అర్జున్ రెడ్డి సినిమా తరువారు, ఆ చిత్రం అందించిన విజయంతో, అదే చిత్రాన్ని హిందీ లో కూడా తీసి తన సత్తా నిరూపించుకున్న దర్శకులు సందీప్ రెడ్డీ వంగా. ఆయన నుంచి కొత్త చిత్రం అంటేనే ఒక కొత్త రకంగా ఉంటుంది అని సినిమా ప్రేమికులు ఎదురుచూసేలా చేసుకున్నారు ఆయన. ఇప్పుడు అదే తరహాలో ఒక విభిన్నమైన తండ్రీ కొడుకుల అనుబంధంతో హిందీ నటుడు రన్బీర్ కపూర్ నాయకుడిగా, రష్మిక మందన్నా నాయికగా, టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియోస్ సంస్థలు సామ్యుఖంగా నిర్మిస్తున్న చిత్రం “ఆనిమల్”. ఈ చిత్రానికి కథ, ఎడిటర్ ఇంకా దర్శకులు సందీప్ రెడ్డీ వంగా గారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యి అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది. ట్రైలర్ లో కథ క్లుప్తంగా అర్థం అవుతున్నాకూడా, ట్రైలర్ ద్వారా మాకు అర్థం అయిన కథని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం.
Ranbir Kapoor in animal
ఒక గొప్పింటి కొడుకు తన తండ్రి చుట్టూతా తిరుగుతూ ఉంటుంది కథ. కొడుకుకి తండ్రి అంటే ప్రాణం. తండ్రికి ఏమయినా కూడా తట్టుకోలేడు. కానీ అదే సమయంలో తన తండ్రి తన చిన్నపటినుంచి తనతో ఉండే తీరును, మిగతావాళ్ళతో ఉండే తీరును అవలంబించుకుని ఒక క్రూరమైన ప్రేమ స్వభావిగా మారాడు. ప్రేమ అందరిమీద చూపిస్తాడు, అదే సమయంలో క్రూరత్వం కూడా అంతే మోతాదులో చూపిస్తాడు. తన తండ్రికి ఉన్నంత కోపం, ఆవేశం తనలో అంతులేని విధంగా ఇమిడిపోయి ఉంటుంది. ప్రతి ఒక్క సమస్యనీ తన క్రూరమైన నిర్ణయాలతోనే సమాధానం చెబుతాడు. ఒకే సమయంలో ప్రేమ చూపిస్తాడు, క్రూరత్వం చూపిస్తాడు. తండ్రి కొడుకులుగా అనిల్ కపూర్, రన్బీర్ కపూర్ నటన అమోఘం. వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన రాక్షస ధోరణి కనిపించేలా వాళ్ళ పాత్ర తీర్చిదిద్దారు దర్శకులు. రష్మిక గారికి మంచి నటనా ప్రాముఖ్యం ఉన్న పాత్ర లభించింది.
ట్రైలర్ లో చాలా వరుకు కొడుకుకి తన తండ్రి మీద ఉన్న పిచ్చి ప్రేమని విభిన్నమైన రూపం లో చూపించే ప్రయత్నం చేసారు. భయంకరమైన రక్తతర్పణం సన్నివేశాలు కోకోల్లలుగా ఉన్నాయి. ప్రతీ ఫ్రేములో పాత్రల హావభావాలు వ్యక్తమయ్యేలా ఛాయాగ్రాహకులు అమిత్ రాయ్ తన పని తనాన్ని చూపించారు. పోరాట సన్నివేశాలు, ఆ సన్నివేశాలకు కారణమయ్యే అంశాలు అందరినీ కట్టి పడేస్తాయి అని చెప్పొచ్చు. సందీప్ రెడ్డి గారు ఇదివరకు చెప్పినట్టుగానే వయోలెన్స్ (violence ) అంటే ఏమిటో చూపిస్తున్నారు అనిపిస్తోంది. తన ఇదివరకు చిత్రం అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ (అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ) కంటే భిన్నంగా ఉండబోతోంది.
సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. ప్రతీ షాట్, ప్రతీ ఫ్రేమ్ చాలా గ్రాండ్ గా చూపించే ప్రయత్నం చేసారు. ట్రైలర్ మొదట్లో వచ్చే తండ్రీ కొడుకుల సన్నివేశం తోనే దర్శకులు ఈ చిత్రం విజయం మీద ఎన్నో ఆశలు రేకెత్తేలా చేసారు. రన్బీర్ కపూర్ తన సైన్యంతో వచ్చి పోరాడటం, తన mannerism సన్నివేశాలు అన్నీ చూడటానికి ఆకర్షణగా ఉన్నాయి. ఆయన స్క్రీన్ మీద కనపడిన విధానం అద్భుతం.ట్రైలర్ చివరిలో బాబీ డియోల్ గారికి , రన్బీర్ గారికి ఉన్న పోరాట సన్నివేశం చిత్రానికి ముఖ్య అంశం గా నిలవనుంది అనిపిస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం. పోరాట సన్నివేశాలకి ఇచ్చిన మ్యూజిక్ చాలా గొప్పగా ఉంది. ఒక కొడుకుకి తన తండ్రీ మీద ఉండే పిచ్చి ప్రేమ భయంకరంగా మారి, చివరికి ఎలాగ ఎవరికి ఆపద తెచ్చిపెట్టింది అనేది చిత్రం చూసాక తెలుసుకోవాలి.
ట్రైలర్ చూస్తుంటే చాలా అంశాలు తన తండ్రిని కాపాడే విషయంలోనే అన్నట్టు అనిపిస్తోంది. అనిల్ కపూర్ గారు ఒక గ్యాంగస్టర్ గా ఒక వ్యాపారవేత్తగా , తనకి ఉన్న శత్రువుల నుంచి తన కొడుకు కాపాడే విధంగా ఉండేలా చూపించారు దర్శకులు. ఇప్పటికే విడుదల అయిన కొన్ని పాటలకి మంచి ఆదరణ వచ్చింది. ఎడిటర్ గా కూడా సందీప్ గారే పని చేసారు. అలా చెయ్యటం వలనం ఈ చిత్రం మీద తనకి ఉన్న వ్యామోహం తెలుస్తోంది. ఈ ట్రైలర్లో ముఖ్యంగా చెప్పుకోవలసినవి పోరాట సన్నివేశాలు. అత్యంత భయంకరంగా ఉండేలా తీర్చిదిద్దారు. తనలోని ఇలాంటి కోణాన్ని దర్శకులు వందశాతం చూపించారు అని చెప్పొచ్చు. సినిమాని థియేటర్ లో చూసేటప్పుడు భయంతో కళ్ళు మూసుకుంటామేమో చూడాలి. డిసెంబర్ 1 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వబోతోంది. ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోవాలని కోరుకుందాం.