మనం చూసే చిత్రాలకి ఒక సర్టిఫికెట్ ఉంటుంది. దానిలో ఉండే రేటింగ్ బట్టి మనం కుటుంబ సమేతంగా చూడాలా వద్ద అనేది నిర్ణయిస్తాం. ఒక ఉత్తర్వు కూడా ఉంది, సినిమా కి సెన్సారు సర్టిఫికెట్ ఇవ్వకుండా టికెట్స్ విక్రయించకూడదు, విడుదల తేదీ వెల్లడించకూడదు. కానీ ఈ మధ్య ఈ నిభందనని కొన్ని చిత్రాల నిర్మాణ సంస్థలు పెడచెవిన పెడుతున్నాయి అనీ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. లోతుగా విశ్లేషిస్తే అది నిరూపణ అయ్యింది కూడాను. మన తెలుగు చిత్ర నిర్మాతల మండలి జాయింట్ సెక్రెటరీ అయిన నట్టి కుమార్ గారు ఈ విషయం మీద స్పందించారు, అదే విషయాన్నీ సెన్సార్ బోర్డు చైర్మన్ కి ఒక లేఖలో వివరంగా వెల్లడించారు.
వివరాలలోకి వెళితే, సందీప్ కిషన్ కథానాయకుడిగా, విఐ. ఆనంద్ దర్శకత్వంలో విడుదలకి సిద్ధంగా ఉన్న చిత్రం “ఊరు పేరు భైరవకోన”. అసల ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల అవ్వాల్సి ఉండగా, కొన్ని కారణాల వలన ఫిబ్రవరి 16న విడుదలకి సిద్ధంగా ఉంది. కాకపోతే అసలైన సమస్య ఏమిటి అంటే, ఆ చిత్రం బృందం సెన్సార్ సర్టిఫికెట్ తీసుకోకుండానే, టికెట్లను బుక్ మై షో ద్వారా విక్రయించటం మొదలు పెట్టారు. ఈ ఒక్క చిత్రమే కాకుండా ఇంకా చాలా చిత్రాలు సెన్సార్ సర్టిఫికెట్ కోసం వేచి చూస్తుంటే, ఈ సమస్య రేకెత్తబోతోంది అని అనుమానంతో ఎలాగోలా సర్టిఫికెట్ పనులు ముగించారు చిత్ర బృందం. క్యూ పద్దతి పాటించకుండా అలా ఎలాగ సెన్సార్ పనులు ముగిస్తారు అని నట్టి కుమార్ ఆ లేఖలో వెల్లడించారు. సెన్సార్ సర్టిఫికెట్ విడుదల అవ్వకుండా చిత్రం విడుదల తేదీ, టికెట్ అమ్మటం లాంటివి చెయ్యకూడదు, అలా చేసినందుకు చిత్ర బృందం మీద తక్షణంగా విచారణ చేపట్టాలని ఆయన ప్రస్తావించారు.
ఈ ఒక్క చిత్రమే కాదు, ఫిబ్రవరి 8న విడుదల అయినా “యాత్ర 2” చిత్రం కూడా ఇచ్చే పంధాలో వెళ్ళింది. ఇప్పటికే విడుదల అయిన కారణంగా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి. ఇవి ఒక్కటే కాదు, సెన్సార్ సర్టిఫికెట్ ప్రక్రియ చాలా పక్షపాతంగా ఉందని కూడా వెల్లడించారు. పెద్ద నిర్మాణ సంస్థలకి త్వరగా సెన్సో ప్రక్రియ చేపడుతున్నారు, చిన్న చిత్రాలకి ఎదురు చూపులు మిగులుతున్నాయి. ఇలాంటి పద్దతిని రూపుమాపటానికి వెంటనే తక్షణ విచారణ జరపాలని ఆయన కోరారు. చిన్న పెద్ద తేడాలేకుండా అందరికీ సమానంగా ఈ సెన్సార్ సర్టిఫికెట్ ప్రక్రియ జరిగేలా చూడామని విన్నవించుకున్నారు. సెన్సార్ చైర్మన్ నుంచి ఇంకా సమాచారం రావలసిఉంది. అన్ని చిత్రాల గురించి అలోచించి ఈ విన్నపం చెయ్యటం ప్రశంసనీయం.