శ్రీ ఏ. మహేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. భారతదేశంలో సాంఘిక సంక్షేమ రంగంలో ఆయన చేసిన ఆదర్శప్రాయమైన మరియు స్ఫూర్తిదాయకమైన పనికి ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డుని ఇవ్వడం జరిగింది. ఏ ఎం ఆర్ గ్రూప్ అధినేత ఏ మహేష్ రెడ్డి గారు వ్యాపారాన్ని మొదలుపెట్టిన అతి కొద్ది కాలంలోనే ఉన్నత యువ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఈరోజు మైనింగ్ వ్యాపారంలో నెంబర్ 1 స్థానంలో నిలబడ్డారు. ప్రస్తుతం 5000 మంది పనిచేస్తున్న కంపెనీలో కనీసం లక్ష మంది ఉద్యోగాలు కల్పించాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. షిరిడి సాయినాధుని ఎల్లప్పుడూ కొలిచే భక్తునిగా షిరిడీలోని మందిరానికి బంగారు సింహాసనాన్ని దానం చేశారు. అదేవిధంగా ఈయన ఆంధ్ర రాష్ట్రంలోనే కాక భారత దేశం లో పలు చోట్ల దైవ మందిరాలు కట్టించారు. శ్రీశైలం, కాణిపాకం, నెల్లూరులోని రామతీర్థం, శ్రీ రాజరాజేశ్వర టెంపుల్, శ్రీ పృద్వేశ్వర టెంపుల్ వంటి గుడి లు తన సొంత ఖర్చుతో మరమ్మతులు చేయించారు. ఆయన గతంలో సాయి ప్రేరణ ట్రస్ట్ సంబంధించి సాయి తత్వాన్ని బోధించే విధంగా చేసిన సేవలకు ‘మాలిక్ ఏక్ సుర్ అనేక్’ అవార్డుతో ఆయనను సత్కరించారు. కోవిడ్ పాండమిక్ సమయంలో ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలకు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. హైదరాబాదులో అనేక హెల్త్ క్యాంపులు నిర్వహించారు. అదేవిధంగా అయోధ్య శ్రీ రామ జన్మభూమికి కోటి రూపాయలు విరాళం అందించారు. ఏ ఎం ఆర్ ప్రొడక్షన్స్ ద్వారా భక్తి తత్వాన్ని బోధించే విధంగా రెండు తెలుగు సినిమాలను నిర్మించారు. అదేవిధంగా ఏ మహేష్ రెడ్డి గారు 148 కేజీల బంగారాన్ని సాయిబాబా సనాతన ట్రస్ట్ షిరిడి కి విరాళంగా అందజేశారు.
నేడు ఆయన చేసిన సేవకులను ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును మంగళవారం రాత్రి హోటల్ గ్రాండ్ హయత్ ముంబైలో ఘనంగా ఏర్పాటు చేసినటువంటి అవార్డు ఫంక్షన్లో ఫార్మర్ చీఫ్ జస్టిస్ మరియు ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఎన్ హెచ్ ఆర్ సి ఇండియా కే. జీ. బాలకృష్ణన్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.