Santosham South Indian Film Awards 2023 ఒక సినీ వారపత్రిక ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తిచేసుకొని, ఇరవయి ఒకటో వసంతంలోకి అడుగుపెట్టడం అది కూడా సెకను సెకనుకు అప్డేట్స్ వస్తున్న ఈ డిజిటల్ యుగంలో అంటే అది చిన్న విషయం ఏ మాత్రం కాదు.
Santosham South Indian Film Awards 2023 ఆగస్ట్ 2వ తేదీతో ‘సంతోషం’కు 21 ఏళ్లు నిండి 22వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఈ రోజున పరిస్థితులలో పత్రికా నిర్వహణ కత్తిమీద సాము లాంటి వ్యవహారం, న్యూస్ ప్రింట్ ధరలు కొండెక్కి కూర్చున్న కాలంలో ఆర్థికంగా అది అత్యంత కఠిన పరీక్ష, ఈ పరీక్షలను, అవాంతరాలను, గండాలను తట్టుకోలేక ఎన్నో పత్రికలు కనుమరుగయ్యాయి. అయినా కాలానికి ఎదురీదుతూ, ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకుంటూ ‘సంతోషం’ దిగ్విజయంగా, చిద్విలాసంగా అడుగులు ముందుకేస్తూ వెళుతోంది.
Santosham South Indian Film Awards 2023 సినీ వార పత్రికా రంగంలో ఇది అపురూప సందర్భం! ఈ సందర్బాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి ‘సంతోషం సురేష్ గా పేరు పొందిన సురేష్ కొండేటి. ‘సంతోషం’ సాధించిన విజయం వెసుకున్న మనిషి ఆయనే. ఎడిటర్, పబ్లిషర్ గా సంతోషం’ను తన మానస పుత్రికగా భావించి అపూర్వంగా, అపురూపంగా చూసుకుంటూ, దాని ఎదుగుదలను అమితంగా ఆస్వాదిస్తూ, ఎప్పటికప్పుడు కొత్త సొబగులను అద్దుతూ, ప్రతి సంచికనూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ, చిత్రసీమలో దానికొక విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టారు సురేష్, అందుకే వారం వారం అందరూ ”సంతోషం’’గా చదువుతూనే ఉన్నారు. చేతిలో పత్రిక ఉంది గదా అని దానిని అడ్డుపెట్టుకుని ఎవరిపైనా రాళ్లు చేయటానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు. చేతిలో పత్రిక ఉంది అని దానిని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించలేదు. అది ఆయన నైజం కాదు తన పత్రిక ద్వారా అసలు ఏ ఒక్కరినీ నొప్పించడానికి ఒప్పుకోరు! అది ఆయన గుణం.
Santosham South Indian Film Awards 2023 తన సొంత పనులు, తన సొంత కార్యకలాపాలు.. అన్నీ తనవరకే పరిమితం. ఏనాడు, ఏ పరిస్థితిలోనూ పత్రికాముఖంగా ఎదుటి వాళ్లను తక్కువ చేయడానికి చూడలేదు, అవి జర్నలిస్టుగా ఆయనకు ఉన్న ఈత ఎథిక్స్. సురేష్ కొండేటి నిజాయితీకి నిలువెత్తు రూపం. అదే నిజాయితీని ఎదుటివాళ్ల నుంచీ ఆశిస్తారు. అలా అని ఆయన సత్తెకాలపు సత్తెయ్య కాదు. నేటి జనరేషన్ కి తగ్గట్లు ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకుంటూ ఉండడంతో ఇండస్ట్రీలోని చిన్నా, పెద్దా తేడా లేకుండా, సీనియర్లు జూనియర్లనే భేదం లేకుండా అందరూ సురేష్ కొండేటిని అభినందిస్తుంటారు. మరింత ఎదగాలని ఆశీర్వదిస్తుంటారు. ఇండస్ట్రీలో సురేష్ కొండేటి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. మరెన్నో నష్టాలను చవి చూశారు. మరొకరైతే ఆ కష్టాలు, నష్టాలు, సమస్యలకు కుంగిపోయి కుదేలై పోతారు. తట్టాబుట్టా సర్దుకొని మరేదైనా లాభసాటి పనో, వ్యాపారాన్నో చేపడతారు కానీ సురేష్ కొండేటి ముఖంపై చిరునవ్వు ఎప్పుడూ చెదరదు! సురేష్ కు సహజంగా అబ్బిన ఒక గుణం…. మాట చాతుర్యం. ఆ చాతుర్యంతో చొచ్చుకుపోవటం!
