- Advertisement -spot_img
HomeUncategorizedవిడుదలకి సిద్దమైన విక్రమ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్పై యాక్షన్ చిత్రం. నవంబర్ 24న ప్రపంచ...

విడుదలకి సిద్దమైన విక్రమ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్పై యాక్షన్ చిత్రం. నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల…

- Advertisement -spot_img

స్పై మరియు పోలీస్ చిత్రాలకి పెట్టింది పేరు గౌతమ్ వాసుదేవ్ మీనన్ చిత్రాలు. ఆయనకి పోలీస్ వ్యవస్థమీద ఉన్న మక్కువని చూపెడతారు ప్రతి చిత్రంలో. అలాంటి కథాంశతోనే 10 సంవత్సరాల క్రితం చిత్రీకరించిన చిత్రం “ధ్రువ నట్చత్తిరమ్ – మొదటి భాగం యుద్ధ కాండం”. విక్రమ్ లాంటి స్టార్ హీరో తో, ఏంటో పెద్ద తారాగణంతో విడుదవ్వాల్సిన ఈ చిత్రం ఇన్ని సంవత్సరాలు వివిధ కారణాలవలన ప్రేక్షకుల ముందుకు రాలేదు.

మొత్తానికి ఈ చిత్రం నవంబర్ 24 న విడుదలకి రంగం సిద్ధం చేసుకున్నది. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదల అయ్యింది. ఇప్పటికే విడుదల అయిన మూడు టీజర్లకి మంచి ఆదరణ వచ్చింది. ఇప్పుడు విడుదల అయిన ట్రైలర్ కూడా అందరినీ మెప్పించింది అనే చెప్పొచ్చు. దర్శకులు ట్రైలర్ లో కథకి సంబందించిన ముఖ్యమైన అంశాలని వ్యక్తపరిచినట్టే కనిపిస్తోంది. ట్రైలర్ పరంగా మాకు అర్థమైన కథని మీముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం.

ఇండియాలో ముంబై తాజ్ ఎటాక్ జరిగిన చాలా సంవత్సరాల తరువాత ఇండియా కి కోవర్ట్ ఆపరేషన్స్ చెయ్యాల్సిన అవసరం ఉంది అని , దానికి సంబందించిన ఒక సీక్రెట్ స్పై టీం ని ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. దాని పేరు “బేస్మెంట్”. వేళ్ళకి ఎలాంటి రూల్స్ ఉండవు. ఎవ్వరి అనుమతి తీసుకోవక్కర్లేదు. ఎక్కడికైనా ఎలాంటి చోటికైనా ఎప్పుడైనా వెళ్లే సత్తా ఉన్నవాళ్లు ఈ టీం. ఈ టీం లో మొత్తం 10 మంది ఉంటారు. దానికి నాయకుడే జాన్ (విక్రమ్ ). అతనే 11 వ వ్యక్తి ఈ టీం కి. ఈ టీం కి సంబందించిన ముఖ్యమైన వ్యక్తిని విలన్ వినాయకన్ కిడ్నప్ చేస్తారు.

ఈ టీం చెయ్యబోయే ఆపరేషన్స్ గురించి తెలుసుకుని వాళ్ళని చంపటానికి ప్రయత్నిస్తారు. ఈ యుద్ధంలో జాన్ ఇంకా తన టీం ఎలా ప్రతినాయకుడిని ఎదురుకుని తమని తాము కాపాడుకుని , ఇండియా ని కూడా ఎలా కాపాడారు అనేది ముఖ్యమైన అంశం. ఈ చిత్రంలో రితూ వర్మ నాయికగా చేస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధికా, మాయ, దివ్య దర్శిని, వంశీ కృష్ణ, సతీష్ తదితరులు ముఖ్య తారాగణం. సుపరిచిత నటుడు పార్తీబన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ట్రైలర్ పరంగా “బేస్మెంట్” అనబడే ఈ టీం కి పార్తీబన్ గరే అధ్యక్షత వహిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ చిత్రానికి హర్రీస్ జైరాజ్ గారు సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ మారుతూ వచ్చారు. 6 మంది సినిమాటోగ్రఫీ చేసారు. వారిలో మనోజ్ పరమహంస గారు ముఖ్యలు. గౌతమ్ మీనన్ ఇదివరకు చిత్రాలవలెనే, సినిమాటోగ్రఫీ కథకి తగ్గట్టుగా, లొకేషన్ కి తగ్గట్టుగా తీశారు. ఒక కథని ఎంత అందంగా చెప్పాలో, అంతే అందంగా ఎలా తియ్యాలో గౌతమ్ మీనన్ గారి ద్వారా నేర్చుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్ చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ కట్ కి రిలేటెడ్ గా హర్రీస్ జైరాజ్ గారు ఇచ్చిన మ్యూజిక్ అద్భుతం. ట్రైలర్లో చూపించినట్టుగా ఈ చిత్రం సన్నివేశాలు చాలా ప్రాంతాలలో వివిధ దేశాలలో తీశారు. పోరాట సన్నివేశాలు కూడా కథ పరంగా ఒక ప్రాతిపథకంతో కొనసాగుతూ ఉంటాయి.

ట్రైలర్ పరంగా కథ మొత్తం ఒక స్పై కోవర్ట్ ఆపరేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ “బేస్మెంట్” అనే టీం భవిష్యత్తుని ఉద్దేశించి పెట్టినదా, లేకపోతే కనిపించకుండా పోయిన గవర్నమెంట్ సంబందించిన అధికారిని కనిపెట్టే ప్రయత్నమా అనేది సినిమా చూసాకే తెలియాలి. ట్రైలర్ చివర్లో విక్రంగారు ఫ్లైట్ దిగినప్పుడు వచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఈ చిత్రానికి కథ పరంగా యుద్ధకాండ అని పేరు పెట్టారు. ఇది కచ్చితంగా మన పురాణాలలో లోని ముఖ్యమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాసుకునట్టు అనిపిస్తోంది. పాత్రలు కూడా అలానే ఉండబోతున్నట్టు అనిపిస్తోంది. మొత్తానికి ఈ చిత్రం 10 సంవత్సరాల తరువాత ఈ సంవత్సరం నవంబర్ 24 వ తేదీన విడుదలకి నోచుకుంది. నిర్మాణ సంస్థ తో ఉన్న విబేధాలవలన ఈ చిత్రం విడుదల ఇదివరకు చాలా సార్లు ఆగిపోయింది.

కానీ ఈ సారి గౌతమ్ మీనన్ గారే చిత్రాన్ని కొనేసుకుని సొంతంగా విడుదల చేస్తున్నారు. ఓండ్రగా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు విడుదలలో , నిర్మాణంలో సహకరించారు. అన్ని అడ్డంకులు దాటుకుని విడుదల అవ్వబోతున్న “ధ్రువ నట్చత్తిరమ్” మంచి విజయం అవ్వాలని కోరుకుందాం. యుద్ధ కాండం మొదటి భాగం మాత్రమే. రెండొవ భాగం కూడా ఉంది. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ టెస్ట్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U / A సర్టిఫికెట్ ఇచ్చారు. మొత్తానికి ఇన్ని సంవత్సరాల నిరీక్షణకు తెర దించినట్టే అనుకోవచ్చు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page