కుటుంబ కథా చిత్రాల హీరో గా పేరు తెచ్చుకున్నప్పటికీ, అప్పుడప్పుడూ మాస్ ఆడియన్స్ ని తనలో ఉన్న మాస్ తో అలరిస్తూనే ఉంటారు వెంకీ మామ (విక్టరీ వెంకటేష్). ఇప్పుడు మళ్ళీ తన మాస్ అవతారాన్ని ఇంకోసారి ప్రేక్షకులకి రుచి చూపించబోతున్నారు. తన మొదటి రెండు చిత్రాలతోనే ఒక విలక్షణ దర్శకత్వం ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను. ఇప్పుడు వెంకీ మామ తో “సైంధవ్” అనే ఆక్షన్ ఫిలిం తీస్తున్నారు. ఈ చిత్రంలో భారీగా తారాగణమే ఉంది. బాలీవుడ్ విలక్షణ నటుడు “నవాజుద్దీన్ సిద్దిక్”, కోలీవుడ్ నటులు “ఆర్య”, “ఆండ్రియా” ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. శైలేష్ కొలను తన పేరులో ఉన్న రెండు పదాల అక్షరాలతో వెంకటేష్ క్యారెక్టర్ పేరు పెట్టారు, “సైకో” అని.
టీజర్ లోని అంశాలు:
ఇది ఒక పొలిటికల్, క్రైమ్, ఆక్షన్ మూవీ. సైకో గా వెంకటేష్ ఓదిగిపోయారు. చిన్న పాప పాత్రలో చేసిన బేబీ సారా కూడా అందంగా క్యూట్ గా ఉంది. ఎక్కువగా నవాజుద్దీన్ సిద్దిక్, వెంకటేష్ సన్నివేశాలు చూపించారు. టీజర్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఫైట్ సీన్స్, వెంకటేష్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఉన్న కాస్త వ్యవధిలోనే ట్రైలర్ లో డైరెక్టర్ శైలేష్ కొలను ముఖ్యమైన అంశాలని చూపించారు.
టీజర్ పరంగా అనుకుంటున్న కధ:
సైకో ఒకప్పటి ఏజెంట్/ఎస్సాస్సిన్. ఒక మిషన్ లో భాగంగా కొంత విధ్వంసం సృష్టించి, మిగిలిన వాళ్ళని ఇప్పటినుంచి అయిన సరిగ్గా ఉండమని వార్నింగ్ ఇచ్చి, అగ్న్యాతంలోకి వెళ్ళిపోతారు. సైకో ఇంకా రాడు అనుకుని, నవాజుద్దీన్ సిద్దిక్ ఒక పొలిటిషన్ కి సంబంధించిన మిషన్ లో సహాయం చెయ్యటానికి ప్లాన్ చేస్తారు. ఒక టెర్రరిస్ట్ సంస్థకి 20,000 మంది పిల్లలని పంపిణి చేసి, వాళ్ళకి ఆయుధాల శిక్షణ ఇవ్వటమే ఈ ప్లాన్ ఉద్దేశం. ఈ సంఘటనలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల, విషయం తెలుసుకున్న సైకో తిరిగి వస్తారు. అయన వచ్చాక ఏం చేసారు?
సైకో దగ్గర ఉన్న పాపకి, సైకో కి సంబంధం ఏమిటి, తాను సైకో సొంత పాప నా, లేకపోతే జరిగిన పరిణామాలతో సంబంధం ఉన్న ఏదైనా ఒక వ్యక్తి పాపనా? ఇంతకీ సైకో అజ్ఞాతం లోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది?
అజ్ఞాతం లోకి వెళ్ళకముందు సైకో చేసిన మిషన్ ఏమిటి? అయన అంటే అందరికి ఎందుకు అంత భయం? సైకో ని ఎదిరించి మానస్ (ఆర్య) , వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్దిక్) టెర్రరిస్ట్ ట్రైనింగ్ కాకుండా ఏమి చేద్దామని ప్లాన్ చేసారు? దాన్ని సైకో ఎలా ఆపారు అనేది సినిమా విడుదల అయ్యాక తెలుసుకోవాలిసిందే?
మొత్తానికి వెంకీ మామ, సైకో అనే పేరుతో టెర్రరిజం, క్రైమ్, థ్రిల్లర్, ఆక్షన్ నేపథ్యంలో సాగే కధ “సైంధవ్”. టీజర్ అయితే అందరికి నచ్చింది అనే చెప్పొచ్చు. సంక్రాంతికి విడుదల చేద్దామని ప్రయత్నాలు జరుగుతున్నాయి.