తండ్రీ కూతురు మధ్య ఉండే అనుబంధం, అవి తెలుపుతూ సాగే పాటలు అమోఘంగా ఉంటాయి. ఆ కోవలోకి చెందిన పాటనే “ఉయ్యాలో ఉయ్యాలా “. నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న చిత్రం “భగవంత్ కేసరి”. అనిల్ రావిపూడి దర్శకత్వం లో కాజల్ నటిగా చేస్తున్నారు, శ్రీ లీల ఒక ముఖ్య పాత్రలో మెరుస్తున్న ఈ చిత్రం, అక్టోబర్ 19న అందరి ముందుకు వచ్చి సందడి చేయనుంది.
ఇక విషయానికొస్తే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన రెండొవ గీతం తండ్రి కూతురు మధ్య సాగే గీతం. అనంత్ శ్రీరామ్ రచించిన ఈ గీతాన్ని చరణ్ గాత్రంతో మరపురానిదిగా తీర్చిదిద్దారు. థమన్ సంగీతం అందించారు. పాట మధురంగా ఉండటంతో పాటు, చరణ్ స్వరం ఈ సాహిత్యానికి బలం. చిత్రీకరణ పరంగా చుస్తే ఈ గీతం తండ్రి తన కూతురు చిన్నప్పుడు ఆలపించేది అని తెలుస్తోంది. ఆ చిన్న పాపా శ్రీ లీల అని అర్థం అవుతోంది. కానీ పాట పరంగా బాగున్నప్పటికీ ఒక పాతకాలపు పద్దతి వాడినట్టు తెలుస్తోంది. అందులో కొత్తదనం కనిపించట్లేదు.
సాహిత్యం పరంగా బాగున్నప్పటికీ, థమన్ ఇచ్చిన బాణీయాలు పాట చింతకాయ పచ్చడిలా ఉన్నాయని వినికిడి. ఒక తండ్రి కూతురు మధ్య సాగే గీతం అయినా దానిలో ఒక ప్రేమ పదాలలో కనిపిస్తున్న స్వరంలో కనుమరుగయ్యింది అనేది తెలుస్తోంది
ఏది ఏమయినప్పటికీ పాట పరంగా బాగున్నా, ఇంకా మంచిగా చేయొచ్చు అనిపించేలా ఉంది. కానీ తండ్రి ప్రేమకి సంబంధించింది కాబట్టి పెద్దగా వంకలు రాకపోవచ్చు అనే అనుకోవాలి.