేతుప‌తి)ను ప‌ట్టుకోవ‌టానికి వ‌చ్చిన పోలీసు బృందానికి డ్రైవ‌ర్‌గా కుమరేశన్ ప‌ని చేస్తుంటాడు. పెరుమాల్ ఓ ప్ర‌భుత్వ వ్య‌తిరేక సంస్థ‌ను స్థాపించి సాయుధ పోరాటం చేస్తుంటాడు. ఆయ‌న పోరాటం శాంతికి విఘాతాన్ని క‌లిగిస్తుందని పోలీసులు అతన్ని అరెస్ట్ చేయటానికి చూస్తుంటారు. కుమరేశన్ సమాజంపై పాజిటివ్ దృక్ప‌థాన్ని క‌లిగి ఉంటాడు.

పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చిన్న పోలీసుగా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేస్తాడు. స‌మాజంలో మంచి, చెడుల గురించి తెలుసుకునే క్రమంలో కుమరేశన్‌కి ఆ ఆటవీ ప్రాంతంలో నివ‌సించే అమ్మాయి త‌మిళరసి (భ‌వానీ శ్రీ)తో ఓ భావోద్వేగ బంధాన్ని ఏర్ప‌డుతుంది. ఈ కారణమే పోలీసుల‌కు బందీగా దొరికిన పెరుమాల్‌ను త‌ప్పించుకునేలా చేస్తుంది.

‘Vidudala’ చిత్రంలో విలువలు పాటించ‌కుండా ఇత‌రుల‌ను ఇబ్బంది పెట్టేలా ఉండే పోలీసుల క్రూర‌త్వాన్ని చూపించారు. దీంతో పాటు 1990 ద‌శ‌కంలో త‌మిళ‌నాడు రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను కూడా ఇందులో చ‌ర్చించారు. అమాయ‌కుల‌పై విచార‌ణ పేరుతో చేసే అకృత్యాల‌ను చూస్తూ అతనొక ప్రేక్ష‌కుడిలా ఉండిపోతాడు. సూరి త‌న అమాయ‌క‌త్వాన్ని, నిస్స‌హ‌యాత‌ను న‌టుడిగా చ‌క్క‌గా చూపించారు. ప్ర‌భుత్వానికి, పై అధికారుల‌కు విధేయుడిగా ఉంటూ ఉద్యోగం చేసే కుమరేశన్ అమాయ‌క‌త్వం అత‌న్నుంచి వెళ్లిపోతుంది. అత‌ను అంద‌రినీ ప్ర‌శ్నిస్తాడు.

జీ 5 చీఫ్ బిజినెస్ ఆఫీస‌ర్ మ‌నీష్ క‌ల్రా మాట్లాడుతూ ‘‘అన్నీ వర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే కంటెంట్‌ను అందించాల‌ని జీ 5 ప్ర‌య‌త్నిస్తుంది. ఈ ఏడాది విడుద‌లై భారీ విజయాన్ని సాధించిన ‘విడుదల’ మంచి విజ‌యాన్ని సాధించింది. దీన్ని డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌కు అందిచంటం చాలా ఎగ్జ‌యిటెడ్‌గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడియెన్స్ వీక్షించ‌ని డైరెక్ట‌ర్ క‌ట్‌లో ఈ చిత్రాన్ని అందిస్తున్నాం. ఇందులో థియేటర్స్‌లోని లేని సన్నివేశాలను వీక్షించవచ్చు. ఈ చిత్రం క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు వెట్రి మార‌న్ మాట్లాడుతూ ‘‘‘విడుదల’ రిలీజ్ అయినప్పుడు అపూర్వమైన స్పందన వచ్చింది. మంచి కంటెంట్‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌న‌టానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్‌. ఈ జ‌ర్నీలో నాకు మ‌ద్ద‌తుగా నిలిచిన నా టీమ్‌కు ధ‌న్య‌వాదాలు. థియేట‌ర్స్‌లో ఘ‌న విజ‌యాన్ని సాధించిన ఈ చిత్రం ఇప్పుడు బిగ్గెస్ట్ డిజిట‌ల్ ఫ్లాట్ ఫామ్ జీ 5లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌బోతుండ‌టం ద‌ర్శ‌కుడిగా నాకెంతో సంతోషాన్ని క‌లిగిస్తోంది’’ అన్నారు.

యాక్టర్ సూరి మాట్లాడుతూ ‘‘ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్‌గారు ఓ పెద్ద ఇన్‌స్టిట్యూట్‌. ప్రతి యాక్ట‌ర్ ఆయ‌న‌తో వర్క్ చేయాల‌ని అనుకుంటారు. అలాంటి ద‌ర్శ‌కుడితో విడుద‌లై పార్ట్ 1లో న‌టించ‌టం జీవితంలో మ‌ర‌చిపోలేని అనుభూతినిచ్చింది. న‌టుడిగా ఈ జ‌ర్నీ నాకెంతో ప్ర‌త్యేకం. ఇప్పుడు జీ 5లో ‘విడుదల’ డైరెక్ట‌ర్స్ క‌ట్ ఆడియెన్స్ ముందుకు మే 26న అందుబాటులోకి రానుంది. ఇప్పుడు ప్ర‌పంచంలో దీన్ని ఇంకా ఎక్కువ మంది ప్రేక్ష‌కులు చూసే అవ‌కాశం క‌లిగింది’’ అన్నారు.

‘విడుదల’ డైరెక్టర్స్ కట్ కేవ‌లం జీ 5లో మాత్ర‌మే.

Tags: #illayaraja #soori

Read More…

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page