తమిళ చిత్ర పరిశ్రమ నుంచి మన తెలుగు ప్రేక్షకులు తమ సొంత హీరోలకి సరిసమానంగా ప్రేమించి ఆదరించే హీరోలలో సూర్య, విక్రమ్ ముఖ్యులు. రజనీకాంత్, కమల్ హాసన్ తరువాత అంతటి ప్రేమా ఆదరణ పొందిన తమిళ నటులలో వీళ్ళ ఇద్దరూ ముందు వరసలో ఉంటారు. ఇప్పుడు వీళ్ళ ఇద్దరూ చెరొక సినిమాతో విడుదల చెయ్యటానికి రెడీ గా ఉన్నారు. కాకపోతే చాలా సమస్యులు ఎదురుకొంటున్నాయి ఈ చిత్రం బృందాలు విడుదల చెయ్యటానికి.
అసలు విషయానికొస్తే విక్రమ్ కథానాయకుడిగా సోసియో ఫాంటసీ తరహాలో పా రంజిత్ దర్శకుడిగా తీర్చిదిద్దిన చిత్రం “తంగలాన్”. మాళవిక మోహనన్ కథానాయకి. స్టూడియో గ్రీన్ ప్రతిస్థాపకులు కె.ఈ. జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానిలో విక్రమ్ గారి వేషధారారణ, హావభావాలు అన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇందులో ఆయన ఒక ట్రైబ్ కి సంబందించిన వ్యక్తి. ఇదే స్టూడియోస్ గ్రీన్ సంస్థ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఇంకో చిత్రం “కంగువా”. సూర్య గారు కథానాకుడిగా చేస్తున్నారు, బాలీవుడ్ తారలు దిషా పఠాని, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శివ గారు దర్శకత్వం చేస్తున్నారు. దేశీయ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు ఈ చిత్రాన్ని.
లెక్క ప్రకారం తంగలాన్ ఈ జనవరి 26వ తేదీన విడుదల అవ్వాలి. కానీ వేసవి కాలానికి పోస్టుపోన్ చేసారు. కారణాలు అడిగితే, ఈ చిత్రాన్ని ఆస్కార్ కి పంపించే ఆలోచనలో ఉన్నాము అందుకని అన్నీ పగడ్బందీ గా చూసుకుంటున్నాం. గ్రాఫిక్స్ మీద ఎక్కువ ద్రుష్టి సరిస్తున్నాం, అందుకనే విడుదల లేట్ అవుతోంది అంటున్నారు. “కంగువా” విషయానికొస్తే, సూర్య పాత్ర వరుకు చిత్రీకరణ అయ్యింది, ఇంకా చాలా పాత్రల చిత్రీకరణ ఇంకా పూర్తికాలేదు. ఈ చిత్రానికి కూడా భారీ తారాగణం, భారీ బడ్జెట్, భారీ గ్రాఫిక్స్ ఉన్నాయి. సూర్య 4 విభిన్న వేషధారణలో కనిపిస్తారని వార్తలు కూడా ఉన్నాయి. కానీ అసలు విషయానికొస్తే ఈ నిర్మాణ సంస్థ అయిన స్టూడియో గ్రీన్ దగ్గర డబ్బు సమస్య వచ్చింది అని తెలుస్తోంది. ఒకేసారి రెండు భారీ చిత్రాలని నిర్మిస్తున్న ఈ సంస్థకి కొంత ఆర్ధిక సమస్య వచ్చింది అని, ఫైనాన్సియల్ సపోర్ట్ కోసం చూస్తున్నారని, అందుకనే ఈ రెండు చిత్రాలు వాయిదా పడుతున్నాయి అని చెప్పుకొస్తున్నారు. ఇది ఎంత వరుకు నిజం అన్న విషయం తెలీదు కానీ, వాయిదాలు మాత్రం పడుతూనే ఉన్నాయి. చూడాలి ఇవి ఎప్పుడు విడుదల అవుతాయో.