“Recreating Magic: Can Anyone Match Sonia Agarwal’s Brilliance in the 7/G Brundavan Colony Sequel?”
సెల్వ రాఘవన్ సినిమా అంటేనే విభిన్నమైన అనుభూతి కలుగుతుంది. చూసేవాళ్ళకే కాదు, ఆ సినిమా లో పనిచేసేవాళ్ళకి కూడా ఒక మంచి అనుభూతి ఉంటుంది. సుమారు 19 సంవత్సరాల క్రితం విడుదల అయిన 7/జి బృందావన్ కాలనీ సినిమా, సెల్వ రాఘవన్ పని తనానికి ఒక చక్కటి ఉదాహరణ. ఆ చిత్రంలోని ప్రతి పాట, మాట మన గుండెల్లో పదిలిమైయ్యాయి. అసలు, విషయానికొస్తే ఈ చిత్రం కొన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ తెలుగు లో రీ-రీలిజ్ చేస్తున్నారు. ఆ సందర్భంగా హీరో రవి కృష్ణ, హీరోయిన్ సోనియా అగర్వాల్ పాత్రికేయులతో ముచ్చటించారు.
కొన్ని రోజులుగా సినిమా టౌన్ లో చక్కర్లు కొడుతున్న వార్త, ఈ చిత్రానికి కొనసాగింపు తీసే పనిలో దర్శక నిర్మాతలు ఉన్నారని. అదే నిజం అయ్యితే అంతకన్నా ఏం కావాలి. కానీ, అందరిలో ఒక చిన్న సందేహం ఉంది. అదే, ఈ చిత్రానికి మొదటి భాగం లో హీరోయిన్ సోనియా అగర్వాల్ గురించి? కథ ప్రకారం మొదటి భాగం చివరిలో యాక్సిడెంట్ లో సోనియా అగర్వాల్ చనిపోయినట్టు చూపించారు. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి రెండొవ భాగం సంభందించిన ప్రీ-ప్రొడక్షన్ మొదలు అయ్యింది. మరి, పార్ట్-2 కి కథానాయకి ఎవరు ఉంటారు? అనేది ప్రస్నార్ధకంగా మారింది?
ఈ చిత్రం మొదటి భాగంలో సోనియా అగర్వాల్ నటన మరిచిపోలేనిది. చాలా అందంగా, అనుకువగా, ఒక పక్కింటి అమ్మాయిలాగా పెర్ఫామెన్స్ తో పీక్ లేవేల్ లో నటించారు. ఈ చిత్రంలో సోనియా కాకుండా ఇంకెవ్వరూ చెయ్యలేరు అనేలా ఆవిడా పెర్ఫార్మన్స్ అట్లుంటది. ఇంక ఈ చిత్రానికి రెండొవ భాగం ఉంటుంది అని తెలిసినప్పటినుంచి కథానాయిక గురించే ఒకటే చర్చ.
ఈ చిత్రం తరువాత సోనియా కొన్ని చిత్రాలలో నటించి మెప్పించారు. కొంతకాలం గ్యాప్ తీసుకుని మళ్ళీ నటించటం మొదలు పెట్టారు, ఆవిడకు తగ్గ పాత్రలని చేస్తున్నారు కూడా. కానీ ఇప్పటికి సోనియా ని “అనిత” లాగే సినీ ప్రియులు పలకరిస్తున్నారు, చూస్తున్నారు. ఈ చిత్రానికి రెండొవ భాగంలో సోనియా ఉంటుందని, కాకపోతే హీరోయిన్ గా కాకుండా, చనిపోయిన అనిత, రవి కి తరుచు కనిపిస్తూ ఉంటుంది అని, అవిడ ఒక ఊహలగా హీరోకి సహాయం చేస్తుంది అని. ఇలాంటివి చాలానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, నిర్మాణ సంస్థ నుంచి విషయం బయటకి వచ్చేదాకా వేచిచూడాల్సిందే.
Follow Her Instagram….
https://instagram.com/soniaaggarwal1?igshid=MWZjMTM2ODFkZg==