ఆనంద్ దేవరకొండ హీరో గా కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కే.ఈ.జ్ఞానవేల్ రాజా తన “స్టూడియో గ్రీన్” బ్యానర్ పై “డ్యూయెట్” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం లో “హాయ్ నాన్న” ఫేమ్ రితిక నాయక్ హీరోయిన్ గా చేస్తుండగా మిథున్ వరదరాజ కృష్ణన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.గతంలో ఏ.ఆర్.మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఇతను తొలిసారి దర్శకత్వం వహించబోతున్నాడు.కాగా తాజా గా ఈ చిత్రం విశాఖ లో షూటింగ్ జరుపుకుంది.
విశాఖ లోని తేనేటి పార్క్ సమీపం లో హీరో,హీరోయిన్ల పై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు.ఐతే షూటింగ్ చూసేందుకు స్థానిక ప్రజలు క్యూ కట్టారు.ప్రస్తుతం ఆ ప్రాంతం సందర్శకులతో నిండిపోయింది.ఇప్పటికే 70శాతం పూర్తిచేసుకున్న ఈ చిత్రం మరికొన్ని రోజుల పాటు ఇక్కడే షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది.మార్చ్ నెలాఖరుకి మొత్తం షూటింగ్ పూర్తి చేసి మే లేదా జూన్ నెలల్లో ఈ చిత్రాన్ని విదుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.