చిత్రం : సలార్ సీజ్ ఫైర్ – పార్ట్ 1
రేటింగ్ : 3.5/5
బాటమ్ లైన్ : ప్రభాసుడి నట విశ్వరూపం, సలార్ .
విడుదల తేదీ : 2023 డిసెంబర్ 22
నటీ నటులు : ప్రభాస్, శృతీ హాసన్ , ప్రిథ్వీరాజ్ , జగపతి బాబు , శ్రీయా రెడ్డి, బాబీ సింహా , టిన్ను ఆనంద్ , ఈశ్వరి రావ్ , బ్రహ్మాజీ తదితరులు
డిఓపి: భువన్ గౌడ
సంగీతం: రవి బస్రుర్
ఎడిటర్ : ఉజ్వల్ కులకర్ణి
కథ : ప్రశాంత్ నీల్
నిర్మాత : విజయ్ కిరగండూర్
బ్యానర్ : హోంబేలె ఫిలిమ్స్
దర్శకుడు : ప్రశాంత్ నీల్
పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ , శృతీ హాసన్ జంటగా నటించిన చిత్రం “సలార్ సీజ్ ఫైర్ – పార్ట్ 1”, కన్నడ దర్శక ధీరుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో , హోంబేలె ఫిలిమ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగండూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో ఏళ్ళ ప్రభాస్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది, మొత్తానికి సలార్ ఒక మాస్ ఎంటర్టైనర్ గా మంచి స్పందనని గెలుచుకుంది . కొన్ని నెలల ముందు విడుదల అయిన టీజర్ కి కొంత మద్దతు తగ్గినప్పటికీ, విడుదలకి ముందు రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్ చిత్రం మీద అసలు ఆకాశానికి ఎత్తేశాయి. ఈ చిత్రం డిసెంబర్ 22, 2023 న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఫాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూసిన ఈ చిత్రం విషయాలను విశ్లేషకుడి మాటలు తెలుసుకుందాం.
కథ : దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం భారతదేశంలో దారి దోపిడీ చేసే తెగ ఉండేది. వాళ్ళల్లో వాళ్ళు మూడు తెగలుగా విడిపోయి, కలిసికట్టుగా పాలించుకుంటున్నారు . అలాగా దోపిడీ చేసిన సొత్తుని ఖాన్సార్ అనే ప్రదేశంలో దాచేవాళ్ళు. ఆ ప్రదేశాన్ని స్థాపించింది మన్నార్ వంశస్తుడు శివ మన్నార్ . ఆయనే పాలకుడు . బ్రిటిష్ సామ్రాజ్యం కూడా ఆ ప్రదేశంలోకి వెళ్లలేకపోయింది. మన్నార్ తెగ తరువాత అంతటి బలం ఉన్న తెగ శౌర్య తెగ. మన్నార్ తెగకి చేసింది రాజ మన్నార్ (జగపతి బాబు) తన తండ్రి తరువాత తానే కుర్చీని అధిష్టించాలి అని చేసిన కుట్రలవలన సమస్యలు మొదలవుతాయి. ఆ సమస్యలవలన తన కొడుకు వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ ) తన ప్రాణ స్నేహితుడు అయిన దేవరథ (ప్రభాస్) తో విడిపోతాడు . 25 సంవత్సరాల తరువాత, తన స్నేహితుడికి తన అవసరము ఉండటంతో, తాను పుట్టి పెరిగిన ఊరికి తిరిగొస్తాడు . ఈ సమస్యల మధ్య తను తన తల్లితో అజ్ఞ్యాతంలో బర్మా బోర్డర్ దగ్గర ఒక ఊరిలో నివాసం ఉంటారు . అసలా దేవా కి ఆధ్యా కి (శ్రుతీ హాసన్ ) సంబంధం ఏమిటి . ఎందుకని తన తల్లితో ఊరికి దూరంగా ఉన్నాడు . ప్రాణ స్నేహితులు అయినా దేవా, వరద ఎందుకు భద్ర శత్రువులు అయ్యారు అనేది మిగతా కథ. తన స్నేహితుడి తలరాతను, ఖాన్సార్ తలరాతను మార్చిన వాళ్ళ స్నేహం గురించి తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే.
కథనం , విశ్లేషణ : ప్రశాంత్ నీల్ చేసింది మూడు చిత్రాలు అయినప్పటికీ ఆయనకి ఉన్నత పాత్రల విశ్లేషణ మరెవ్వరి దగ్గర కనిపించలేదు. ఒక ఊహా ప్రపంచాన్ని అంత అందంగా,క్రూరంగా ఒకే సమయంలో చూపించారు అయన . బాహుబలి తరువాత అలంటి మాస్ అవతారంలో ప్రభాస్ ని చూడలేదు మనం . కానీ దేవా పాత్ర ఒక విస్పోటం. ఇద్దరు స్నేహితులు తమ స్నేహం కోసం ఎంత దూరం వెళతారు , వాళ్ళ మధ్య వచ్చిన విభేదాలు ఏమిటి అనేది కథ . కథ పరంగా కొంచం ఎక్కడో వినట్టు అనిపించినప్పటికీ , ప్రశాంత గారు తీసిన విధానం వీరోచితంగా ఉంది. ప్రభాస్ గారిని ఇలాంటి విస్ఫోటకమైన పాత్రలో ఎప్పుడు చూడలేదు ప్రేక్షకులు . ప్రభాస్ ని ఆ రేంజ్ లో చూపించారు అయన . ఊహ ప్రపంచం అయిన ఖాన్సార్ అనే సామ్రాజ్యంలో ఎన్నో తరాలుగా వస్తున్న బందిపోట్ల జీవన శైలిని ఆధారంగా తీసుకుని కథ రచించారు . ఈ జీవన శైలికి ఒక స్నేహపు అనురాగాన్ని జోడించారు.
