కనకాల ఒక బ్రాండ్!! ఆ బ్రాండ్ ని తమ వారసత్వం నిలబెడుతుందా?
వారసత్వ పరిచయాలు మన సినిమా ఇండస్ట్రీలో చాలానే జరిగాయి. వారసత్వంగా వచ్చిన నటీ నటులు చాలా మంది తమ ప్రతిభను ప్రదర్శించి గొప్ప స్థానానికి వెళ్లారు. అలాంటి వాళ్ళల్లో రాజీవ్ కనకాల ఒకరు. సీరియల్ నటుడిగా, ప్రసిద్ధ నటుడు దేవదాస్ కనకాల వారసత్వంతో పరిచయం అయిన ఆయన, తన నటనతో, గొప్ప స్థాయికి వెళ్లారు. అయన సతీమణి సుమ కనకాల గురించి చెప్పనక్కర్లేదు. ఆవిడకూడ సీరియల్ ఆర్టిస్ట్ గా వచ్చి, సుప్రసిద్ధ యాంకర్ గా స్థిరంగా పాతుకుపోయారు.
ఇప్పుడు ఈ సుప్రసిద్ధ జంట, వాళ్ళ పరంపరను కొనసాగిస్తూ, వాళ్ళ తనయుడిని కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. రోషన్ కనకాల హీరోగా, మానస చౌదరి నాయికగా, పరిచయం అవుతున్న చిత్రం “బబుల్ గమ్”. “క్షణం, కృష్ణ ఎండ్ హిస్ లీల” చిత్రాల దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ రెండు చిత్రాలకి పనిచేసిన సంగీత దర్శకులు శ్రీచరణ్ పాకల సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు మహేశ్వరీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇది ఒక రొమాంటిక్ డ్రామా. ఈ చిత్రానికి సంబందించిన టీజర్ రిలీజ్, ప్రఖ్యాత నటుడు, న్యాచురల్ స్టార్ నాని విడుదల చేసారు. టీజర్ అంతా రొమాంటిక్ గానే సాగింది. ఈ మధ్య తొలి పరిచయంతోనే అందరు హీరోలు రొమాంటిక్ సినిమాలు ఛాయస్ చేసుకుంటున్నారు. రొమాంటిక్ సన్నివేశాలు, హీరోయిన్ ని ఏడిపించే సన్నివేశాలు, ఫైట్ సన్నివేశాలు ఉండేలా చూసుకుంటున్నారు. బబుల్ గమ్ చిత్రం కూడా అలాంటిదే. ఒక కుర్రోడు, అనుకోని విధంగా ఒక అమ్మాయిని కలుస్తాడు. అనుకోని విధంగా తన జీవితం టర్న్ అవుతుంది. దానివలన తనకి ఉన్న సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఆ సమస్యలనుంచి ఎలా బయటపడ్డాడు అనేది చిత్రం.
టీజర్ చాలా క్లియర్ గా ఉంది. రోషన్ నటన కూడా మంచిగా ఉంది. దర్శకుడు తన ఇదివరకు చిత్రాలలానే ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నారు. ఎమోషనల్ ఎలిమెంట్స్, ఫైట్స్, కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. రాజీవ్ కనకాల, సుమ కనకాల వాళ్ళ తనయుడి గురించి, తనకి సినిమాల మీద ఉన్న తపన గురించి, ఈ చిత్రానికి తాను కష్టపడినా విధానం గురించి చెప్పుకొచ్చారు. వాళ్ళ కళ్ళల్లో పుత్రోత్సాహం చాలా మంచిగా కనిపిస్తోంది.
నాని మాట్లాడుతూ టీజర్ బాగుంది అని, టీం మొత్తానికి విజయం చేకూరాలని కోరుకున్నారు. రోషన్ కూడా టెన్షన్ పడుతున్నట్టు కనిపించినా, మంచిగా మాట్లాడారు. మొత్తానికి తరాల నటనా పరంపరను రోషన్ ఈ విధంగా కొనసాగిస్తారో చూడాలి.