బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలకి థియేటర్స్ లో రెస్పాన్స్ ఎలా ఉన్నపటికీ యూట్యూబ్ లో మాత్రం ఆయన సినిమాలు సూపర్ హిట్. థియేట్రికల్ రన్ లో భారీ డిజాస్టర్స్ అయిన సినిమాలు సైతం యూట్యూబ్ లో సునాయాసంగా మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధిస్తాయి. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఇతడి సినిమాలకి మంచి డిమాండ్. తెలుగులో ప్లాప్ అయిన “అల్లుడు శీను”, “సీత” లాంటి సినిమాలు హిందీలో డబ్ అయ్యి వందకు పైగ మిలియన్ వ్యూస్ సాధించాయి. ఆ ధైర్యంతో నే తెలుగు లో సూపర్ హిట్స్ లో ఒకటైన “ఛత్రపతి” సినిమాని హిందీలో రీమేక్ చేసి చేతులుకాల్చుకున్నారు. ఈ సినిమాకి కనీసం పోస్టర్ వెయ్యటానికి వాడిన డబ్బులు కూడా తిరిగి రాలేదు. ఇంక విషయానికొస్తే మరోసారి బెల్లంకొండ హిందీ లో తన సత్తా చాటారు. బెల్లంకొండ-బోయపాటి కంబినేషన్లో వచ్చిన “జయ జానకి నాయక” సినిమా హిందీలో మరో అరుడైనా ఫీట్ సాధించింది. ఈ సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్ లో ఏకంగా 800మిలియన్ వ్యూస్ సాధించి ఒక సరికొత్త రికార్డు నెలకొల్పింది.ఈ సినిమా హిందీ వెర్షన్ని యూట్యూబ్ లో దాదాపు 80కోట్ల మందికి పైగా వీక్షించారు. హిందీ లో ఇప్పటి వరకు కె.జి.ఫ్ చిత్రమే అత్యధిక వ్యూస్ సాధించిన సినిమ. ఈ సినిమా ఇప్పటి వరకు 700మిలియన్ వ్యూస్ సాధించి టాప్ లో ఉంది. ఈ సినిమా రికార్డుని తాజాగా “జయ జానకి నాయక” సినిమా బ్రేక్ చేసింది. 800మిలియన్ వ్యూస్ తో టాప్ లో ఉంది. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్, ఖాన్స్ కి కూడా సాధ్యం గాని రికార్డు ని బెల్లంకొండ శ్రీనివాస్ సాధించారు. ప్రస్తుతం సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో “టైసన్ నాయుడు” అనే సినిమా చేస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమా అయిన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఆశించిన ఫలితం ఇస్తుందో లేదో!