ఆ డైరెక్టర్ పై కాటు వేసిన బడా ప్రొడ్యూజర్?
టాలీవుడ్ బడా ప్రొడ్యూజర్స్ కి ఏమయ్యిందో అర్థం కావట్లేదు. ఈ మధ్య జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే ఇండస్ట్రీ ఏమవుతోందా అని భయమేస్తుంది. మన తెలుగు ఇండస్ట్రీ కి రావాల్సిన అంతర్జాతీయ గుర్తింపు వస్తున్నా కూడా, కొందరు సినీ ప్రముఖులు ప్రవర్తించే తీరు అమానుషం. క్షణిక ఆవేశంలో చేసే పని వళ్ళ, వాళ్ల పరువే పోవడంతో పాటు, సినిమా నే నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళని, సినిమాల్లోకి వచ్చే వాళ్ళని భయ్యా బ్రాంతులకి గురి చేస్తున్నారు.
సినిమా మొదలు పెట్టాక పూర్తి అయ్యేటప్పటికి కొంతమంది నటి, నటులు మారటం మనం తరుచుగా చూస్తూ ఉంటాం. కాకపోతే, ఇక్కడ ఒక వింత జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నుంచి వినాయక చవితి వచ్చేలోపు ఏకంగా దర్శకుడు నే మార్చేసిన ఘనత ఒక బడా ప్రొడ్యూజర్ ది.
కొన్ని రోజులు క్రితం, హీరో విజయ్ దేవరకొండ కోటి రూపాయలు విరాళం డిస్ట్రిబ్యూషన్ పాయింట్ విషయంలో తొందరపాటు పడి అభిషేక్ పిక్చర్స్ ట్వీట్ చేయడం ద్వారా పెద్ద దుమారం రేపింది. అసలు మ్యాటర్ లోకి వెళ్తే, ‘అభిషేక్ పిక్చర్స్’ సగర్వంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం, డెవిల్(Devil). నందమూరి కళ్యాణ్ రామ్(Kalyanram), సంయుక్తా మీనన్(Samyuktha Menon) జంటగా నటిస్తున్నారు. నవీన్ మేడారం(Naveen Medaram) దర్శకత్వం చేస్తున్న ఈ చిత్రం సరవేగగంగా చిత్రీకరణ జరుపుకుంది. ఈ మధ్యనే హీరోయిన్ సంయుక్తా మీనన్ పుట్టినరోజు నాడు విడుదల చేసిన పోస్టర్లో దర్శకుడి పేరు కనిపించక పొయ్యే సరికి పెద్ద రచ్చకి దారితీసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ అడిగే ప్రశ్న, దర్శకుడు ఏమయ్యాడు? అతని పేరు ఎందుకు తీసేసారు? అని సగటు ప్రేక్షకుడి, సినీ వర్గాల ఆవేదన.
ఒక మంచి దర్శకుడిని అలా అర్ధాంతరం తీసేయటమనేది హాట్ టాపిక్ గా మారింది. అసలు దర్శకుడిని తొలగించి, బ్యానర్ పేరు ఎందుకు వెయ్యాలిసిన వచ్చింది. ఉగాది రోజు పోస్టర్ మీద ఉన్న అయన పేరు, ఇప్పుడెందుకు లేదు. అభిషేక్ పిక్చర్స్ కి, దర్శకుడికి ఏమన్నా అభిప్రాయ బేధాలు వచ్చాయా? లేకపోతే ఏమైనా డబ్బులు గొడవలు వచ్చాయా? అనేది తేలాలిసి ఉంది?
దర్శకుడు నవీన్ మంచి పనితనం ఉన్న వ్యక్తి. 2015 లో “నైస్ టూ మీట్ యు” అనే ఆంగ్ల చిత్రంతో తన దర్శకత్వ జీవితం మొదలు పెట్టి, కేవలం రెండు చిత్రాలతో అందరి మెప్పు పొందాడు. “బాబు బాగా బిజి ” అనే తెలుగు చిత్రంతో దర్శకుడిగా తెలుగు లో పరిచయం అయ్యారు. దాని తరువాత 2020 లో ‘సిన్’ అనే ఒక వెబ్ సిరీస్ తీశారు. ఇంతటి ప్రతిభావంతుడిని తొలగించటం అనేది టీమ్ యూనిట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆయనని టాగ్ చేసి సోషల్ మీడియాలో అందరు ఇదే ప్రశ్న అడగటంతో, అయన పెట్టిన ఒక పోస్ట్ ఇంకా అగ్గి రాసుకుంది. అయన తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో “వినాశకాలే విపరీతబుద్ధి ” అని హిందీ లో పోస్ట్ చేసారు. ఏదో పెద్ద గొడవ అయ్యుంటుందని సినీ వర్గాల టాక్. అందుకనే బలవంతంగా తొలగించారు అని టాక్.
తదుపరి వివరణ ఇవ్వాల్సింది ఇంక నిర్మాత సంస్థ అయినా అభిషేక్ పిక్చర్స్ మాత్రమే. ఇలాంటి తొలగింపు చర్యలు మానితేకానీ సినిమా వ్యవస్థ తన గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఉంటుంది. మరి, ఇన్ని సమస్యలు చుట్టూ తిరుగుతూ ఉన్న ఈ సినిమా రీలిజ్ అవ్వుతుందా? లేదా అనేది తెలియాలి?
డెవిల్, గరుడ చాఫ్టర్ వన్, గన్ను భాయ్, ప్రేమ విమానం, టైగర్ నాగేశ్వరరావు వరుస సినిమాలు అభిషేక్ పిక్చర్స్ ఆధ్వర్యంలో థియేటర్ లో రీలిజ్ కానున్నాయి.