ఆ క్రికెటర్ విషయంలో బాధ కలిగింది? అతను నా మిత్రుడు?
జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన చిత్రాలలో చాలా వరుకు ఆకట్టుకున్నాయనే చెప్పచ్చు. ఒక నటుడు కల్పిత పాత్రలో లీనం అవ్వటానికే చాలా కష్టపడతారు అలాంటిది నిజజీవిత పాత్రని చుపించాలి అంటే మామూలు విషయం కాదు. అది కూడా, ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రీడాకారుడు గురించి తియ్యాలంటే అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి.
శ్రీలంక క్రికెట్ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్, ప్రపంచం లోనే బెస్ట్ స్పిన్ బౌలర్ ఆయ్యన జీవితం ఆధారం గా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఎం.ఎస్ శ్రీపతి దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, మద్దుర్ మిట్టల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లో జరిగింది.
భారత క్రికెట్ దిగ్గజం అయినా వి.వి.యస్. లక్ష్మణ్ అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా మురళీధరన్ తో ఉన్న అనుబంధం, వాళ్ళ మధ్య జరిగిన కొన్ని స్నేహపూరిత క్షణాలని గుర్తుచేసుకున్నారు.
ఒక్కసారి హైదరాబాద్ లో ఇండియా & శ్రీలంక మ్యాచ్ జరుగుతునప్ఫడు మురళీధరన్ సరదాగా లక్ష్మణ్ డ్రెస్సింగ్ రూమ్ కి కాల్ చేసి, హైదరాబాద్ బిర్యానీ కావాలని అడిగారు అంట. అడిగింది సరదాగా అయినా కూడా, లక్ష్మణ్ ఒక అరగంటలో శ్రీలంక టీం మొత్తానికి బిర్యానీ తెప్పించారు. మురళీధరన్ వైజాగ్ లో దొరికే బిర్యానీ కూడా ఇష్టం అని చెప్పకనే చెప్పారు.
మురళీధరన్ డ్రెస్సింగ్ రూమ్ లో ఉంటే చాలా సందడిగా జోక్స్ వేస్తూ, అందరిని ఆటపట్టిస్తారు. ఇంకా చెప్పుకొచ్చిన విషయం ఏంటి అంటే, మురళీధరన్ తెలుగు సినిమా లు అంటే అపారమైన ప్రేమ. ఆయన తెలుగు సినిమాలు బాగా చూస్తారు అంటూ లక్ష్మణ్ మూమెంట్స్ షేర్ చేసుకున్నారు.
అదే విధంగా, మురళీధరన్ లక్ష్మణ్ గురించి మాట్లాడుతూ, క్రికెట్ చరిత్రలోనే స్పిన్ ని ఎదురుకొని బౌండరీస్ కొట్టగలిగే టెక్నీక్ ఉన్న బ్యాట్సమెన్ ‘లక్ష్మణ్’ నా సుదీర్ఘ బౌలింగ్ ప్రయాణంలో లక్ష్మణ్ వికెట్ తీయడానికి చాలా కష్టాలు పడ్డాను. అంత అవలీల గా స్పిన్ ని ఎదురుకుంటాడు. అటువంటి ప్రతిభావంతుడైన లక్ష్మణ్ ని టెస్ట్ లను మాత్రమే ఆడించి, వన్డేలకు ఎంపిక చేయడకపోవడంలో నేను చాలా బాధపడ్డాను. లక్ష్మణ్ వన్డేలు కూడా ఆడి ఉంటె బాగుండేది అనిపించింది అంటూ వాపోయాడు.
మొత్తానికి ఈ క్రికెట్ లెజెండ్ చిత్రం అక్టోబర్ లో విడుదల అవ్వబోతుంది. ఈ చిత్రం మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం.