- Advertisement -spot_img
HomeUncategorizedఆ హీరో తో రొమాన్స్ చేయనుందా? సీత గా మెప్పించిన హీరోయిన్ ఇంకో ట్యాగ్ లైన్...

ఆ హీరో తో రొమాన్స్ చేయనుందా? సీత గా మెప్పించిన హీరోయిన్ ఇంకో ట్యాగ్ లైన్ మూట కట్టుకోనుందా!! Mrunal Thakur

- Advertisement -spot_img

ఆ హీరో తో రొమాన్స్ చేయనుందా? సీత గా మెప్పించిన హీరోయిన్ ఇంకో ట్యాగ్ లైన్ మూట కట్టుకోనుందా!!

రౌడీహీరో విజయ్ సాయి దేవరకొండ, అందాల సీత మహాలక్ష్మి మృణాల్ ఠాకూర్ జంటగా ఒక చిత్రం రాబోతోంది. ప్రముఖ దర్శకుడు పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని వాళ్ళ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ద్వారా నిర్మిస్తున్నారు. ఇది వాళ్ళ బ్యానర్ నుంచి వస్తున్నా 54 వ చిత్రం. విజయ్ ఇంకా పరశురామ్ ఇదివరకు గీతా గోవిందం చేసారు. మళ్ళీ ఇప్పుడు కలిసి చెయ్యబోతున్నారు.

మృణాల్ ఠాకూర్, సీత రామం తరువాత, నాని తో హాయ్ నాన్న చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, పాటలు మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ తో చెయ్యబోయే చిత్రానికి “ఫ్యామిలీ స్టార్” అనే టైటిల్ ని అనుకుంటున్నట్టు వార్తలు వినపడుతున్నాయి. పరశురామ్ ఇదివరకు తీసిన కుటుంబ చిత్రాలలానే ఉండబోతోందా ఈ చిత్రం కూడా, లేకపోతే విజయ్ తరహాలో రొమాంటిక్ గా, ఉండబోతోందా తెలియాలి.

అర్జున్ రెడ్డి తరువాత, విజయ్ కి ఆ తరహా విజయం రాలేదు. కానీ అప్పటినుంచి చేసిన అన్ని చిత్రాలలోనూ హీరోయిన్ తో మంచి రొమాంటిక్ సన్నివేశాలు చేసారు. సీత రామం తరువాత మృణాల్ కి తెలుగులో మంచి గుర్తింపు ఉన్నాకూడా ఆవిడా ఎక్కువ సినిమాలు ఓప్పుకోలేదు. అలాగే, మృణాల్ ని కొంచం పొందికగా, మృదువుగా ఉండే తరహా పాత్రలో ఊహించుకుంటారు ఫాన్స్.

కానీ విజయ్ తో సినిమా అనేటప్పటికీ ఆవిడ అభిమానులకి చాలా అనుమానాలు ఉన్నాయి. విజయ్ ఇదివరకు చిత్రాలలాగా ముద్దు సన్నివేశాలు, ఇంకా రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయేమో, ఆ తరహా సన్నివేశాలు మృణాల్ ని ఎలా ఊహించుకోవటం అని ఇప్పటికే ఆవిడ ఫాన్స్ సతమతమవుతున్నారు. ఏమైనప్పటికి, ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ వీడియో ఈ నెల 16 వ తారీఖున విడుదల చేస్తున్నారు. వేచి చూడాలి మరి. ఏమవుతుందో.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page