చిత్రం: 12th Fail
రేటింగ్: 4/5
రిలీజ్ డేట్: నవంబర్ 3, 2023
తారాగణం: విక్రాంత్ మసి, మేధా శంకర్, అన్షుమాన్ పుష్కర్, అనంత్ వి జోషి, హరీష్ ఖన్నా, ప్రియాంషు ఛటర్జీ తదితరులు…
ఎడిటర్: జసుకున్వర్ కోహ్లీ, విధు వినోద్ చోప్రా
మ్యూజిక్ డైరెక్టర్: శంతను మొయిత్రా
సినిమాటోగ్రాఫర్: రంగరాజన్ రమాభద్రాన్
ప్రొడ్యూజర్స్: విధు వినోద్ చోప్రా, యోగేష్ ఈశ్వర్
డైరెక్టర్: విధు వినోద్ చోప్రా
మీర్జాపుర్ ఫెమ్ విక్రాంత్ మసి హీరో గా, మేధా శంకర్ హీరోయిన్ గా నటించిన చిత్రం “12th Fail”. అన్షుమాన్ పుష్కర్, అనంత్ వి జోషి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘విధు వినోద్ చోప్రా’ దర్శకత్వం వహించారు. ట్రూ ఇన్సిడెంట్స్ కథ ఆధారంగా బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం హిందీ లో బ్లాక్ బాస్టర్ టాక్ అందుకోగా, తెలుగు ప్రేక్షకులని అలరించడానికి, ఈ శుక్రవారం థియేటర్ లో రీలిజ్ అయ్యిన ఈ చిత్రం కథ ఏంటో తెలుసుకుందాం…!!
కథ: ఒక గ్రామంలోని నిజాయితీ కుటుంబంలో పుట్టి పెరిగిన అమాయకపు వ్యక్తి ‘మనోజ్ కుమార్ శర్మ’ (విక్రాంత్ మసి). ఒక రోజు ’12th క్లాస్’ ఎక్జామ్ హాల్ లో చీటింగ్ జరుగుతుండగా, అప్పుడే వచ్చిన ‘దుశ్యంత్ సింగ్’ డిసిపి ఆఫీసర్(ప్రియాంషు ఛటర్జీ) ‘ఎక్జామ్స్ ని’ డిస్మిస్ చేస్తాడు. అలా, చీటింగ్ చేసి ఎక్జామ్ రాయడం తప్పు అని తెలుసుకొని అతనిలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు.
అలా 12th క్లాస్ తో పాటు ‘బిఎ’ ఎక్జామ్స్ రాసి పాసై, తన నానమ్మ, అమ్మ సపోర్ట్ తో ‘డిసిపి’ ఆఫీసర్ గా తిరిగి వస్తా అంటూ గ్వాలియర్ కి వెళ్తాడు. అలా, వెళ్లిన వ్యక్తి దారిలో సూట్ కేస్ పోగుట్టుకొని, తిరిగి ఇంటికి వెళ్లకుండా ఢిల్లీ కి వెళ్తాడు. అసలు గ్వాలియర్ కి వెళ్ళాలిసిన వ్యక్తి ఎందుకు ఢిల్లీ వెళ్ళాడు? తను అనుకున్నది సాదించాడా? డిసిపి చేద్దామనుకున్న వ్యక్తి ఐపీఎస్ వైపు ఎందుకు మళ్లింది? తను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించే పనిలో ఎలాంటి ఓడి దుడుకులు ఎదురుకున్నాడు? అనేది కథ….
నటీనటులు పెర్ఫామెన్స్: విక్రాంత్ మసి(మనోజ్ కుమార్) పాత్రలో ఓదిగి పోయి, సగటు ప్రేక్షకుడిని తన పెర్ఫామెన్స్ తో ఏడిపించేసాడు. ముఖ్యంగా, కొన్ని సన్నివేశాలలో తన కళ్ళతో, బాడీ ల్యాంగ్వేజ్ తో పలికించిన హావభావాలను ప్రశంసనీయం. తన పెర్ఫామెన్స్ కి నేషనల్ అవార్డు వచ్చిన ఆశ్చర్య పోనక్కర్లేదు. మేధా శంకర్(శ్రద్ధా జోషి) స్టూడెంట్ గా, తెలివైన అమ్మాయిగా ఉంటూ హీరో ని మోటివేట్ చేసిన తీరు అద్భుతం. సినిమా చూసాక, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుందనిపిస్తుంది. అనంత్ వి జోషి(ప్రీతమ్ పాండే)గా హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేసి, సినిమాకి అత్యంత కి రోల్ పోషించి తన యాక్టింగ్ తో సినిమాని నెస్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. అన్షుమాన్ పుష్కర్, హరీష్ ఖన్నా, ప్రియాంషు ఛటర్జీ తమ పరిధి మేరకు బాగా రాణించారు.
సాంకేతిక విభాగం: డైరెక్టర్ విధు వినోద్ చోప్రా చాలా క్షుణ్ణంగా కథని పరిశీలించి, బలమైన సన్నివేశాలని చిత్రీకరించి సగటు ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేసిన తీరు ప్రశంసనీయం. జసుకున్వర్ కోహ్లీ, విధు వినోద్ చోప్రా ఎడిటింగ్ తీరు సూపర్బ్. శంతను మొయిత్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్. రంగరాజన్ రమాభద్రాన్ సినిమాటోగ్రాఫి ఎంతో న్యాచురల్ గా తీర్చిదిద్దారు. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఏ మాత్రం తగ్గకుండా కథకి తగ్గట్టు గా గ్రాండియర్ గా కనిపిస్తుంది.
బాటమ్ లైన్: కలకాలం మదిలో మెదిలో సినిమా “12th Fail”
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్