- Advertisement -spot_img
HomeUncategorizedThe Trial Movie Review: 'ది ట్రయిల్' మూవీ రివ్యూ

The Trial Movie Review: ‘ది ట్రయిల్’ మూవీ రివ్యూ

- Advertisement -spot_img

చిత్రం: ది ట్రయిల్
రేటింగ్: 2.75/5
బాటమ్ లైన్: సక్సెస్ ఫుల్ ‘ది ట్రయిల్’ వర్షన్
నటి నటులు: స్పందన పల్లి, యుగ్ రామ్, వంశి కోటు తదితరులు…
పోస్టర్ డిజైనర్: యమ్.కే.యస్. మనోజ్
ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్
సినిమాటోగ్రఫీ: సాయి కుమార్ ధారా
మ్యూజిక్ డైరెక్టర్: సర్వనా వాసుదేవన్
ప్రొడ్యూజర్: స్మ్రితి సాగి, శ్రీనివాస్ కే నాయుడు
కథ, దర్శకత్వం: రామ్ గన్ని

ప్లే బ్యాక్, 3సిస్ చిత్రాలతో ఆకట్టుకున్న తెలుగు అమ్మాయి ‘స్పందన పల్లి’. ఫస్ట్ ఇంటరాగేటివ్ ‘ది ట్రయల్’ సినిమాలో లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ఈ చిత్రానికి ‘రామ్ గన్ని’ నూతన దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో, యుగ్ రామ్, వంశీ కోటు లీడ్ రోల్స్ పోషించారు. ఎస్ఎస్ ఫిలింస్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై స్మృతి సాగి, శ్రీనివాస కే నాయుడు నిర్మించారు. ఈ చిత్రం, ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా, మీడియాకోసం ప్రీమియర్ షోను నిర్వహించారు. ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో మన ‘రివ్యూ’ లో తెలుసుకుందాం!

కథ:
అజయ్(యుగ్ రామ్) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. రూప(స్పందన పల్లి) ఎస్.ఐ. ఇద్దరు కలిసి, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. ‘ఫస్ట్ యానివర్శరీ’ సెలబ్రేషన్స్ ఓ భవంతి టెర్రాస్ పై గ్రాండ్ గా చేసుకుంటుండగా, అజయ్ భవనంపై నుంచి కింద పడి చనిపోతారు. దాంతో, అజయ్ భార్య ‘రూప’ను ఇంట్రాగేషన్ చేయడం మొదలు అవ్వుతుంది? అజయ్ ఎలా చనిపోయాడు? ఇన్వెస్టిగేషన్ రూపంలో ప్రస్తావించిన డైరీ లో ఏముంది? డైరీ…రూప(స్పందన పల్లి)కి కీలకంగా మారిందా? రూప, అజయ్ ల మధ్య సంబంధం చెడిందా? తదితర విషయాలు తెలియాలంటే ‘ది ట్రయల్’ సినిమాని చూడాల్సిందే.

కధనం, విశ్లేషణ:
తెలుగు నాట ‘క్రైం సస్పెన్స్’ చిత్రాలకు మంచి గిరాకీ ఉంది. సరైన కథ, కథనాలతో గ్రిప్పింగ్ గా తెరమీద చూపించగలిగితే, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయం. రియల్ లైఫ్ లో ‘డైరెక్టర్’ జైల్ లో పని చేసిన అనుభవం ఉంది. కాబట్టి…రియల్ ఇన్సిడెంట్స్ ని గానీ…ఫిక్షనల్ గా గానీ…ఇంట్రెస్టింగ్ గా వెండితెరపై ఆవిష్కారించాడా? లేదా? అనేది తెరపై చుడాలిసిందే!!

ఫస్ట్ హాఫ్ లో డైరీ ఆధారంగా, సైకియాట్రిస్ట్ మరియు అజయ్ కుటుంబ సభ్యులు ఇచ్చే ఆధారాలను వంశి కోట/రాజీవ్ బేస్ చేసుకుని హీరోయిన్ స్పందన పల్లి/రూప మీద విచారణ కొనసాగిస్తాడు. ఫస్ట్ హాఫ్ గ్రిప్పింగ్ గా ఉండటంతో, సెకండ్ హాఫ్ మీద ఇంటరెస్ట్ కలుగుతుంది. సెకెండాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ట్విస్టులు సినిమాపై అంచనాలు పెరుగుతాయి. అయ్యితే, సినిమా మొత్తం లో మూడు క్యారెక్టర్స్ కావడంతో పబ్లిక్ ఆడియెన్స్ విలన్ ఎవ్వరు అని గెస్ చేసినప్పటికీ డైరెక్టర్ స్క్రీన్ ప్లే ఆడిన విధానం మైండ్ బ్లోయింగ్. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది.

భార్య భర్తల మధ్య ఉన్న చిన్న మనస్పర్దకి…దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే, అజయ్ మరణించిన విషయం చివరిదాకా రివీల్ చేయకపోవటం ఆడియన్స్ లో క్యూరియాసిటీ వస్తుంది. పైగా, సినిమా నిడివి 100 నిమిషాలు కావడంతో ప్రేక్షకుడు తప్పకుండ చూడచ్చు.

నటి నటులు పెర్ఫామెన్స్: ‘స్పందన పల్లి’ అందం, అభినయం మంచి నటన నైపుణ్యంతో పోలీసు అధికారిగా ‘యస్.ఐ’ క్యారెక్టర్ లో చక్కగా ఓదిగిపోయింది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో ఎంతో న్యాచురల్ గా ఎమోషన్స్ పండిస్తూనే హావభావాలతో తన వైపు తిప్పుకుంది. కంప్లీట్ సినిమా తన భుజాలపై వేసుకొని టాప్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఈ అమ్మాయికి ఫ్యూచర్ లో మంచి భవిషత్తు ఉంది. ‘యుగ్రమ్’ అమాయకమైన సాప్ట్ వేర్ ఇంజినీర్ హస్బెండ్ క్యారక్టర్ లో ఒక ‘కి’ రోల్ పోషిస్తునే అన్ని రకాల ఎమోషన్స్ ని సగటు ప్రేక్షకుడు వావ్ అనేలా రక్తి కట్టించాడు. ‘వంశి కోటు’ కొత్త వాడే అయ్యిన బిగ్ స్క్రీన్ లో హుందా గా కనిపిస్తూనే ‘పోలీస్’ క్యారెక్టర్ లో యాక్టింగ్ బాగా రాణించాడు.

సాంకేతిక విభాగం: దర్శకుడు ‘రామ్ గన్ని’ ఎంచుకున్న కథ పాతదే అయ్యినప్పటికీ ‘స్క్రీన్ ప్లే’ మలిచిన విధానం సూపర్బ్. ఎక్కడ తడబడకుండా ఫస్ట్ మూవీ తో పర్ఫెక్ట్ గా లాంచ్ చేసారు. శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ తీరు పర్ఫెక్ట్ గా ఉంది. సాయి కుమార్ ధారా అందించిన సినిమాటోగ్రఫీ ఫినామినల్. మ్యూజిక్ డైరెక్టర్ సర్వనా వాసుదేవన్ ఇచ్చిన బిజియమ్ సినిమాకి అసెట్. నిర్మాతలు ఎక్కడా రాజీపకుండా ఖర్చు పెట్టారు.

రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్

గమనిక: మేము రాసే రివ్యూస్ ఒక వ్యక్తి కి గాని, ఒక సంస్థ కి గాని ఉద్దేశించి రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫ్ఫర్ట్ ప్రశంసనీయం. మీరు చిత్రీకరించిన సినిమా థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page