నిహారో కోదాటి, అశ్లేష ఠాకూర్ జంటగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘శాంతల’. ఇండో అమెరికన్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఇర్రింకి సుబ్బలక్ష్మీ సమర్పణలో డా. ఇర్రింకి సురేష్ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రియేటివ్ కమర్షియల్ సూపర్ విజన్‌లో ఈ మూవీని శేషు పెద్దిరెడ్డి తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్‌లకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 15న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్‌లో
కే ఎస్ రామారావు మాట్లాడుతూ.. ‘జైలర్, జవాన్, యానిమల్ వంటి హెవీ డోస్ ఉన్న సినిమాలను జనాలు చూస్తున్నారు. బలగం, బేబీ లాంటి చిత్రాలను కూడా చూస్తున్నారు. అలానే మా మూవీని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అందుకే మీడియాకుముందు చూపించాం. ఇలాంటి మంచి చిత్రాలను, చిన్న చిత్రాలను ప్రోత్సహించండి. మా దర్శకుడు శేషు ఏడాదిన్నర, రెండేళ్లకు పైగా కష్టపడి ఈ మూవీని చేశారు. ఈ చిత్రాన్ని చూశాను. చాలా బాగా వచ్చింది. పాన్ ఇండియాకు సరిపడా కంటెంట్ ఉంది కాబట్టి ఆ స్థాయిలో విడుదల చేస్తున్నామ’ని అన్నారు.
నిర్మాత డా. ఇర్రింకి సురేష్ మాట్లాడుతూ.. ‘మాకు అండగా నిలబడిన కే ఎస్ రామారావు గారికి థాంక్స్. ఇంత మంచి చిత్రాన్ని తీసేందుకు ఆయన మా వెంటే ఉన్నారు. ఈ సినిమా బాగా వచ్చింది. ఆడియెన్స్ మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
నిహాల్ కోదాటి మాట్లాడుతూ.. ‘మా డైరెక్టర్ శేషు ఈ కథతో రెండున్నరేళ్లుగా ప్రయాణం చేస్తూ వచ్చారు. ఎంతో కష్టపడి సినిమాను తెరకెక్కించారు. సీతారామం తరువాత విశాల్ చంద్రశేఖర్ గారు తన సంగీతం మా సినిమాకు ప్రాణం పోశారు. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. వారి గురించి మాట్లాడే అర్హత, అనుభవం నాకు లేదు. అశ్లేష బాగా నటించింది. మా సినిమాను ప్రేక్షకులు చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
అశ్లేష ఠాకూర్ మాట్లాడుతూ.. ‘ఎంతో సరదాగా సినిమా షూటింగ్‌ను చేశాం. ఎంతో ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. రామారావు సర్ మాకు ఎంతో సపోర్టివ్‌గా ఉన్నారు. నిహాల్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. మా సినిమాను చూసి ఆడియెన్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.