- Advertisement -spot_img
HomeUncategorizedDunki Movie Review: డంకీ రివ్యూ

Dunki Movie Review: డంకీ రివ్యూ

- Advertisement -spot_img

చిత్రం: డంకీ
రేటింగ్: 2.75/5
బాటమ్ లైన్: గుర్తుండిపొయ్యే సినిమా కానప్పటికీ, గుర్తుంచుకోవాలిసిన సినిమా ‘డంకీ’.
విడుదల తేదీ: 2023 డిసెంబరు 21

నటి నటులు: షారుఖ్ ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ తదితరులు….
డీఓపీ: సీకే మురళీధరన్
సంగీతం: ప్రీతమ్
ఎడిటర్: రాజ్‌కుమార్ హిరానీ
కథ: రాజ్‌కుమార్ హిరానీ, అభిజత్ జోషి, కనికా ధిల్లాన్
నిర్మాత: గౌరి ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ, జ్యోతి దేశ్‌పాండే
బ్యానర్: రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్, జియో స్టూడియోస్
దర్శకుడు: రాజ్ కుమార్ హిరానీ

బాక్స్ ఆఫీస్ వద్ద వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న బాలీవూడ్ బాద్షా షారుఖ్ ఖాన్, తాప్సి పన్ను జంటగా నటించిన చిత్రం “డంకీ”, రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో, గౌరి ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ & టీజర్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా డిసెంబరు 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. మరి, ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఏ విధంగా ఆకట్టుకోనుందో విశ్లేషుకుడి మాటల్లో తెలుసుకుందాం!!

కథ: ఆర్మీ లో ఉద్యోగస్థుడు అయ్యిన ‘మను’ (తాప్సీ పన్ను) అన్నయ్య యాక్సిడెంట్ లో చనిపోవడంతో, తన ఫ్యామిలీని పెంచి పోషించడం కోసం ‘రెజ్లింగ్’ నేర్చుకొని ‘లండన్’ కి వెళ్ళాలి అనుకుంటుంది. తనతో పాటు ముగ్గురు మిత్రులు కూడా లండన్ కి వెళ్లాలని ప్రయత్నం చేస్తుంటారు. గతంలో, ఆర్మీ కాల్పులలో హార్డీ సింగ్(షారుఖ్ ఖాన్) తన ప్రాణాలని కాపాడిన, ‘మను’ అన్నయ్య ఇంటికి వచ్చి, విషయం తెలుసుకోవడంతో రెజ్లింగ్ నేర్పించి, లండన్ విషయంలో హెల్ప్ చేస్తాడు. లీగల్ గా లండన్ వెళ్ళడానికి ప్రయత్నాలు విఫలం అవ్వడంతో, ఇల్లీగల్ గా ‘డంకీ’ రూట్ లో వెళ్లాలని నిర్ణయం తీసుకుంటారు. ఆ జర్నీ లో ఎన్నో ఓడిదుడుకలను ఎదురుక్కొని లండన్ కి చేరితే, హార్డీ ఇండియాకి తిరిగి వెళ్ళిపోతాడు. కానీ, మిగతా వాళ్ళు అక్కడే, పాతికేళ్లు జీవనం కొనసాగించి ఇండియా కి తిరిగి రావాలనుకుంటారు. కానీ, దానికి ఇండియన్ ఎంబసీ ఓప్పుకోదు? మరి ‘మను & తన టీం’ ఇండియాకి తిరిగి వచ్చారా? మనుని ఇండియా తీసుకొచ్చేందుకు హార్డీ ఎలాంటి ప్రయత్నాలు చేసాడు? ఇంగ్లండ్ సిటిజన్షిప్ వచ్చిన ఏడాదికి ఆమె ఇండియా తిరిగి రావాలని ఎందుకు అనుకుంది? అనే వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే?

కథనం, విశ్లేషణ:
గతంలో ‘రాజ్ కుమార్ హిరానీ’ చేసిన సినిమాలు ప్రేక్షకులు బ్రమ్మరథం పడుతూ వచ్చారు. కొన్ని చిత్రాలు ఎంటర్టైన్ చేసారు, మరి కొన్ని చిత్రాలు సందేశాత్మకంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ‘డంకీ’ సినిమా ఎలా ఉంటుందని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రపంచంలో అతి ముఖ్యమైన సమస్య ని తీసుకొని ‘డంకీ’ సినిమా రూపంలో ప్రేక్షకులకి చుపించాలనుకోవడం అభినందనీయం. కాకపోతే, స్టోరీ పాతదే, కానీ కొత్తగా చెప్పడానికి ట్రై చేసిన విధానం బాగుంది.

