- Advertisement -spot_img
HomeUncategorizedనేషనల్ లెవెల్ లో ట్రెండింగ్ అవుతున్న 'ఆదిత్యా రామ్ ప్యాలెస్'.

నేషనల్ లెవెల్ లో ట్రెండింగ్ అవుతున్న ‘ఆదిత్యా రామ్ ప్యాలెస్’.

- Advertisement -spot_img

నేషనల్ లెవెల్ లో ట్రెండింగ్ అవుతున్న ‘ఆదిత్యా రామ్ ప్యాలెస్’.
గొప్ప కుటుంబాల్లో పుట్టి గొప్ప విజయాలను సాధించటం గొప్పకాదు… ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి అసాధారణ విజయాలతో అద్భుతాలను సృష్టించడమే అసలైన విజయం. ఒక సాధారణ తోటరాముడు కోటలోని రాజకుమారి మనసు గెలుచుకున్న కథలో ఉండే కిక్కే వేరు. అలాగే ఒక సాధారణ వ్యక్తి అంచనాలకు అందనిస్థాయిలో ఒక శక్తిగా,ఒక వ్యవస్థగా విస్తరిల్లడంలో గొప్ప స్ఫూర్తిదాయకమైన ప్రస్థానం ఉంటుంది. అలాంటి ఇన్స్పిరేషనల్ జర్నీ ఆదిత్యారామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆదిత్య రామ్ జీవితంలో కనిపిస్తుంది. ఒక చిన్న రియల్టర్ గా వ్యాపార జీవితాన్ని ప్రారంభించిన ఆదిత్య రామ్ ఈ రోజున ఒక రియల్ ఎస్టేట్ టైకూన్ గా, వేలకోట్ల అధిపతిగా, భారతదేశంలోనే వన్ ఆఫ్ ద టాప్ బిలియనియర్స్ గా ఎదగడంలో నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగసే రాకెట్ వేగం కనిపిస్తుంది. క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, నియమపాలన వంటి సత్ లక్షణాలనే తారకమంత్రాలుగా భావించిన ఆదిత్య రామ్ తన వ్యాపారాన్ని శాఖోప శాఖలుగా విస్తరించారు.

ఆదిత్య రామ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్
ఆదిత్య రామ్ స్టూడియోస్
ఆదిత్య రామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్
ఆదిత్య రామ్ మూవీస్
ఆదిత్య రామ్ కన్వెన్షన్స్ అండ్ రిసార్ట్స్
ఆదిత్య రామ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్
ఆదిత్య రామ్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్
ఆదిత్య రామ్ వరల్డ్ మేకింగ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఆదిత్య రామ్ చారిటబుల్ ట్రస్ట్

ఇలాంటి ఇంకా ఎన్నెన్నో సంస్థల సమాహారంగా ఎదిగింది ఆదిత్య రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. దేశంలో వేలకోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులు కోకొళ్లలుగా ఉన్నారు. కానీ వారిలో ఏ ఒక్కరిద్దరికో మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు.. never before.. ever after అన్న ప్రత్యేకమైన క్రెడిట్ దక్కుతాయి. ఇంతకూ ఆ ప్రత్యేకత ఏమిటంటే…. ఆదిత్య రామ్ ప్యాలెస్ హేష్ ట్యాగ్ అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవటమే ఆ ప్రత్యేకత. అవును ఇప్పుడు చెన్నై మహానగరంలోని కాస్ట్లియస్ట్ ఏరియా అయిన ఈసీఆర్ రోడ్డులో ఆదిత్య రామ్ నిర్మించిన “ఆదిత్యా రామ్ ప్యాలెస్” ఇప్పుడు ట్విట్టర్లో టాప్ త్రీ లో ట్రెండింగ్ అవుతుందన్న వార్త ‘టాక్ ఆఫ్ ద నేషన్ ‘ అయింది.

టాక్ ఆఫ్ ద నేషన్ అయ్యేంత అద్భుతం ఏం జరిగింది…? అంటే జరిగిందనే చెప్పాలి…. కలలో కనిపించే ఇంద్రభవనం కళ్ళముందే సాక్షాత్కరిస్తే అది అద్భుతం కాక మరేమౌతుంది…? అసలు 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చాక సౌత్ ఇండియాలో ఒక్కటంటే ఒక్క ప్యాలెస్ నిర్మాణం జరిగిన దాఖలాలు లేవు. అందుకే ఇప్పుడు చెన్నై మహానగరంలో ఆదిత్య రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆదిత్య రామ్ నిర్మించిన “ఆదిత్య రామ్ ప్యాలెస్” టాక్ ఆఫ్ ద కంట్రీగా సంచలనం సృష్టిస్తుంది. రియల్ ఎస్టేట్ అండ్ సినిమా రంగాలలో తిరుగులేని వ్యక్తిగా, శక్తిగా, వ్యవస్థగా ఎదిగిన ఆదిత్య రామ్ చెన్నై ఈసీఆర్ రోడ్డులోని తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంలో నిర్మించిన “ఆదిత్య రామ్ ప్యాలెస్” ఇంద్రభవనాన్ని తలపిస్తూ నేషనల్ వైడ్ గా థర్డ్ ప్లేస్ లో ట్రెండింగ్ అవుతుంది.

తెలుగువారైన ఆదిత్య రామ్ పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రియల్ ఎస్టేట్ అండ్ సినిమా రంగాలలో ప్రభంజన విజయాలు సాధించటం మనందరికీ గర్వకారణం. కుటుంబాన్ని అమితంగా ప్రేమించే ఆదిత్య రామ్ తన కుటుంబం కోసం అత్యాధునిక సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏకంగా ఒక ఇంద్ర భవనాన్ని బహూకరించడం విశేషం. సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సైతం తలలు తిప్పి మరీ “ఆదిత్య రామ్ ప్యాలెస్” ను ఆసక్తిగా తిలకిస్తూ పోవటం ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ద చెన్నై సిటీ’ అయింది.

చెన్నై మహానగరంలో ఎన్నెన్నో ప్రతిష్టాత్మకమైన వెంచర్స్ నిర్మించి “రియల్ ఎస్టేట్ టైకూన్” గా ఎన్నెన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు సొంతం చేసుకున్న ఆదిత్య రామ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం తో పాటు సినిమా రంగంలో కూడా సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నా రు. గతంలో సందడే సందడి, ఖుషీ ఖుషిగా, స్వాగతం, ఏక్ నిరంజన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆదిత్య రామ్ దాదాపు పుష్కరకాల విరామం తరువాత చిత్ర రంగ పునః ప్రవేశం చేయటాన్ని స్వాగతనీయ పరిణామంగా భావిస్తుంది చిత్ర పరిశ్రమ

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page