- Advertisement -spot_img
HomeUncategorizedHi Nanna Telugu Movie Review: హాయ్ నాన్న తెలుగు మూవీ రివ్యూ

Hi Nanna Telugu Movie Review: హాయ్ నాన్న తెలుగు మూవీ రివ్యూ

- Advertisement -spot_img

చిత్రం: హాయ్ నాన్న
రేటింగ్: 2.75/5
బాటమ్ లైన్: రొటీన్ రెగ్యులర్ “హాయ్ నాన్న కథ”.
నటి నటులు: నాని, మృణాల్ ఠాకూర్, ప్రియదర్శి, జయరాం, కియారా ఖన్నా, శృతి హాసన్, విరాజ్ అశ్విన్, నేహా శర్మ, రితిక నాయక్ తది తరులు….
కెమెరా: సను వర్గీస్
మ్యూజిక్ డైరెక్టర్: హేశం అబ్దుల్ వాహబ్
నిర్మాత: మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి, మూర్తి
బ్యానర్: వ్యారా ఎంటర్టైన్మెంట్స్
దర్శకుడు: శౌర్యువ్

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం “హాయ్ నాన్న”. ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ చిన్నారిగా నటించిన “కియారా ఖన్నా”. ఇప్పటికే, విడుదలైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకుల అంచనాలను అమాంతం పెంచేసాయి. అలాగే, హీరో ఎంతో శ్రద్ధ తీసుకొని ప్రమోషన్స్ చేసిన విధానం ప్రశంసనీయం. ఈ చిత్రం డిసెంబర్ 7న ప్యాన్ ఇండియా స్థాయిలో రీలిజ్ అయ్యింది. మరి, ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఏ విధంగా ఆకట్టుకోనుందో విశ్లేషుకుడి మాటల్లో తెలుసుకుందాం!!

కథ:
విరాజ్ (నాని) ఒక ఫోటోగ్రాఫర్. ఆరేళ్ల పాప ‘మహి'(కియారా ఖన్నా) డాటర్ తో కలిసి జీవితం కొనసాగిస్తాడు. మహికి తాత, నాన్నే ప్రపంచం. కాకపోతే, తనకి అమ్మ ఎలా ఉంటుంది? అమ్మకి అసలు ఏమైంది అనే విషయాలు తెలియదు? అయితే మహి ‘అమ్మ’ గురించి చెప్పమని తండ్రిని విసిగిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో యశ్న(మృణాల్ ఠాకూర్) మహికి పరిచయం అవ్వడంతో మంచి ఫ్రెండ్స్‌ అవ్వుతారు. అమ్మ గురించి చెప్పాల్సిందే అంటూ తండ్రిని ఇద్దరు కలిసి పట్టుబడడంతో, ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. మహి ఫ్లాష్ బ్యాక్ కథలో ‘అమ్మ’గా పక్కన ఉన్న ‘మృణాల్’ని ఉహించుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ ద్వారా మహి, తన తల్లి గురించి తెలుసుకున్న నిజం ఏంటి? పుట్టుకతోనే మహికి వచ్చిన ఆ వ్యాధి ఏంటి? చివరికి తన మధర్ ని కలిసిందా? అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా సినిమాని థియేటర్ లో చుడాలిసిందే!!

విశ్లేషణ:
హాయ్ నాన్న సినిమా ఒక కుటుంభ కధాంశం. అయ్యితే దర్శకుడు కుటుంభ కధాంశం ఎమోషన్స్‌ను తెర మీద
నాన్న కూతురు..
తల్లీ కూతురు..
భార్యాభర్త….ఇలా పలు రకాల ఎమోషన్స్‌ను చూపించాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న నాని, సంసారం అన్నాక గొడవలు వస్తాయని చెబుతూనే, ప్రాబ్లమ్ వచ్చింది కథ అక్కడితో ఆగిపోకుండా వాటిని ఎలా అధిగమించాలో చెప్పడానికి ట్రై చేసారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, సినిమాకి ఇదే హుక్ లైన్ అనుకోవచ్చు.

