చిత్రం: యాత్ర2
విడుదల తేదీ: 08.ఫిబ్రవరి.2024
రేటింగ్: 3.75/5
బాటమ్ లైన్: ఫ్యామిలీ ఎమోషనల్ రైడ్ ‘యాత్ర2’
నటి నటులు: మమ్ముట్టి, జీవా, కేతకి నారాయణ్, సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, ఆశ్రీత వేముగంటి, శుభలేఖ సుధాకర్ తదితరులు..
ఎడిటర్: స్రావం కటికనేని
సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణ్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: మది
నిర్మాత: శివ మేక
మూవీ బ్యానర్: త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: మహి వి రాఘవ్
వైఎస్సార్(YSR) బయోపిక్ గా ‘యాత్ర’ చిత్రం తెరకెక్కి ప్రేక్షకుల నుండి అశేష ఆదరణ పొందింది. ఇప్పుడు ‘యాత్ర’ కి కొనసాగింపు గా ‘యాత్ర 2’ జగన్ బయోపిక్ గా వచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడు ‘మహి వి రాఘవ్’. వైఎఎస్ఆర్ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించగా, జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటించారు. నేడు ఈ ‘యాత్ర 2’ సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా, త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే, విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులని నుండి అనుహ్య స్పందన రావడంతో పాటు, మేకర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచారు. ఫెబ్ 8న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.
కథ: వైఎస్సార్(మమ్ముట్టి) 2009 ఎన్నికల్లో తన కొడుకు జగన్(జీవా)ని కడప ఎంపీగా ప్రజలకు పరిచయం చేస్తాడు. కొడుకు ఏపీలో విజయం సాధించి, వైఎస్సార్ సీఎం గా నెగ్గుతాడు. అనంతరం వైఎస్సార్ మరణం తరువాత కథలో అనూహ్య మలుపులు, పరిణామాలు చోటుచేసుకుంటాయి. తండ్రి చనిపోవడం తో శోక సంద్రంలో ఉన్న ప్రజలని పరామర్శించడానికి జగన్ ఓదార్పు యాత్ర చేస్తాడు. కాకపోతే, హైకమాండ్ ధిక్కరించడం. ఆ తరువాత దానికి ఎగినెస్ట్ గా జగన్ ప్రత్యేక పార్టీ పెట్టడం, బై ఎలక్షన్స్ లో గెలవడం జరిగిపోతాయి. అయ్యితే అధికారంలో ఉన్న పార్టీ, ప్రతి పక్ష పార్టీ కుమ్మకై, జగన్ పై సిబిఐ దాడులు, అరెస్ట్ చేస్తారు. అతి చిన్న ఏజ్ లోనే అన్ని ఓడిదుడుకలని తట్టుకొని ‘జైల్’ నుంచి ఎలా బయటికి వచ్చాడు? చివరికి, ఎలక్షన్ లో చంద్రబాబు(మహేష్ మంజ్రేకర్) మీద రెండొవ సారి ‘సీఎం’ గా గెలిచాడా? ఓడిపోయాడా? ప్రోగ్రెస్ పార్టీ ని జగన్ భూస్థాపితం ఎలా చేసాడు? అనేది తెలుసుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండ థియేటర్ లో సినిమా చుడాలిసిందే?
విశ్లేషణ: దివంగత మహానేత వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రఫికల్ మూవీ ‘యాత్ర’. ఇప్పుడు, దానికి కొనసాగింపు గా ‘యాత్ర2’ వచ్చింది. ‘వైఎస్సార్’ తనయుడు ‘జగన్ మోహన్’ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా సంకల్ప’ యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నిజ జీవితంలో అయన కథ ప్రేక్షకులకి తెలియడంతో కథనంపై దర్శకుడు చాలా శ్రద్ధ పెట్టాడు. ఈ చిత్రం పొలిటికల్ సినిమా అయ్యినప్పటికీ, తండ్రి ఇచ్చిన మాట కోసం నిజ జీవితంలో ఎన్ని ఓడిదుడుకులు వచ్చిన కొడుకు దాన్ని ఎలా నిలబెట్టాడు అనే కథని ఎమోషనల్ గా తీర్చిదిద్దారు?.
