వరలక్ష్మి శరత్ కుమార్, అర్చన, అభినయ, అవికా ఘోర్, తులసి, సత్య రాజ్, జయ ప్రకాష్, బిందు మాధవి, రాజీవ్ కనకాల, రావు రమేష్ ఇలా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ “మాన్షన్ 24”. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉంటాయి. ఇప్పటికే, విడుదలైన ట్రైలర్ కి మార్కెట్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సిరీస్ ఎలా ఉంది అనేది….రివ్యూ లో చూద్దాం.
కథ: ఊరి చివర పాడు పడిన ఒక బంగ్లా గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు. అలాంటి భవనంలోకి కాళిదాస్ (సత్యరాజ్) వెళతారు. ఆయన వృత్తిపరంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఒక ఆఫీసర్. ఒక నిధిని వెతికే క్రమంలో అనుకోకుండా, ఆ ప్రాచీన భవనంలోకి వెళ్తాడు. అప్పటినుంచి ఆయన ఎవ్వరికీ కనిపించకుండా వెళ్లిపోవడంతో, దేశద్రోహి అని ప్రపంచం ముద్ర వేస్తుంది. అయన కూతురు ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్ అమృత(వరలక్ష్మి శరత్ కుమార్) తన తండ్రిని వెతకమని ప్రతి ఒక్కరిని ప్రాధేయపడుతుంది. చివరికి వరలక్ష్మి ఆ భవనంలోకి వెళ్లి తన తండ్రిని వెతకాలి అని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో, ఆ భవనంలో జరిగిన కొన్ని యధార్థ సంఘటనలు కాపలాదారు(రావురమేష్) నుంచి తెలుసుకుని, చివ్వరికి ఏం సాధించింది అనేది కథ?.
హార్రర్ తరహా కథలు, ఈ మధ్య బాగా ఎక్కువగా వస్తున్నాయి. కథ మంచిగా ఉండి, తీసిన విధానం బాగుంటే మంచి ఆదరణే లభిస్తుంది. తెలుగు ఇండస్ట్రీ లో హార్రర్ చిత్రాలకి ‘రామ్ గోపాల్ వర్మ’ అంటే కొట్టిన పిండి. ఆయ్యన తరువాత అంతటి పేరు తెచ్చుకుంది మన బుల్లితెర వీరుడు ‘ఓంకార్’. ఆయన ‘రాజు గారి గది’ చిత్రం థియేటర్ లో ఓ మోత మోగింది. అదే పేరుతో వచ్చిన మిగతా రెండు భాగాలు పెద్దగా గుర్తింపు పొందలేదు. ఇప్పుడు ఓంకార్ డిస్నీ హాట్ స్టార్ ప్రొడక్షన్ లో ఒక హార్రర్ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. అదే “మాన్షన్ 24”.
నటీనటులు పెర్ఫామెన్స్:
వరలక్ష్మి తో పాటు రావు రమేష్ కూడా ప్రతి ఎపిసోడ్ లో ఉండే ప్రధానమైన పాత్రలు. ఇద్దరు వాళ్ళకి ఇచ్చిన పాత్రలకి వెయ్యిశాతం న్యాయం చేసారు. ఈ సిరీస్ లో అయ్యప్ప శర్మ ఒక చిన్న పాత్ర చేసారు. కానీ ఆయన కనిపించిన వేషాధారానికి, నటించిన విధానానికి ప్రేక్షకులకి కొంత భయం వేస్తుంది. రావు రమేష్, భవనంలో నివసించిన కొంత మంది వ్యక్తుల కథల గురించి చెప్తూ, ఒక్కో ముఖ్య పాత్ర ని బయటపెడుతూ వరలక్ష్మి కి రివీల్ చేస్తారు. ప్రతి పాత్రలో, అందరూ ఓదిగిపోయారు. రాజీవ్ కనకాల, ప్రతి సీన్స్ లో ఆయన నట విశ్వరూపం చూపించారు.
సాంకేతిక విభాగం:
ఓంకార్ నుంచి ఒక సినిమా వస్తోంది అంటే అది హార్రర్ చిత్రమే అని అందరికి తెలుసు. కానీ ఈ వెబ్ సిరీస్ లో నేను భయపెడుతున్నాను అని అందరికి చెప్పినా కూడా ఎవ్వరు భయపడని పరిస్థితి. దర్శకత్వం పరంగా బాగా తీసిన భయపెట్టలేకపోయారు ఓంకార్. ఇది ఒక క్రైమ్ డ్రామాలాగా ఉంటుంది. హార్రర్ అని దెయ్యాలని చుస్తే కానీ అనిపించదు. వికాస్ ఇచ్చిన మ్యూజిక్ పర్లేదు అనిపించింది. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.
బాటమ్ లైన్: నత్త నడకగా సాగే “భయానక అన్వేషణ”.
రేటింగ్:2.5/5
రివ్యూ బై: సాయి రామ్
గమనిక: మా ఫిల్మ్ కాంబాట్ టీం రాసే ఆర్టికల్, రివ్యూ లు…ఒక వ్యక్తికి గాని, సంస్థ కి గాని పరోక్షంగా/ప్రత్యేక్షంగా అలాగే వ్యతిరేకంగా రాయడం చేయము. మేము రాసే ప్రతి అక్షరం మా గుండెల్లో నుంచి రాసిందే తప్ప ఎవ్వరిని ఉద్దేశించి రాసింది కాదు. సగటు మూవీ ప్రేక్షకుడిగా, ప్రతి సినిమా సక్సెస్ అయ్యితే సంబరాలు చేసుకునేది మొదట మా ఫిల్మ్ కంబాట్ టీం. ఇది ఓన్లీ మా అభిప్రాయం మాత్రమే.