గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్ ఆన్’. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్ గా విడుదలకు సిద్దమవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ…`గేమ్ ఆన్ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
త్వరలో మిగతా పాటలు, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాను ఫిబ్రవరి 2న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రథం చిత్రంతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న గీతానంద్ ఈ చిత్రంతో హీరోగా నెక్ట్స్ లెవల్ కు వెళ్తాడన్న నమ్మకం ఉంది. అలాగే నేహ సోలంకి తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటుంది. దర్శకుడు దయానంద్ కథ చెప్పిన దానికన్నా కూడా చిత్రాన్ని అద్భతంగా తెరకెక్కించాడు. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. ఈ చిత్రం కోసంమంచి స్టార్‌క్యాస్ట్ తీసుకున్నాం. కీలక పాత్ర పోషించిన మధుబాల గతంలో ఉన్నడూ చేయని పాత్ర ఇందులో చేశారు.
న్యూఏజ్ కథతో రూపొందిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది. ‘కార్తికేయ 2’తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య మీనన్ ఈ సినిమాలో కూడా ఓ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో నటించాడు. ప్రజంట్ విభిన్నమైన కథలతో వచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ కోవలో వస్తోన్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నాం“ అన్నారు.
దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి.
ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి ,రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి? ఈ గేమ్ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ‘గేమ్ ఆన్’ సినిమా తెరకెక్కింది. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. కచ్చితంగా మా సినిమా ప్రేక్షకులకు న్యూ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందన్నారు.
గీతానంద్, నేహా సోలంకి, ఆదిత్య మీనన్, మధుబాల, వాసంతి, కిరిటీ, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ డైరక్టర్; అభిషేక్ ఏ ఆర్; సాంగ్స్ః నవాబ్ గ్యాంగ్, అశ్విన్ – అరుణ్; సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్; స్క్రిప్ట్ సూపర్ వైజర్ : విజయ్ కుమార్ సి.హెచ్ ; ఎడిటర్ : వంశీ అట్లూరి; ఆర్ట్ః విఠల్; యాక్షన్ కొరియోగ్రఫీః రామకృష్ణ. నభా స్టంట్స్; స్టైలింగ్ః దయానంద్; పిఆర్ఓః జి.కె మీడియా; కొరియోగ్రఫిః మోయిన్; నిర్మాత: రవి కస్తూరి; కథ-స్ర్కీన్ ప్లే-డైలాగ్స్-డైరక్షన్: దయానంద్.