చిత్రం: లియో
రిలీజ్ డేట్: 19 అక్టోబర్ 2023
తారాగణం: తలపతి విజయ్, త్రిష, అర్జున్ సర్జ, సంజయ్ దత్, గౌతమ్ మీనన్, మడోనా సెబాస్టియన్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
మ్యూజిక్ డైరెక్టర్: అనిరుద్ రవిచంద్రన్
సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస
ప్రొడ్యూజర్స్: లలిత్ కుమార్
డైరెక్టర్: లోకేష్ కనగరాజ్
కథ:
20 సంవత్సరాల క్రితం సత్య(త్రిష) & పార్తిబన్ (విజయ్) ఇద్దరు పెళ్లి చేసుకొని పిల్లలతో హిమాచల్ ప్రదేశ్ లో జీవనం సాగిస్తుంటారు. లోకల్ లో పార్తిబన్ కాఫీ షాప్ రన్ చేస్తుంటాడు. అక్కడ రేంజర్ గా ఉన్న జోషీ (గౌతమ్ మీనన్) & తన భార్య దీప(ప్రియా ఆనంద్)తో పార్తిబన్ కి మంచి స్నేహం ఉంటుంది. అనుకోకుండా ఒక రోజు తన కాఫీ షాప్ లోకి షణ్ముగం(మిస్కిన్) దొంగల ముఠా చొరబడుతుంది. తన కూతురిని, స్టాఫ్ ని రెస్క్యూ చేయడానికి ఆత్మరక్షణ కోసం, ఆ ముఠా ని పార్తిబన్ చంపి జైలు కి వెళ్తాడు. అక్కడనుంచి అసలు సమస్య మొదలవుతుంది? ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లో టొబాకో సంస్థ నడుపుతున్న ఆంటోనీ దాస్(సంజయ్ దత్) కుటుంబానికి పార్తిబన్ కి సంబంధం ఏంటి? అసలు లియో ఎవ్వరు? పార్తిబన్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? ఇంతకీ లియో కి పార్తిబన్ కి సంబంధం ఏంటి అనేది మిగతా కథ?.
చిత్రం యొక్క ప్లసులు వివరణ:
సినిమాలో లియో గా నటించిన విజయ్ ఒక రాక్షసత్వ పాత్ర, దయ జాలి లేని క్రూరుడు గా ఉండే పాత్ర. అలాగే, పార్తిబన్ ఎవ్వరికీ ఏమి హాని చెయ్యని ఒక కుటుంబ విలువలు కలిగిన వ్యక్తి. రెండు పాత్రలో విజయ్ అద్భుతంగా జీవించి నటించారు. త్రిష తల్లి పాత్రలో చూడటం ఇదే మొదటిసారి. అలాగే, తన నటన నైపుణ్యం తో తెర మీద సెట్టిల్డ్ గా ఆకట్టుకున్నారు. జార్జ్ మర్యన్(నెపోలిన్ – ఖైదీ చిత్రం ఆధారం) పాత్ర థియేటర్స్ లో మోత మోగించింది. హైనా జంతువుని కాపాడే సన్నివేశం థియేటర్ లో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంటుంది. సగటు ప్రేక్షకుడికి నిజంగానే జంతువుతో పోరాటం చేస్తున్నట్టు అనిపించేలా చాలా జాగ్రత్త పడ్డారు.
సినిమాలో ప్రతి ఫైట్ సీక్వెన్స్ హోరా హోరి గా బాగా తీర్చిదిద్దారు. అనిరుద్ మళ్ళీ తన సంగీతంతో, బ్యాగ్రౌండ్ తో ఈ సినిమా కి ప్రాణం పోశారు. మడోన్నా సెబాస్టీయన్ పాత్ర చిన్నదే అయ్యినప్పటికీ ఎమోషనల్ గా బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి, కావాల్సిన LCU కనెక్షన్ అందరికీ గూస్ బంప్స్ తెప్పించింది. చివరిలో వచ్చే ట్విస్ట్ దగ్గర అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ ఫాన్స్ కి పూనకాలే. సంజయ్ దత్, అర్జున్ సర్జ గారి స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. పార్తిబన్ తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం వేసిన వలయం కొత్త రకంగా అనిపిస్తుంది. సినిమాలో వచ్చే కొన్ని విజ్యువల్స్, మేకింగ్ స్టైల్ చాలా కొత్తగా కనపడుతుంది. ఈ చిత్రానికి దర్శకుడు అనుకున్న మొదటి భాగం చాలా బాగా తీశారు. దర్శకత్వ ప్రతిభ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు.
చిత్రం యొక్క మైనస్ లు వివరణ:
సంజయ్ దత్, అర్జున్ సర్జ పాత్రలని స్క్రీన్ మీద బయ్యంకరంగా చూపించే ప్రయత్నం చేసిన సరైన విధానంలో ఉపయోగించుకోలేకపొయ్యాడు దర్శకుడు. చిన్న పాత్ర కోసం ప్రియా ఆనంద్, అనురాగ్ కశ్యప్ ని ఎందుకు తీసుకున్నారో అర్ధం కానీ పరిస్థితి? మొదటి భాగం మంచిగా ఉన్న, రెండొవ భాగం కొంచం నెమ్మదిగా వెళ్లడం, బలమైన ఫ్లాష్ బ్యాక్ కథ లేకపోవడం కాస్త మైనస్ అని చెప్పాలి.
ఈ చిత్రానికి మొదటినుంచి ఉన్న పెద్ద మైనస్ పాయింట్, తెలుగు పాటలు. అస్సలు ఆకట్టుకోలేదు. గూగుల్ అనువదించినట్టు ఉన్నాయి పాటలు.
ఏదైమనప్పటికీ “లోకేష్ కానగరాజ్” లియో ని చాలా అద్భుతంగా తెరకెక్కించారనే చెప్పాలి.
రేటింగ్: 3.25/5
బాటమ్ లైన్: LCU ఫాన్స్ కి మాత్రమే నచ్చే ఒక మంచి యాక్షన్ డ్రామా.
రివ్యూ బై: సాయిరాం తాడేపల్లి.