“పొలిమేర-2” చేతబడుల దర్శకుడు అంటారేమో:- డాక్టర్ అనిల్ విశ్వనాధ్
మొదటి భాగం “మాఊరి పొలిమేర’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ డా.అనిల్ విశ్వనాథ్. తాజాగా ఈ చిత్రానికి సిక్వెల్ గా ‘మా ఊరి పొలిమేర-2’ థియేటర్ లో హల్ చల్ చేయనుంది. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరికృష్ణ నిర్మాత. నవంబరు 3న ఈ చిత్రం గ్రాండియర్ గా పెద్ద సంఖల్లో విడుదల చేయనున్నారు. ఈ సోమవారం చిత్ర దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ పాత్రికేయులతో ముచ్చటించారు.
అతి తక్కువ బడ్జెట్లో మా ఊరి పొలిమేర (మొదటి భాగం) తీసి ప్రేక్షకులకి ఓటిటి ద్వారా బిగ్ సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు. సాధారణంగా భారీ చిత్రాలకు మాత్రమే సీక్వెల్ చేస్తుంటారు. ఇలాంటి చిన్న చిత్రానికి సీక్వెల్ చేయడం ప్రశంసనీయం. కథలో వున్న సీరియస్ నెస్, ఇంకా చెప్పాలనుకున్న కథ మిగిలిపోవడంతో పార్ట్ 2 తెరకెక్కిందట. పార్ట్ 2 మొదటి భాగానికి కొనసాగింపు అని దర్శకుడు చెప్తున్నాడు.
సినిమా ట్రైలర్ రీలిజ్ అయ్యిన తరువాత చాలా మంది ప్రేక్షకులు కార్తికేయ చిత్రంతో పోలుస్తున్నారు. అసలు విషయం ఏంటి అంటే, కార్తికేయ చిత్రానికి – పొలిమేర చిత్రానికి ఎటువంటి సంబంధం లేదని “గుడి” అనే కామన్ పాయింట్ తప్ప మరొకటి లేదని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. మొదటి పార్ట్ లో ఊహించని విధంగా ట్విస్ట్ లు ఉన్నాయో, అదే విధంగా పార్ట్2 లో పతాక స్థాయిలో సన్నివేశాలు థ్రిలింగ్ గా ఉంటాయట.
ఈ చిత్రంలో ప్రేక్షకులు ఊహించలేని ఎనిమిది ట్విస్ట్ లతో పాటు, పొలిమేర 3 కూడా వుంటుందని ప్రకటించడం డైరెక్టర్ గట్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే, ప్రతి ప్రేక్షకుడు మొదటి పార్ట్ కన్నా రెండొవ భాగం మెరుగ్గా ఉండాలనుకుంటారు. అలాగే, ఇలాంటి కథలకి కొనసాగింపు గా సినిమాలు క్రియేట్ చేయాలంటే డైరెక్టర్ కి ఛాలెంజింగ్ అనే చెప్పాలి.
ఈ చిత్రానికి సత్యం రాజేష్ ఓన్ చేసుకుని యాక్ట్ చేయడం, ప్రచారాల్లో చురుగ్గా పాల్గోవడం. దర్శక, నిర్మాతల పట్ల ఎంతో గౌరవంగా ఉండటం డైరెక్టర్ కి మనో బలాన్ని ఇచ్చిందట. ఈ సినిమాని నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఖర్చు పెట్టడం. వంశీ నందిపాటి సహకారంతో చాలా గ్రాండ్ గా విడుదల చేయటం, ప్రొడ్యూజర్ బన్నీవాస్ చూసి సినిమా ని పెద్ద రేంజ్ కి తీసుకెళ్లటం ఇవ్వన్నీ శుభసూచకం అనే చెప్పాలి.
ఈ చిత్ర కథానాయిక కామాక్షి దర్శకత్వ శాఖలో ఆసక్తి వుండటంతో డైరెక్టర్ యాక్సెప్ట్ చేసినప్పటికీ, మొదట్లో పెద్దగా నమ్మలేదట. తరువాత ఆమె ప్రతిభ చూసి నమ్మకం పెరిగిందంటూ, ఆమె తప్పకుండా తెలుగులో మంచి దర్శకురాలు అవ్వుతుందని కితాబు ఇచ్చాడు దర్శకుడు. అలాగే, ఈ చిత్రం తరువాత పార్ట్3 తీద్దామని అనుకున్నాడట, కాకపోతే అందరూ చేతబడుల దర్శకుడు అంటారేమో (నవ్వుతూ) ముగించాడు.