మొదటి భాగం : పాత్రలని పరిచయం చేసిన విధానం కొంచం కొత్తగా ఉంది. కథ వెనకాల చెబుతూనే , పాత్రలని పరిచయం చేసారు. కథానాయకి పాత్రకి ఇచ్చిన ప్రాముఖ్యత ఆకట్టుకుంది. ఇద్దరు చిన్ననాటి మిత్రుల స్నేహం, విడిపోయేటప్పుడు కలిగిన బాధ , తన కొడుకు గురించి తల్లి పడే ఆవేదన. అన్ని కలగలిపి మొదటి భాగంలో దేవా పాత్రలో ఉన్న వైవిధ్యమైన అంశాలని చూపించారు. ఇంటర్వెల్ పోరాట సన్నివేశానికి వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. ప్రభాస్ స్క్రీన్ ప్రెజన్స్ వేరే లెవెల్లో ఉంది.
రెండొవ భాగం : ఖాన్సార్ పూర్వ వృత్తాంతం, తేగల మధ్య ఉన్న గొడవలు, స్నేహితుడి కోసం తిరిగొచ్చిన దేవా ఏం చేసాడు. అసల ప్రాణ స్నేహితులు అయిన వాళ్ళు ఇద్దరు ఎందుకు శత్రువులు అయ్యారు, దేవా కి, చిన్నప్పుడే వరద సలార్ అని ఎందుకు పేరు పెట్టాడు అనేది రెండొవ భాగం. రెండొవ భాగం చివరిలో , తరువాత కొనసాగింపుకి ఉంచిన ట్విస్ట్ సినిమాలోనే చూడాలి..
చిత్రీకరణ, సంగీతం, పోరాటాలు, కథ, అన్ని బాగునపాటికి మాములు సినీ ప్రియులకంటే, ప్రభాస్ అభిమానులకి ఈ చిత్రం ఒక పండుగ. ఒక రాక్షసుడిని చూసినట్టు అనిపించింది ప్రభాస్ ని చూడగానే.
నటీనటులు:
దేవరథ పాత్రలో ప్రభాస్ జీవించిన విధానం తన పెదనాన్న గారిని తలపించింది. పోరాట సన్నివేశాలలో ఒక రాక్షస యోధుడిగా చేసారు ప్రభాస్. బాహుబలి తరువాత సరైన విధంగా ఆయనని ఉపయోగించుకోలేదు. కానీ ప్రశాంత్ నీల్ గారు ఉపయోగించుకుని చేసిన సలార్ ఒక అణుబాంబు లాగా పేలింది. ఆధ్యా పాత్రలో శృతీ హాసన్ నటన మెచ్చుకోతగ్గట్టుగా ఉంది . ప్రభాస్ తల్లిగా ఈశ్వరి గారి నటన చాలా ముఖ్యపాత్ర పోషించింది ఈ చిత్ర విజయానికి. ప్రతి నాయకి పాత్రలో శ్రీయ రెడ్డి గారు, గరుడ అబ్బురపరిచారు. జగపతి బాబు గారు కనిపించిన కొద్దీ పాటి సమయంలోనే తన నటన సౌరత్వాన్ని ప్రదర్శించారు . తెరమీద చూడటానికి చాలా మంది నటులు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన పాత్రలకి న్యాయం నూరు శాతం చేసారు. పోరాట సన్నివేశాలకి ప్రభాస్ ని చూపించిన విధానం చూడ ముచ్చటగా ఉంటుంది .
సాంకేతిక విభాగం : రవి బసృర్ ఇచ్చిన సంగీతం, పోరాట సన్నివేశాలకి ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి నరంలో రక్తాన్ని ఉర్రుత పరిచేలా ఉన్నాయి. ఉజ్వల్ చేసి ఎడిటింగ్ ప్రశంసనీయం . నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా చూసుకున్నారు నిర్మాతలు. కెజిఫ్ మాదిరిగానే పోరాట సన్నివేశాలలో కట్ షాట్స్ పెట్టకుండా తెరెకెక్కించారు . ప్రభాస్ ని ఒక మాస్ అవతారంలో చూపించే ప్రయత్నం చేసిన ప్రశాంత్ నీల్ గారి ప్రయత్నానికి సలాములు. ఊహా ప్రపంచాన్ని తాను అనుకున్న విధంగా చూపించిన విధానం ప్రశంసనీయం .
రివ్యూ బై: సాయిరాం తాడేపల్లి