విడాకులు తీసుకోనున్న ‘సూర్య’ వెబ్ సిరీస్ ఫెమ్ ‘మోనికా రెడ్డి’? ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి టార్చర్ చేశాడా?
బంధాలు భాందవ్యాలు ఎంతకాలం నిలబడుతున్నాయి అనేది ఈ మధ్య అర్ధం కావట్లేదు. ఈ తరం వాళ్ళు బంధాలని అసల లెక్క చేస్తున్నారా? లేదంటే ఒక ఆటలాగా భావిస్తున్నారో తెలియట్లేదు. ఒక బంధం మొదలైతే ఎంతకాలం నిలుస్తుందో తెలియని పరిస్థితి. ఒకరిని ఉద్దేశించింది కాదు గాని, ప్రపంచం మొత్తం ఇలానే ఉంది. ఇప్పుడిప్పుడే ఇండియా లో మరింత ఎక్కువైంది అని చెప్పాలి. కన్న అమ్మ నాన్నలు సొసైటీ లో తలెత్తుకునేలా ఎవ్వరు ఆలోచించట్లేదు.
కామన్ జనాలని పక్కన పెడితే, ఈ మధ్య సెలబ్రిటీస్ కూడా ఇలానే చేస్తున్నారు. వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళేం చేసినా, అది ఒక సెన్సేషన్ న్యూస్. వాళ్ళ పర్సనల్ విషయాలు అంటే జనాలకి ఇంటరెస్ట్ మరి ఎక్కువ. అలాంటి ఇంట్రస్టింగ్ పని చేసి వార్తల్లోకి వచ్చిన యూట్యూబ్ నయనతార మౌనిక రెడ్డి. అయిదు నెలల క్రితం అంగరంగ వైభవంగా గోవా లో పెళ్లి చేసుకుంది ఈ ముద్దు గుమ్మా. ప్రేమించి పెళ్లి చేసుకున్న మౌనిక ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది ఈ భామ.
విషయం లోకి వస్తే, మౌనిక రెడ్డి, తన పెళ్లి ఫోటో లు, ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి డిలేట్ చేసారు. తన భర్త ని కూడా ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసారు. ఇలా చెయ్యటంతో హాట్ టాపిక్ అయ్యింది ఈ బ్యూటీ.
అమ్మాయి క్యూట్ అబ్బాయి నాటు అనే వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది మౌనిక రెడ్డి. కనివిని ఎరుగని రీతిలో ఈ వెబ్ సిరీస్ 250+ పైగా ఎపిసోడ్స్ రన్ చేసి సరికొత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత సూర్య అనే వెబ్ సిరీస్ తో పాపులారిటీ తెచ్చుకొని నెస్ట్ లెవెల్ కి చేరుకుంది ఈ ముద్దు గుమ్మా.
ఈ సక్సెస్ కొనసాగుతుండగానే, వరుస పెట్టి సినిమా ఆఫర్లు రావడం, భీమ్లా నాయక్, హంట్ ఇలా పలు చిత్రాలలో మంచి క్యారెక్టర్లు చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది. హీరోయిన్ గా అవకాశాలు అందిపుచ్చుకు నే టైం లో, ప్రేమించిన అబ్బాయిని గోవా లో పెళ్లి చేసుకొని కెరీర్ ని పక్కన పెట్టింది అనుకునే టైంలో విడాకులు జరగటం ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురి చేసింది.
త్వరలో హీరోయిన్ గా మూడు సినిమాలు చేస్తూ బిజీ గా ఉండటంతో పాటు, గ్లోబల్ స్టార్ రాంచరణ్ ‘గేమ్ చెంజర్’ మూవీ లో కీ రోల్ అవకాశాన్ని అందిపుచ్చుకుంది బుల్లితెర నయనతార మౌనిక రెడ్డి. ఏదైమైనప్పటికీ, కెరీర్ ని నాశనం చేసుకోకుండా ఇక మీదటైనా చాలా జాగ్రత్తగా వెళ్తారని ఆశిద్దాం.
ఇప్పుడు ఇలా చెయ్యటం వల్ల వార్తల్లోకి వచ్చి, ప్రముఖ సినీ తారలను ఫాలో అవుతున్నారా అనిపిస్తోంది. ప్రముఖ సినిమా జంటలు, ఈ మధ్య విడిపోవటం వార్తల్లోకి ఎక్కటం, ఇలానే మొదట ఒకళ్ళని ఒకళ్ళు అన్ ఫాలో చేసుకోవటం, ఫొటోస్ తీసేయటం తో మొదలు పెట్టి, నెమ్మదిగా విడాకుల దాక వెళుతున్నారు.
ఈ కోవలోకి మౌనిక రెడ్డి కూడా వచ్చారా!! అని ఇప్పుడు చర్చనీయా అంశం అయ్యింది. ఇదే ప్రశ్న ఆవిడని ఒక పాత్రికేయుడు అడిగితే సూటిగా ఏమి చెప్పకుండా, మీకు కావాల్సిన కంటెంట్ ఇచ్చాను కదా. ఏది జరిగిన మంచికే అని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా కొన్ని రోజులు ఎదురు చూడవలసిందే.