హాయ్ నాన్న: మత్తేక్కిస్తున్న ‘సమయమా’ సాంగ్ | Nani, Mrunal Thakur.
ప్రేమ పాటలలో ఉండే మత్తే వేరు. ఒక యువకుడు తన మనసుకి నచ్చిన అమ్మాయిని వర్ణించటం, అది శ్రోతులు విని తరించటం ఆ అనుభూతే వేరబ్బా. ఇక మ్యాటర్ లోకి వెళ్తే, న్యాచురల్ స్టార్ నాని, అందాల తార మన సీత మహాలక్ష్మి ‘మృణాల్ ఠాకూర్’ జంటగా నటించిన చిత్రం “హాయ్ నాన్న”.
దసరా తరువాత నాని, సీతారామమ్ తరువాత మృణాల్ ఠాకూర్ కి ఇది తదుపరి చిత్రం. ఒక తండ్రి కూతురి మధ్య సాగే ఈ చిత్రం లోని మొదటి పాటని ఈరోజు విడుదల చేసారు. మన అందరికీ సుపరిచితుడు అయిన రచయిత ‘అనంత్ శ్రీరామ్’ రచించిన “సమయమా” అనే ప్రేమ కావ్యాన్ని అనురాగ్ కులకర్ణి, సితార కలిసి అతి మధురంగా గానం అందించారు. ఈ చిత్రానికి మలయాళం చిత్ర సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వాహబ్, తన పాటలతో హృదయాలను కొల్లగొట్టాడు. ఇది తెలుగులో రెండొవ చిత్రం.
ఇంక పాట విషయానికొస్తే వినసొంపైన ప్రేమ గీతం. తన ప్రేమని తెలుపుతూ ఒక యువకుడు ఆలాపించే ఈ పాట అందరిని ఆకట్టుకుంటుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అనురాగ్ మరియు సితార గళం ఈ పాటని మరొక లెవెల్ కి తీసుకెళ్లింది. వాహబ్ గారి సంగీత దర్శకత్వం లోంచి ఇంకొక మధురమైన యువళగీతం రావటం చాలా ఆనందకరం. అనంత్ శ్రీరామ్ గారి పదాలు, ప్రేమతో తన ప్రేయసిని వర్ణించే విధానం అమోఘం. తన ప్రేయసిని కలవటానికి ప్రయత్నిస్తున్న తరుణంలో సమయం తనకి తన ప్రేయసిని చూపించింది అనే అంశంమీద పాట ఉంటుంది. సమయానికి కృతజ్ఞతా చెప్పుతూ తన ప్రేమని, ప్రేయసితో చెప్పటం సూపర్బ్.
వాహబ్ గారు స్వరపరచిన హృదయం చిత్రం పాటలు తెలుగు వాళ్ళని చాలా ఆకట్టుకున్నాయి. ఈ మధ్య వచ్చిన ‘ఖుషి’ పాటలు అశేష ఆదరణ పొందాయి. “సమయమా”, పాటవలెనే మిగతా అన్నీ పాటలు మంచి ఆదరణ పొందాలని కోరుకుందాం.