ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత అజయ్ భూపతి డైరెక్షన్ లో, హీరోయిన్ పాయల్ రాజపుత్ కాంబినేషన్ లో క్రేజి గా వస్తున్న చిత్రం “మంగళవారం”. ఈ మధ్య కాలంలో వచ్చిన ట్రైలర్స్ లో “మంగళవారం” మూవీ ట్రైలర్ టాప్ అని చెప్పచ్చు. ఈ చిత్ర దర్శకుడు పోస్టర్స్, ట్రైలర్ ద్వారా “కథ” చెప్తున్నట్టు అనిపిస్తుంది కానీ, కథ ని ఎక్కడ రివీల్ చేయకుండా డీల్ చేసిన విధానం బాగుంది!! దర్శకుడు ట్రైలర్ లో కథ చెప్పకపోయినా, ట్రైలర్ ద్వారా మాకు అర్ధమైన కథ ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం!!
1980 – 90 ఒక పల్లెటూరిలో ప్రతి మంగళవారం జరిగే వరుస మరణాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ కథ. కథానుసారం, శైలు అనే ఒక అమ్మాయి చుట్టూ సైకలాజికల్ క్రైమ్ హార్రర్ చిత్రంగా తెరకెక్కించారు. ఒక ఊరిలో జరిగే కథ, ఊరి ప్రజల మధ్య ఉండే అపోహలు, అపనమ్మకాలు ట్రైలర్లో బాగా చూపించే ప్రయత్నం చేసారు దర్శకుడు. ట్రైలర్ లో చూపించిన ప్రతీ షాట్ లో ఒక కొత్త సస్పెన్స్ ని దాచి ఉంచారు. ప్రతీ పాత్ర చిత్రీకరణా, మంగళవారం రోజుతో జరిగే హత్యలని ముడిపెట్టడం, ఆ మంగళవారం ఒక శైలు అనే అమ్మాయికి ఇష్టమైన రోజు అని చెప్పటం, కథలో ముఖ్యమైన అంశంలాగా నడిచాయి.
అజయ్ భూపతి తీసిన మొదటి చిత్రం R X 100 లాగానే, ఈ చిత్రంలో కూడా రొమాన్స్ చాలా ఘాటుగా చూపించారు. పాయల్ నటించిన రొమాంటిక్ సీన్స్ థియేటర్ లో దద్దరిల్లేలా ఉన్నాయి. పాయల్ రొమాన్స్ తో పాటు నటన కూడా ట్రైలర్ లో అద్భుతంగా కనబర్చింది. సుపరిచిత తమిళ నటుడు అజ్మల్ అమీర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్ నందితా శ్వేతా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనువిందు చేయనున్నారు.
సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రాత్రి పూట, పొలాల మధ్యలోంచి వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్. ట్రైలర్ లో చూపించిన చివరి షాట్ కి అందరికి ఆశ్చర్యాన్ని గురిచేస్తుందని చెప్పొచ్చు. ప్రతీ షాట్ లో తెలియని ఒక భయానక అనుభూతిని ఇచ్చారు దర్శకుడు. తర్వాత ఏమవుతుంది అనే ఆత్రుతని కలిగించారు.
ట్రైలర్ చూస్తుంటే చాలా అంశాలు హత్యల చుట్టూ, వాటిని కనిపెట్టే క్రమంలో జరుగుతున్న ఇంకా పెద్ద క్రైమ్ చుట్టూ తిరుగుతున్నట్టు ఉన్నాయి. ఈ మధ్య పల్లెటూరి క్రైమ్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. చాలా వరుకు అందరి మెప్పు పొందుతున్నాయి. అలాంటి తరహా కథని ఎంచుకుని, ఈ చిత్రాన్ని చేస్తున్నారు దర్శకులు.
అయన తీసిన మహాసముద్రం అనే చిత్రం నిరాశ పరచటంతో, ఈ సారి ఎంతో కసి తో ఒక వైవిధ్యమైన కథాశంతో థియేటర్లోకి వస్తున్నారు దర్శకుడు. హార్రర్ సన్నివేశాలు, పాయల్ ఘాటు సీన్స్, క్రైమ్ సన్నివేశాలు , మ్యూజిక్ ఈ ట్రైలర్ లో ముఖ్యాంశాలుగా సినిమా సక్సెస్ పరిగణంలోకి తీసుకోవచ్చు.