చిత్రం: ‘హనుమాన్’
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: ““Hanuman: A Cinematic Marvel that Uplifts the Spirit”
విడుదల తేదీ: జనవరి 12, 2024
నటి నటులు: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు….
డీఓపీ: శివేంద్ర
ఎడిటర్: ఎస్.బి. రాజు తలారి
సంగీతం: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్
బ్యానర్: ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: కె.నిరంజన్ రెడ్డి
కథ, కధనం, దర్శకుడు: ప్రశాంత్ వర్మ
అతి చిన్న వయసు నుంచే టాలీవూడ్ స్టార్ హీరోస్ కి చైల్డ్ హీరో గా చేసి నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో ‘తేజ సజ్జ’. తేజ సజ్జ, అమృత అయ్యర్ హీరో హీరోయిన్ గా, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని ప్రధానపాత్ర లో నటించిన చిత్రం ‘హనుమాన్’. ఈ చిత్రానికి ‘ప్రశాంత్ వర్మ’ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి పండగ సంధర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒక రోజు ముందు గానే ఈ సినిమాను ప్రీమియర్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనేది మనం రివ్యూలో చూద్దాం?
కథ:
‘అంజనాంద్రి’ గ్రామంలో ‘హనుమంతు (తేజా సజ్జా) ఒక ఆకతాయి చలాకి దొంగ. తన అక్క అంజనమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్)తో కలిసి ఉంటాడు. ఆ గ్రామంలో ‘పాలెగాడు’ కి ఎదురు వెళ్లిన, మాట్లాడిన గ్రామ ప్రజల మీద దౌర్జన్యాలు జరుగుతుంటాయి. ఇదిలా ఉంటే, బలహీనమైన ఒక చిల్లర దొంగ ‘పాలెగాడు’కి ఎదురెళ్లి గ్రామానికి రియల్ హనుమంతుడు ఎలా అయ్యాడు? పాలెగాడు పై ఎదురు వెళ్లేంత శక్తీ ఎలా వచ్చింది? హనుమంతుకు సముద్రంలో దొరికిన ఆ దివ్యమైన మణి ఏంటి? హనుమంతు కి శక్తులు ఉన్నాయని తెలుసుకొన్న మైఖేల్ (వినయ్ రాయ్) ఆ గ్రామానికి వచ్చి ఏం చేసాడు? సూపర్ హీరో కావాలనుకున్న మైఖేల్ పన్నాగాలకు హనుమంతు ఎలా చెక్ పెట్టాడు. అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
విశ్లేషణ:
సూపర్ హీరో సినిమాలు తెరపై వస్తే సగటు ప్రేక్షకుడు వావ్ అనాలిసిందే. అంత ఆదరణ మన ఇండియా లో ఉంది. అదే కోవలోకి వచ్చిన మొదటి తెలుగు సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్’. ప్రతి సూపర్ హీరో సినిమాలకి ఒక రెగ్యులర్ ప్యాట్రన్ ఉంటుంది. అలాంటి ప్యాట్రన్ టచ్ చేస్తూనే, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ‘ప్రశాంత్ వర్మ’ సినిమా తీసాడు.
ఫస్ట్ హాఫ్ లో కాస్త ల్యాగ్ అనిపించినప్పటికీ, కామెడీ టచ్ ఇవ్వడంతో గట్టెక్కింది. హీరో తేజ సజ్జ క్యారెక్టర్ సాధారణంగా పరిచయం చేస్తూ, అల్లరి అల్లరిగా చేసే దొంగతనాలు సింబాలిక్ గా హనుమంతుడితో పోల్చిన విధానం బాగుంది. ఫైట్స్ సీన్స్ కూడా తేజా బాడీ ల్యాంగ్వేజ్ కి నమ్మేలా ఉన్నాయి. విలన్ క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ సీన్స్ బాగున్నాయి. స్కూల్ లో వచ్చే ఫైట్ సీన్స్ కిడ్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. రవితేజ ఇచ్చిన వాయిస్ ఓవర్ చాలా చక్కగా యాప్ట్ అయ్యింది. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ డైరెక్టర్ లిబర్టీ తీసుకున్నారు అని అనుకోవచ్చు.
‘అ!’, ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’… తీసిన మూడు సినిమాలు కమర్షియల్ సినిమాలు కానప్పటికీ, ప్రశాంత్ వర్మ హనుమాన్ తో ఆ కోరిక తీరింది అనుకోవచ్చు. ‘హనుమాన్’ టెక్నికల్‌గా బాగుంది. ఈ సినిమాకి అనుకున్న దాని కన్నా బడ్జెట్ ఎక్కువ కావడం ఒక విధంగా ప్లస్ అనే చెప్పాలి పెట్టిన ప్రతి రూపాయి కనిపించింది. క్లైమాక్స్ 15 నిమిషాలు నేపథ్య సంగీతంతో పాటు, సీన్స్ వేరే లెవెల్.
సో, ఈ సంక్రాంతి కి ఖచ్చితంగా మీ కుటుంభ సభ్యులతో ‘హనుమాన్’ సినిమా తప్పకుండ చుడండి.
నటీనటులు:
‘హనుమంతు'(తేజ సజ్జ) క్యారెక్టర్ లో చాలా సహజంగా నటించి మెప్పించాడు. నేటి తరం యువత హనుమాన్ గా ‘తేజ సజ్జ’ని ఊహించుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. సరైన సినిమాలు పడితే హీరో గా మరో మెట్టు ఎదిగే ఛాయలు కనిపిస్తున్నాయి. ‘అమృత అయ్యర్’ హీరోయిన్ గా బలమైన క్యారెక్టర్ పోషించినప్పటికీ సన్నివేశాలు పండలేదు. పైగా, హీరోయిన్ యాక్టింగ్ మైనస్ అని చెప్పాలి. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర సినిమాకి ప్రధాన బలం. కాకపోతే, కొన్ని సన్నివేశాలకి మాత్రమే పరిమితం అవ్వడం, కొంచెం డిస్పాయిట్మెంట్ అనిపించనప్పటికీ స్క్రీన్ స్పెస్ ఉన్నంత వరుకు యాక్టింగ్ తో రెబల్ ఆడించింది. ఇకపోతే, సత్య సినిమాలో నవ్వుతు నవ్విస్తుంటాడు. వినయ్ రాయ్, సముధ్రఖని, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తమ పరిధి మేరకు అద్భుతంగా నటించారు.
సాంకేతిక విభాగం:
దర్శకుడు ‘ప్రశాంత్ వర్మ’ కథలో కొత్తదనం లేకపోయిన తీసిన విధానం బాగుంది. కాకపోతే, తనకున్న పరిధిలో మంచి ఔట్ ఫుట్ ఇచ్చినప్పటికీ, సగటు ప్రేక్షకుడికి ఎదో మిస్ అయ్యిందనే ఒక వెలితి కనిపిస్తుంది. గ్రాఫిక్స్ పరంగా నెస్ట్ లెవెల్ కాకపొయ్యినప్పటికీ, ఓవరాల్ గా బ్యాలెన్స్ చేసిన విధానం బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ అందించిన ‘ఆర్ఆర్/సాంగ్స్’ పెద్దగా అస్సెట్ కాలేదు కానీ, పర్వాలేదు అనిపించుకున్నాడు. కెమేరామ్యాన్ ‘శివేంద్ర’ విజ్యువల్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.