2009 – 2019 మధ్యకాలంలో రాజకీయాల్లో జరిగిన మలుపులు, కొన్ని చరిత్రాత్మక ముఖ్య ఘట్టాలని తీసుకొని తెరకెక్కించడం విశేషం. సినిమాలో పలు పార్టీలు రాజకీయం చూపిస్తూనే, ఎమోషన్స్ కి పెద్ద పీట వేసాడు దర్శకుడు. సినిమాలో ‘జగన్’ క్యారెక్టర్ ని చాలా సాధారణ వ్యక్తిగా చూపిస్తూనే, పాత్రకి ఎలివేషన్స్ ఇవ్వడంతో ఒక మనిషి ‘సంకల్ప’ బలం ఏంటో చూపిస్తాడు. సెకండ్ ఆఫ్ లో కొన్ని చోట్ల మాత్రం సాగదీసినట్టు అనిపిస్తుంది. అదే విధంగా, నిజ జీవితంలో షర్మిల చేసిన పోరాట పటిమ సన్నివేశాలు చిత్రంలో లేకపోవడం బాధాకరం. హీరో పవన్ కళ్యాణ్ ని, ఆటలో అరటి పండు లాగా తీసి పడేయటం ఏ మాత్రం బాగోలేదు. అయితే, ఈ రోజుల్లో తెలిసిన ఒక కథని మళ్ళి తెరకెక్కించి ప్రేక్షకులని ఏడిపించటం అనేది మామూలు విషయం కాదు. ఇది కేవలం, దివంగత మహానేత వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డికే చెల్లింది. జగన్ ఓదార్పు యాత్రలో జనాలతో జరిగే సంభాషణలు, చూపించే ప్రేమ ఆప్యాతలు సీన్స్ చూస్తే కంటతడి పెట్టిస్తాయి. సినిమాలో కామిడి ఉంటుందేమో అని ఎక్సపెక్ట్ చేసి రావద్దు. కాకపోతే, డైలాగ్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. ముఖ్యంగా,
గెలిచిన వాడు నిద్రపోవచ్చు – గెలవాలి అనుకున్నవాడు నిద్రపోకూడదు.
నాయకులకి తెలిసినంత రాజకీయం – కార్యకర్తలకి తెలియదు సార్.
దేవుడు నమ్మకం – వైఎస్సార్ నిజం.
ఇలా పలు డైలాగ్స్ సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా చేస్తాయి. సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరుకు ఒక వ్యక్తి ని గాని, పార్టీ ని గాని కించపరిచి చూపించినట్టుగా ఉండదు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కాకపోతే, ఈ కథ మన కథ, మనందరి కథ కొంత మందికి ఈ కథ తో ఎన్నో బంధాలు, అనుబంధాలు ఎమోషనల్ గా ముడిపడి ఉన్నాయి. అలాగే, కొంత మందికి తెర మీద చూపించిన కథ, నిజమైన కథ కాదు అని ఖండించొచ్చు. కాకపోతే, సినిమాని వినోదంగా చూడాలే తప్ప, రాజకీయ కోణంలో చూడకూడదు అనుకునే వాళ్ళకి ఈ చిత్రం చుసిన మరుక్షణం ప్రతి ప్రేక్షకుడు బ్రమ్మరథం పడతారు.
నటి నటులు పెర్ఫామెన్స్: హీరో ‘జీవా’ తెలుగు తెరకి సుపరిచితుడు. వైఎస్సార్ ‘జగన్’ పాత్ర లో పరకాయ ప్రవేశం చేసాడు. ముఖ్యంగా, ఓదార్పు యాత్ర లో చేసిన నటన అద్భుతం. వైఎస్సార్ పాత్రలో నటించిన ‘మమ్ముట్టి’ కనిపించనంత సేపు తన చెరిష్మా తో ఆకట్టుకునేలా పెర్ఫామెన్స్ చేస్తారు. ఇక జగన్ భార్య పాత్ర లో నటించిన ‘కేతకి నారాయణ్’ స్క్రీన్ స్పెస్ ఉన్నంత వరుకు నటనతో మెప్పించారు. చంద్రబాబు పాత్రలో ‘మహేష్ మంజ్రేకర్’, సోనియాగాంధీ పాత్రలో ‘సుజన్నే బెర్నార్ట్’, వైఎస్ భార్య పాత్రలో ఆశ్రిత వేముగంటి మిగిలిన నటీనటులు కూడా యాక్టింగ్ లో బాగానే రాణించారు.
సాంకేతిక విభాగం: డైరెక్టర్ ‘మహి వి రాఘవ్’ కథ ఎంచుకున్న తీరు, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా మలిచిన విధానం సూపర్బ్. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు ఎమోషనల్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఎమోషనల్ సీన్స్ లతో పాటు, జగన్ పాత్రకి ఎలివేషన్స్ లో ఇచ్చిన BGM హైలెట్ గా నిలుస్తుంది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఏ మాత్రం తీసిపోకుండా రిచ్ గా తెరకెక్కించారు.
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.