అందుకే ఈ సాధ్యంకాని అనుభవాన్ని, సీనియారిటీని, పరిచయాలను, ప్రాభవాన్ని అతి తక్కువ సమయంలోనే సంపాదించారు. ఎన్ని కష్టాలనైనా పడి పత్రికను నిర్విరామంగా తీసుకురావచ్చు. ఏడాది వేడుకలను’ అద్భుతంగా జరుపుకోవచ్చు. కానీ, వార్షికోత్సవ అవార్డుల వేడుకలను నిర్వహించడం ఒక అసామాన్యమైన విషయం. ‘ఈ అవార్డుల వేడుకను కూడా సంతోషం వార్షికోత్సవ వేడుకలతో పాటు జరుపుతూ వస్తున్నారాయన. వార్షికోత్సవ వేడుకల కంటే అవార్డుల వేడుకలను ఘనంగా జరపటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ సురేష్ కి సాధ్యమైంది. అవార్డుల వేడుక అంటే హైదరాబాద్ ఇండస్ట్రీ లోని వాళ్ళను పిలిచి అవార్డులను ఇచ్చేయడం కాదు. దక్షిణాదిలోని నాలుగు భాషా చిత్రసీమలకు సంబంధించి సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డులను నిర్వహిస్తూ వస్తున్నారు. దక్షిణాది భాషల్లో సీనియర్ కళాకారుల్ని సాదరంగా పిలిచి వారిని సత్కరించడమనే అసాధ్యమైన కార్యక్రమాన్ని ఏటేటా సురేష్ కొండేటి బ్రహ్మాందంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
Santosham South Indian Film Awards 2023 దీనిని బట్టి సురేష్ ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవచ్చు. సురేష్ కొండేటి అలు పెరుగని శ్రామికుడు. అదే ఆయన విజయ రహస్యం. కాక పోతే తెలుగునాట ఏ ఒక్క ఇతర పత్రికా నిర్వహించలేని (నిర్వహించలేక కొందరైతే మధ్యలోనే ఆపేశారన్న విషయం విదితమే ) అవార్డుల వేడుకను సురేష్ తానొక్కడిగా ఇన్నేళ్లుగా నిర్వహిస్తూ రావడం సాధ్యపడేవా? ఒక ప్రాంతీయ పత్రిక తన వార్షికోత్సవంతో పాటు, అవార్డు వేడుకను ఇన్నేళ్లుగా నిర్వహించడం సురేష్ ప్రతిభా సామర్ధ్యాలకు నిఖార్సైన తార్కాణం. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే సరిపోదు నిజాయితీ, నమ్మకం కూడా ఎడమలుగా నిలుపుకున్న సురేష్ కొండేటి అన్నిటా అగ్రస్థానంలో నిల్చుని విజయఢంకా మ్రోగిస్తున్నారు. ఇక గత ఏడాది నుంచి ఈ మధ్యకాలంలో పాపులర్ అయిన ఓటీటీలకు కూడా అవార్డులు ఇస్తూ తనను తాను అప్డేట్ చేసుకోవడమే కాదు ఇండస్ట్రీ వర్గాలకు కూడా ఒక దిక్సూచిలా నిలుస్తూ సురేష్ కొండేటి దూసుకుపోతున్నారు.
📝 Thanks Note Regarding we Entering into "SANTOSHAM" 22ND ANNIVERSARY..✨️💐
— Suresh Kondeti (@santoshamsuresh) August 2, 2023
Stay tuned!
Santosham South Indian Film Awards 2023 Celebrations- coming Soon in Big Scale. @santoshamsuresh #Sureshkondeti pic.twitter.com/NwlqkRiQLP
అంతేకాదు కరోనా సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమైతే సంతోషం డిజిటల్ ఫిలిం న్యూస్ అంటూ యూట్యూబ్ వేదికగా ప్రతిరోజు ఎపిసోడ్ల వారీగా రిలీజ్ చేస్తూ సినిమా విశేషాలను అందరికీ చేరువయ్యేలా చేశారు. కరోనా సమయంలో మొదలైన ఈ ఫిలిం న్యూస్ ఇప్పటికీ నిరాటంకంగా ఒక్క రోజు కూడా ఆగకుండా వెలువడుతూ 1223 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఒకరకంగా టాలీవుడ్ సినీ జర్నలిజం చరిత్రలో ఇది ఒక రికార్డుగా చెప్పాలి* ఇక ఈ ఏడాది జరగబోతున్న సంతోషం సినిమా అలాగే ఓటిటి అవార్డుల ఈవెంట్ కి సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నారు.
If you enjoyed this article, don’t forget to follow Film combat for more awesome content. 😎
We are on all your favorite social media platforms, so join us and stay updated with the latest news, reviews and gossip from the Telugu film industry. 🎬
🌐 FILM COMBAT – SOCIAL NETWORK PLATFORMS LINKS 🌐
- Website – The ultimate destination for Telugu cinema lovers. 💯
- YouTube – Watch our exclusive videos and interviews with the stars. 🌟
- Facebook – Like our page and share your thoughts with us. 👍
- Instagram – Follow us for some amazing photos and stories. 📸
- Twitter – Tweet us your feedback and suggestions. 🐦
- Pinterest – Pin our posts and discover new ideas. 📌
- ShareChat – Chat with us and other Telugu cinema fans. 💬
Read More.. – Because there is always more to explore. 🔎