నాని, కియారా ఖన్నా ట్రాక్‌లో ఒక తండ్రి బాధ్యతతో పాటు ప్రేమని చూపించాడు. భార్య భర్తల ప్రేమ ఎలా ఉండాలి? అని హీరో హీరోయిన్ల పాత్ర ద్వారా చెబితే.. ఎలా ఉండకూడదో హీరోయిన్ తల్లిదండ్రుల పాత్ర ద్వారా చూపించారు. కాకపోతే, బలమైన రీజన్స్, సన్నివేశాలు తెరకెక్కించలేకపోయాడు దర్శకుడు. ఎన్ని కష్టాలు వచ్చినా పాజిటివ్ థింకింగ్‌తో ఉండాలని విరాజ్ పాత్రతో చెప్పించారు. ఇలాంటి సినిమా కథ ప్రేక్షకుడికి కొత్తేమీ కాదు. సినిమా ఫస్ట్ హాఫ్ బోర్ గా ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే, విజ్యువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ద్వారా హాయ్ నాన్న ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక కథలో వేగం పెరుగుతుంది. సినిమాలో మృణాల్‌ను చూసి ప్రేక్షకులు దాసోహం అవ్వాల్సిందే. నాని, మృణాల్ మధ్య కెమిస్ట్రీ లవ్ సీన్లు అన్నీ కూడా ఎమోషనల్‌గా, ఫ్రెష్‌గా అనిపిస్తాయి. విరాజ్ కి తన కూతురు ఎక్కువ రోజులు బ్రతకదు అని తెలిసిన కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇంటర్వెల్ తరువాత కథ ఎమోషనల్ పార్ట్ లోకి వెళ్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సగటు ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తుంది. దర్శకుడు కథను తెరపై బాగా చూపించినప్పటికీ, కథలో కొత్తదనం, ఊహించని మలుపులు లేకపోవటంతో ప్రేక్షకులు నిరాశ పడచ్చు. కాకపోతే, ఈ చిత్రాన్ని ప్రతి ఒక్క కుటుంభం చూడదగిన సినిమా. సో, డోంట్ మిస్ టూ వాచ్!!

నటీనటులు పెర్ఫామెన్స్:
నాని ఇలాంటి పాత్రలు అవలీలగా పండించగల నటుడు. సహజంగా నటించడంలో నాని ఈ తరంలో కొట్టిన పిండి. కొన్ని సన్నివేశాలలో నాని తన పెర్ఫామెన్స్ తో ఏడిపిస్తాడు. ఇక మృణాల్ అందంతో కట్టి పడేయటంతో పాటు, ఏడిపించటం, అలాగే ప్రేక్షకుల్ని సైతం ప్రేమలో పడేలా చేసుకుంటుంది. కియారా ఖన్నా వయసుకు మించి స్టార్స్ తో పోటా పోటీగా నటించేస్తుంది. పాపతో క్యారెక్టర్ తో ప్రతి ఒక్కరు ట్రావెల్ అవ్వుతారు. ఈ ముగ్గురు ప్రేక్షకుడి గుండెను బరువెక్కేలా చేస్తారు. ఇక ప్రియదర్శి, జయరాం, హీరోయిన్ తల్లి పాత్ర, స్పెషల్ అప్పియరెన్స్ శ్రుతి హాసన్, విరాజ్ అశ్విన్, రితిక నాయక్, నేహా శర్మ అందరూ మెప్పిస్తారు.

సాంకేతిక విభాగం:
దర్శకుడు కథని చెప్పడంలో, ఎగ్జిక్యూషన్ లో పాస్ అయ్యిన, కొత్త గా చెప్పడం లో ఫెయిల్ అయ్యాడని చెప్పచ్చు. ఎందుకంటే, ఇలాంటి కథలో ఎన్నో వచ్చాయి!! హేషమ్ అందించిన పాటలకన్నా, ఆర్ఆర్ సినిమాకు ప్రాణం పోశాయి. ముఖ్యంగా, ఇంటర్వెల్, క్లైమాక్స్ వేరే లెవెల్. కెమెరా వర్క్ సూపర్బ్. ఎడిటర్ వంద శాతం న్యాయం చేశాడు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్

గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి గాని, ఒక సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page