మనం రోజు టీవీలలో చూస్తుంటాం!! ఫలానా దేశపు మనుషులు అక్రమ రవాణ దారులలో బోర్డర్ దాటుకొని వెళ్ళటం, కొత్త మంది దారిలోనే కాల్చివేయబడ్డారు లేదా పట్టుబడి జైలుకు వెళ్లారు అని. ఏదైమైనప్పటికీ, ఎమోషన్స్ తో ప్రేక్షకులను టచ్ చేసే ప్రయత్నం చేశాడు రాజ్ కుమార్ హిరానీ. మెరుగైన బతుకు కావాలంటే, డబ్బు బాగా సంపాదించగలిగే దేశానికి వెళ్లాలని మన భారతీయులు ఆలోచన. ఎదగాలనే ఆలోచన మంచిదే కానీ, తప్పక కొన్ని పరిస్థితుల్లో డంకి రూట్లో వెళ్లే వాళ్ళ కష్టాలు ప్రతిబింబించేలా తెరకెక్కించారు.

మొదటి భాగం: పాత్రలని పరిచయం చేసిన విధానం, డంకీ అంటే గాడిదల రూట్ అని చెప్పటం బాగుంది.
ముఖ్యంగా, మన్ను & హార్డీ కి మధ్య సాగే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. విక్కీ కౌశల్ సిక్వెన్స్ సినిమాకి హైలైట్. లండన్ ఎంబసీ టీమ్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కామిడి బాగుంటుంది.

రెండొవ భాగం: పంజాబ్ నుండి లండన్ కి బయలుదేరిన బృందం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, ఇరాన్ మీదగా వెళ్తున్నప్పుడు సాగే ఎడ్వెంచర్ భయానకంగా ఉంటుంది. చివరికి, లండన్ వెళ్ళాక సగటు మైగ్రేన్ ఫెస్ చేసే ఇబ్బందులు ఆసక్తికరంగా ఉంటాయి. ఇంగ్లాండ్ కోర్ట్ లో షారుఖ్ తో జరిగే సన్నివేశం సగటు భారతీయుడు రోమాలు నిక్కబొడుచుకోవడంతో పాటు, ఎమోషనల్ గా సాగింది.

ఈ చిత్రం బాగున్నప్పటికీ, అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందా అంటే సందేహమే అని చెప్పాలి? ఏదైమైనప్పటికీ, రిజల్ట్స్ ఇంకొన్ని రోజులు వేచి చుడాలిసిందే?

నటీనటులు:
ప్రపంచ వ్యాప్తంగా ‘షారుఖ్ ఖాన్’ ఒక గొప్ప నటుడు అని అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా, డంకీ లో ‘హార్డీ’ గా చేసిన యాక్టింగ్ ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. ‘తాప్సీ పన్ను’ తెలుగులో అందరికి సుపరిచితురాలే, బాలీవూడ్ ఎంట్రీ ఇచ్చాక అతి తక్కువ టైమ్ లో మంచి గుర్తింపు తెచ్చుకొని, షారుఖ్ ఖాన్ కి ధీటుగా ‘మను’ క్యారెక్టర్ లో అత్యంత అద్భుతంగా నటనతో మెప్పించింది. ‘విక్కీ కౌశల్’, స్క్రీన్ స్పెస్ తక్కువ ఉన్నప్పటికీ తనదైనా మార్క్ ని కనబర్చారు. ‘బోమన్ ఇరానీ’, తదితర ఆర్టిస్టులు తమ పరిధి మేరకు రాణించారు.

సాంకేతిక విభాగం:
కథలో కొత్తధనం లేకపోయినప్పటికీ, కథని బలంగా చెప్పడంలో చిన్నపాటి పొరపాట్లు ఉన్న, దర్శకుడు ‘రాజ్‌కుమార్ హిరానీ’, సినిమాని గట్టెంకిచ్చారు. ప్రీతమ్ అందించిన ‘ఆర్ఆర్’ సినిమాకు ప్రాణం పోశాయి. కెమేరామ్యాన్ ‘సీకే మురళీధరన్’ వర్క్ సూపర్బ్. ఎడిటర్ వంద శాతం న్యాయం చేశాడు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్

గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page