కార్తీ నుంచి ఒక చిత్రం వస్తుంది అంటే, వైవిధ్యమైన పాత్ర, కథనం ఆశిస్తాం. మన అంచనాలను వొమ్ము చెయ్యరు అని మళ్ళీ జపాన్ మూవీ తో నిరూపించారు హీరో కార్తీ. ఆయన తాజా చిత్రం “జపాన్”. టైటిల్ విన్నప్పటి నుంచీ సినిమా ఎలా ఉండబోతోంది అని ఆత్రుత అందరిలో ఉంది. ఈ రోజు జపాన్ ట్రైలర్ విడుదల అయ్యింది. మునుపెన్నడూ చూడని అవతారంలో కార్తీ ఈ చిత్రంలో కనిపించారు.
ఆయన సరసన మలయాళం అందాల భామ అను ఇమ్మానుయేల్ నటిస్తున్నారు, విలక్షణ నటుడు సునీల్ వర్మ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి రాజుమురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు, జి వి ప్రకాష్ సంగీతం అందించగా, ‘డ్రీం వారియర్ పిక్చర్స్’ బ్యానర్ పై ఎస్. ఆర్. ప్రకాష్ బాబు, ఎస్. ఆర్. ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దక్షిణాది సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న “జపాన్” చిత్రం యొక్క ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రైలర్ మొదటి నుంచి చివరిదాకా యాక్షన్ సీన్స్ తో పాటు హీరో కార్తీ కథ చెబుతూ ఉంటారు. ట్రైలర్ లో జపాన్ ఎంతటి ప్రతిభావంతుడైన దొంగ అనేది ఇందులో చూపిస్తారు. ఒక మినిస్టర్ దగ్గర నుంచి కొట్టేసిన 200 కోట్ల డబ్బు, అక్కడ జరిగిన ఒక హత్య జపాన్ చేసారు అని నిర్ధారించి పోలీసులు తనకోసం గాలిస్తారు. ఆ వెతికే పోలీస్ టీం ఇంచార్జి సునీల్ వర్మ, జపాన్ ని పట్టుకోడానికి వేసిన ప్రతీ ఎత్తుని ఛేదించి తప్పించుకుంటూనే ఉంటాడు హీరో కార్తీ. పోలీస్ రికార్డ్స్ ప్రకారం జపాన్ ఒక పెద్ద దొంగ, హంతకుడు. పలు రాష్ట్రాల పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించినా ప్రతిసారి జపాన్ ఒక విద్వాంసం సృష్టించి తప్పించుకుంటూనే ఉంటాడు.
ట్రైలర్ లో జపాన్ తన ప్రియురాలికి తన గురించి హాస్య పద్దతిలో చెప్పే పద్ధతి బాగుంటుంది, కానీ ఆ సన్నివేశం తనని పోలీసులు తరుముతున్నప్పుడు ట్రైలర్ లో చూసాక నవ్వు ఆగదు. అసలు ఎవరు ఈ జపాన్? తాను నిజంగా అంత డబ్బు కాజేసి హత్య చేశాడా? ఇలాంటి ప్రశ్నలకి జవాబు చిత్రం విడుదల అయ్యాక తెలుసుకోవాల్సిందే?
నటన పరంగా కార్తీ తనలోని కొత్త కోణాన్ని చూపించారు. తన మేకప్, ముందు నాలుగు బంగారపు పళ్ళు , విచిత్రమైన వేషధారణ, కార్తీ ఇదివరకు చిత్రాలకంటే ఈ చిత్రంలో ఆయన వాయిస్ విచిత్రంగా ఉంది. ఒక రకమైన వ్యగ్యం ఉంది ఆ వాయిస్ లో. ఇలాంటి చేంజ్ కార్తీ లో ఇప్పటిదాకా ఆయన ఫాన్స్ చూడలేదు. ఇలాంటి పాత్రని ఆయన ఫాన్స్ ఎలా ఆదరిస్తారో ఈ చిత్రం విడుదల అయ్యాక చూడాలి.